పుట:Ananthuni-chandamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16-వ దానిలో నాలుగువిషయము లున్నవి. రెండు విధములయిన సంధికార్యములచేత స్వరమున్ను మరి రెండువిధములయిన సంధికార్యములచేత వ్యంజనమున్ను గూఢముగా ఉంటవి. ఈనాలుగు విషయములను నాలుగువిధములైన యతులుగా అప్పకవి పేర్కొన్నాడు: (లుప్తవిసర్గ, వృద్ధి, అంత్యోష్మసంధి, వికల్పసంధి). వీటిలో స్వరసంబంధమైనవి రెండున్ను ఒక్కటిగా చేసి అనంతుడు మూడువిధములయిన యతులు పేర్కొన్నాడు. విన్నకోట పెద్దన వృద్ధివళులగురించే లక్షణమున చెప్పి ఆదేశయతికి లక్ష్యముగా ఇచ్చినపద్యములో లుప్తవిసర్గవళికి కూడా సరిపోయినట్లు 'అన్యోన్య' లో 'గూఢస్వరమునకు 'అ' తో వడి కూర్చినాడు. గూఢముగా ఉన్న వ్యంజనముగూర్చి ఏమీ చెప్పలేదు. కవిజనాశ్రయములో వీటిలో ఏదిన్నీ చెప్పియుండలేదు. నన్నయ భారతమందు కాక తక్కిన కొన్ని పూర్వగ్రంథములందు వీటికి లక్ష్యములు చూపించవచ్చును.

18-వ దానిగుఱించి మతభేదములున్నవి.

సుప్రసిద్ధమైన ప్రయోగములు అనేకముగా ఉండుటచేతను పేరు పొందిన లాక్షణికులలో కొందరి సమ్మతి కలదు గనుకను అఖండవడి ఒప్పుకోక తప్పదని, “తెలుగు” అనేపత్రికలో సం॥9-10 లో నేను వ్రాసిన వ్యాసమును చూడండి.

అఖండవడి ఒప్పుకొన్నతర్వాత ప్రాది మొదలయిన ఉభయవళులు వేరే పేర్కొనుట అనవసరము. కాకుప్లుతము మొదలయినవాటిలో స్వరము ప్రధానము అని చెప్పితే చాలును. అఖం