పుట:Ananthuni-chandamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18 అని ఉంచినాను. ఇదికలిపితే అనంతుడు 25 వడి భేదములను పేర్కొన్నాడని చెప్పవలసి ఉంటుంది. 24 వడి భేదములనే అనంతుడు పేర్కొనినట్లు అప్పకవి వ్రాసినాడు.

ఎక్కటి (ఏకతర) వళ్లు: ఇవి లాక్షణికు లందరున్ను చెప్పినారు. ఏ అక్షరమునకు ఆ అక్షరమే వడిగలది అని దీని అర్థము. అటువంటి అక్షరములు 'మయరలవ'లు అని కవిజనాశ్రయములోను, 'మరఱలవ'లు అని కావ్యాలంకారచూడామణిలోను, 'మరఱళవ'లు అని ఛందోదర్పణములోను ఉన్నది.

బిందుయతినిబట్టి, 'మాకు Σοపతోవడి ఉండగా, ‘మ’ ఎట్లు ఎక్కటివడి కాగలదు? సరసయతినిబట్టి అయహలకు వడి చెల్లగా, 'య' ఎట్లు ఎక్కటివడి కాగలదు? డకారముతోను, లకారముతో 'ళా' కు వడి అంగీకరించిన అనంతుడు 'ళా' ఎక్కటివడిగా ఎట్లు చెప్పగలడు?

ఇది అంతా చక్కగా విమర్శించే కాబోలు అప్పకవి, రఱలనే ఏకతరయతులక్రింద పేర్కొన్నాడు.

లాక్షణికులు పాటించిన అక్షరమైత్రి చాలామట్టుకు “తుల్యాస్యప్రయత్నం సావర్ణ్యం” అనే ధర్మమునుబట్టే ఏర్పడ్డదని చెప్పవచ్చును. కాని ఈదిగువ నుదాహరించిన వాటిలో తుల్యాస్యప్రయత్నము పూర్తిగా ఉన్నట్లు కనబడదు.

1. ఇ, ఎ=ఋ. ఋకారము మూర్ధన్యముగదా? తాలవ్యాచ్చులతో ఎట్లు మైత్రికలుగును? అయితే, ఋకారమునకు