పుట:Ananthuni-chandamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రభునామయుతముగాఁ బద్య మొక్కటియును
           దగఁజెప్పి రగడ భేదంబులందుఁ
గళికలు ప్రత్యేక దళము లెన్మిది చేసి
           తత్పరార్థముల నుత్కళిక లనఁగ
నేకసమాస మై యేడుదళంబులు
           తుద విభక్త్యర్థంబు దోఁపఁబలుక


గీ.

దాని కెనగాఁగ జిక్కినదళ మమర్చి
ఫణితులొడఁగూర్చి సార్వవిభక్తికముగఁ
గట్ట కడపటిపద్య మొక్కటి రచింప
నది యుదాహరణం బగు నబ్జనాభ!

63


సీ.

ప్రథమవిభక్తిఁ బరఁగు వీరావళి
           మఱి ద్వితీయకుఁ గీర్తిమతి దలంప
సుభగాభిధాన మచ్చుగఁ దృతీయకుఁ జతు
           ర్థికి భోగమాలిని దృఢముగాఁగ
క్షితిఁ బంచమికిఁ గళావతి కాంతిమతి షష్ఠి
           కమరు నుదాత్త సప్తమికిఁ గమల
సంబోధనమునకు జయవతి యీగతిఁ
           దగు విభక్త్యధి దేవతాచయంబు


గీ.

నెలమి నయ్యైవిభక్తుల నెసఁగఁ జెప్ప
గావ్యములను సంతోషించి కరుణతోడ
నాత్మనామాభిరూపఫలాభివృద్ధి
భర్తలకుఁ గర్తలకుఁ జేయుఁ బద్మనాభ!

64