పుట:Ananthuni-chandamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కృతమున ఉన్న ఆర్యలయిదింటికిన్ని సామాన్యలక్షణము:-

“లక్ష్మైతత్ సప్తగణా, గోపేతాభవతి నేహ విషమేజః।
షష్ఠోజశ్చనలఘువా, ప్రథమార్థే నియతమార్యాయాః॥
షష్ఠే ద్వితీయలాత్పర, క్లేన్లేముఖలాచ్చసయతిపద నియమః।
చరమే౽ర్థేపంచమ కే, తస్మాదిహ భవతి షష్ఠోలః॥"

4+4+4
4+4+1|+3|+4+4
4+4+4
4|+4+1|+4+2

అంకెలు మాత్రాసంఖ్యను నిలువుగీతలు యతిస్థానములను తెలియజేయును.

(రెండవపాదము మూడోగణము నలమో జగణమో కావలెను. దానిలో మొదటిలఘువు తర్వాత యతి గనుక 1+3 అని వ్రాయవలసివచ్చినది.) పైని చెప్పిన విషయములు సూత్రప్రాయముగా అనంతుడు III. 3-4 లో చెప్పినాడు. ఈలక్షణము యతిప్రాసనియమములలో కాక తక్కిన విషయములలో సరిపోయినది. కందములో కనబడునట్లు ప్రాసమున్ను సమపాదములలో మూడవగణముతర్వాత వళిన్ని ఉండవలెనని తెలుగులాక్షణికులు చెప్పినారు.

ఇప్పుడు ముద్రితమైన ఛందోదర్పణప్రతిలో ఆర్యాగీతుల లక్ష్యపద్యములు కనబడవు. లాక్షణికుల ఆచారమును అనుసరించి లక్ష్యలక్షణములను ఒక పద్యమందు ఇతరస్థలములలో