పుట:Ananthuni-chandamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షట్ప్రత్యయంబులు—

క.

క్రమమునఁ బ్రస్తారము న
ష్టకము నుద్ధిష్టమును వృత్తసంఖ్యయు మఱి పెం
పమరు లగ క్రియయును న
ధ్వము లన షట్ప్రత్యయములు దనరు ముకుందా!

65


క.

చాలుగ సర్వగురువు లిడి
లాలితముగ గురువుక్రింద లఘువును వలప
ల్లోలి సమంబులు డాపలి
వ్రాలకు గురువులను నిలుపఁ బ్రస్తారమగున్‌.

66

నష్టలబ్ధి—

క.

నరు లర్థించినచోటుల
నరయఁగ లఘువులను బేసులం దొక టిడి చె
చ్చెర నర్థించిన చోట్లన్‌
గురువుల నిడ నష్టలబ్ధి కుంజరవరదా!

67

ఉద్దిష్టము—

క.

ఒక్కటి మొదిలుగ నినుమ
ళ్లెక్కినచో లఘుయుతంబు లన్నియుఁ బ్రోగై
యొక్కటి కలియఁగఁదోఁచును
గ్రక్కున నుద్దిష్ట మిక్షుకార్ముకజనకా!

68

వృత్తసంఖ్య—

క.

చేకొని ఛందోవర్ణము
లేకాదిద్విగుణితముగ నిడి కడులెక్కం