పుట:Ananthuni-chandamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నవి; ఎన్నని పేర్కొగలము? ఉ. ఉన్నది, (ఉన్న + అది), ఉన్నవి (ఉన్న +వి), ఉన్నాడు (ఉన్న +వాడు; ఉన్న + ఆడు),[1] చిన్నవి (చిన్న + అవి), రాజవు (రాజు + అవు) ఇటువంటి మాటలు 'చేతిది' వంటివి కావా?

పోషించు, భుజించు మొదలయినవాటిలో మధ్యవర్ణముపై స్వరము విరుగుననుటకు ప్రసిద్ధులయిన పూర్వకవుల ప్రయోగములున్నవి:—

1. సందియం బీరమణీయకాంతి నుప+మింపఁగ.(ఆది ప. V. 155)

2. ఇరవు గదాధార గొని భు+జించుట యొప్పు. (పద్మపు II. 93)

3. ఎక్కబఠించునంతకు వ+రించుట. (పద్మపు. III. 170)

రేఫయుతయతి:— ఈయతిభేదము అనంతు డెందుకు చెప్పినాడో తెలియదు, "తెనుగుమాటలలో ఋకారముండదు; స్రుక్కు, క్రుమ్ము మొదలయిన మాటలలో ఉన్నది రేఫ", అని చెప్పియుండును గాని ఇది యొకయతిభేదముగా చెప్పియుండడని నా అభిప్రాయము, అందుచేతనే పట్టికలో దీనికి వేరేసంఖ్య చూపక

  1. శృంగారనైష. III. 120. టీ. “నముచి దమనుండు పుత్తించినాడు"లో యతి తప్పని బ్ర॥ వేదము వేంకటరాయశాస్త్రులవారు దిద్దినారుగాని, ఈపాఠమే వ్రాతప్రతులలో ఉన్నది. తిక్కన ఇట్టి యతులు వాడినారు. చూ, శాంతి. II. 87. “నాకు దక్షిణగా నిచ్చివాఁడవింక; అశ్వ 1. 45 నాదు గుఱుతు సెప్పినా రెవ్వరనినను." గనుక తప్పుకాదు.