పుట:Ananthuni-chandamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవిజనాశ్రయములోను కావ్యాలంకారచూడామణిలో ఉన్నవి; తక్కిన విషయములు మూడున్ను అనంతుడున్ను అప్పకవిన్ని చెప్పినారు. అయితే అప్పకవి చెప్పినట్లు మూడున్ను మూడుభేదములుగా చెప్పక అనంతుడు రెండుభేదములుగానే చెప్పినాడు.

3-వది అనంతుడు మాత్రమే చెప్పివాడు; తక్కినలాక్షణికులు దీనిని గురించి ఏమీ చెప్పినట్లు కనబడదు. ఋవళిని బట్టి ఌవళి ఒప్పుకోవలసినదే.

9-వ దానిలో Σοత్=న్; Σοట్ =ణ్; అని బిందుయతులకిందను; న్=ణ్ అని సరసయతులకిందను, అందరున్ను చెప్పినారు. ఇవి కాక, Σοత్ =ణ్; Σοట్=న్; Σοత్ = Σοట్ వేరేభేదములుగా అప్పకవి చెప్పినాడు; గాని అనవసరము; బిందుసరసయతులబట్టి ఇవి సాధించవచ్చును.

10-వ దానిలో Σοప=మ అని మాత్రమే బిందుయతికింద అందరును చెప్పినారు. Σοయ=మ అనేమకారయతి అనంతుడు, అప్పకవి చెప్పినారు; విన్నకోట పెద్దన చెప్పలేదు. అప్పకవీయములో ఈవళికి లక్ష్యముగా భీమన చాటుపద్యము (చ. గరళపు...) ఉన్నది. ఈభీమనే కవిజనాశ్రయకర్త అయితే ఈవళిభేదము తన లక్షణగ్రంథములో ఎందుకు పేర్కోలేదో!

12-వ దానిగురించి భారతములో ప్రయోగములున్నా కవిజనాశ్రయములో గాని కావ్యాలంకారచూడామణిలోగాని ఏమీ చెప్పలేదు. అనంతుడు వపలకుమాత్రమే మైత్రి చెప్పి దీనికి 'అభేదవిరతి' అని పేరు పెట్టినాడు. వబలకు అభేదమున్నదిగానీ వపలకు లేదుగదా! గనుక, ఈపేరు వీటికి సార్థకము కాలేదు. అప్పకవి