పుట:Ananthuni-chandamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పంచమి యగు దీనఁబట్టుండి యందుండి
           వానికంటెను వానివలన ననఁగఁ
వానియొక్కకులంబు వానికిఁ బ్రియ మది
           జనులలో నితఁడు మేలనఁగ షష్ఠి


గీ.

జలధియందు లక్ష్మిగలుగుచుండఁగ దన్ని
మిత్త మనఁగ సప్తమీవిభక్తి
జలజనాభ యనఁగ సంబుద్ధి యిట్లు వి
భక్తు లలరుఁ గారకోక్తిగతని.

105


క.

స్త్రీపుంనపుంసకము లన
నేపగు లింగములమీఁద నెసఁగు విభక్తుల్‌
దీపించు నవియు వచన
వ్యాపారనిరూఢి నక్షరాంతరములతోన్‌.

106


క.

తనరఁగ అఆఇఈ
లనఁగా ఉఊలు నాఁగ నంబుజదళలో
చన ఋౠ లన ఓఔ
లనఁగ నజంతాహ్వయంబు లగు నీపదియున్‌.

107


క.

చజలు తవర్గము పబమలు
స్వజనప్రియ రవలు శషలు సహలు పదాఱున్‌
నిజమగు హలంతములు హరి
యజంతములు గూడ నిరువదా ఱంతంబుల్‌.

108


క.

అంతము తెలుఁ గగునెడ నే
యంతముతలసూప దైన నచట సమాసా