పుట:Ananthuni-chandamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భ్యంతరములందు సంధ్యుచి
రాంతము లగుఁ గాన ధీవియద్విష్ణులనన్‌.

109


క.

యత్తత్ప్రభృతు లొకటితోఁ
జొత్తెంచును యద్గుణంబు చూచి మహాత్ముల్‌
మెత్తురు తత్పురుషుఁడు లో
కోత్తరుఁ డన నీదృశ ప్రయోగబలమునన్‌.

110

మఱి క్రియాపదంబులు—

క.

పరుఁ బలుకు బ్రథమ పురుష మె
దిరి మధ్యమపురుషపలుకు ధృతి దనుఁ బలుకున్‌
ధర నుత్తమపురుషక్రియ
వరుస నలింగము లైనవచనము లెసఁగున్‌.

111


క.

కారకపదములు తెనుఁగై
నారి నరుఁడు రత్న మనఁ దనర్చుగతి క్రియా
కారవిశేషము లలరవు
వారలు వచ్చెదరు దండు వచ్చెద రనుచోన్‌.

112


క.

ద్వివచనము లేదు తెలుఁగున
బ్రవిమలగతి నేకవచనబహువచనము లౌఁ
దివిచెద ననఁ దివిచెద మనఁ
గవి యనఁ గవు లనఁగ గ్రియలు కారకఫణితిన్‌.

113

మఱి అవ్యయశబ్దంబులు—

క.

ఇలఁ గారకమట్టుల యు
జ్జ్వలరూపము లయ్యు లింగవచనములు విభ