పుట:Ananthuni-chandamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డవడి ఒప్పుకోకపోవుటచేత అనంతుడు కొన్ని ఉభయవళి విభాగములు ఏర్పర్చుకోవలసివచ్చినది. అత డేర్పరచిన విభాగములలో చేరక కొన్ని అఖండవళ్లు కనిపించడముచేత అప్పకవి మఱికొన్నివిభాగము లేర్పర్చవలసివచ్చినది. 12 విధములయిన ఉభయవళ్లు అప్పకవి పేర్కొన్నా వీటిలో దేనికిందనూరాని అఖండవళ్లు కనబడుతూనే ఉన్నవి; ఉ. ఏవార్ధకవడి; ఇంచుగ్వడి; చతుర్థీవిభక్తివడి మొదలయినవి.

19-వ ది గీతాద్యుపజాతులలో తప్ప మరియెక్కడను దీనిప్రయోజనము లేదు గనుకను, అక్షరమైత్రితో సంబంధము లేదు గనుకను, దీనిని పూర్వలాక్షణికులు యతులలో పేర్కొనలేదు. యతికి బదులుగా వచ్చేది గనుక ఇదిన్ని ఒక యతిభేదమే అని అప్పకవి పేర్కొన్నాడు.

అనవసరముగా చెప్పిన యతిభేదములు.

భిన్నయతులు, ప్రత్యేకయతులు: అనంతుఁడు, అప్పకవి పేర్కొన్నారు. 'చేతిది'[1] లో ఉన్న 'తీ'కిన్ని 'దివిజ' లో ఉన్న 'దీ'కిన్ని మైత్రి కలదు; చేతి య దిలో ఉన్న 'యా'కు అకారముతో మైత్రికలదు;‘ధరించె[2]'లో ఉన్న ‘రీ'కి రేఫతో మైత్రి కలదు; ‘ధరియించె’ లోఉన్న ‘యీ'కి ఇకారముతో మైత్రి కలదు; అని ప్రత్యేకముగా కొత్తయతిభేదములవలె ఎందుకు చెప్పవలెనో తెలియదు. చేతిదిలో ఉన్న తకారముపై స్వరము విరుగునన్న భ్రమపడకూడదని చెప్పవలెనంటే, ఆలాగునే చెప్పరాదా? ఇటువంటివి ఇంకా

  1. చూ. అప్పక. అనంత. 123.
  2. చూ. అప్పక, అనంత. 123.