పుట:Ananthuni-chandamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందుచేతనే వబలకు అభేదవిరతి అనిన్ని Σప వలకు అభేదవర్గయతులనిన్ని పేర్లు పెట్టినాడు. అయితే, రెండవదానిలో మొదటిదికూడా ఇమిడి ఉన్నది గనుక Σపవల మైత్రి (అభేదవర్గయతి) అని ఒక్కటిగా చెప్పితే చాలదా?

13-వ దానిగురించి కవిజనాశ్రయములోగాని కావ్యాలంకారచూడామణిలోగాని ఏమీ కనబడదు. జ్ఞΣలకు మాత్రము వడి అనంతుడు చెప్పినాడు. జ్ఞΣకలకు కూడా వడిగలదని తిక్కనసోమయాజి ప్రయోగ మాధారముగా తీసికొని చెప్పినాడు; గాని సోమయాజి మరియెక్కడను ఇటువంటి ప్రయోగము చేయలేదు. ఈప్రయోగమైనా చేసి ఉండడనిన్ని ఇది సరియైన పాఠముకాదనిన్ని కొందఱి అభిప్రాయము. ఇది సరియైన పాఠమే అయితే తిక్కనసోమయాజిగారి కాలముననే జ్ఞాకు తాలవ్యోచ్చారణ మారి ఇప్పుడున్నట్టు 'గ్యా' అని కంఠ్యోచ్చారణ వచ్చినదని ఊహించవలెను. నన్నయ ఈవడి వాడలేదు; మీద చెప్పిన ప్రయోగముకాక పూర్వకవి ప్రయోగము మరియొంటి కనబడలేదు; గానీ, ఉత్తరాంధ్రకవులు కొందరు వాడినారు.

14-వ దానిగురించి స్పష్టముగా చెప్పినవాడు అప్పకవి. స్పష్టముగా లక్షణము చెప్పకపోయినా, అనంతకవి తాను వ్రాసిన పద్యములో ళడలకు మైత్రిపాటించుటచేత అతని కీమైత్రి ఇష్టమే అని ఊహించవలసి ఉన్నది. (చూ. మూ.1.95) లళకు మైత్రి కలదని ఎక్కటియతి గురించి వ్రాసినపద్యములో చెప్పినాడు. వీటినిగురించి కవిజనాశ్రయములోను కావ్యాలంకారచూడామణిలోను ఏమీ చెప్పియుండలేదు. లళమైత్రికి ఆదిపర్వమందే ప్రయోగ మున్నది.