పుట:Ananthuni-chandamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జఘనచపలార్య—

మొదలిసగము చపలార్యా
స్పదగణలక్షణము సౌరక+చరమార్థం
బుదితప్రకారరేఖన్
గదాధరా! చను జ+ఘనచపలన్.

(పుట.67)


గీతి—

లసదార్యమొదలి సగమున
నెనగఁగ రెండరలు చెప్పి + రే నది గీ
తిసమాహ్వయమగుఁ గృతులన్
వసుధాధర కృష్ణ యాద + వస్వామీ.

(పుట.67)


ఉపగీతి—

ధర నార్యమీఁదిసగమున
నిరుసగమున చెప్పి + రే నది దాఁ
బరగు నుపగీతి యనఁగా
సరసిజదళనేత్ర + శార్ఙ్గధరా.

(పుట.67)


ఉద్గీతి—

విదితార్యచరమదళమున్
మొదలి సగము చేసి + మొదలిసగం
బది యపరార్థముఁ జేసిన
బొదువగు నుద్గీతి భుజగ + భుగ్గమనా.

(పుట.67)

నేనుచూచిన (పరవస్తువారి) ప్రతిలో మొదటివి రెండున్ను కాక తక్కినవన్నీ నేనిక్కడ చూపించినట్లే ఉన్నవి. మొదటిది ఇప్పుడు ముద్రితమైనప్రతిలో ఉన్నట్లేఉన్నది; రెండవదానిలో రెండవపాదము నేను చూపించినట్లే ఉన్నది.