పుట:Ananthuni-chandamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రాకటముగ రెట్టించిన
శ్రీకరముగ వృత్త సంఖ్య శ్రీనరసింహా!

69

లగక్రియ—

క.

ఒకటి గలసిన ఛందపు
టక్కరముల దొంతి యిడి యుపాంతములతుదిన్‌
జక్కఁగ నొక్కొక్కటిలోఁ
గ్రక్కున నొడఁగూర్ప నగు లగక్రియ కృష్ణా!

70

గణలగక్రియాంకమగుచక్రము—

క.

తొలుత ప్రతి సర్వగురువగు
లలి నేకద్విత్రికాదిలఘుయుతవృత్తం
బులు పరప్రతు లగుఁ జక్రా
కలితము లౌనెలవు లగు లగక్రియఁ గృష్ణా!

71

సగణలగక్రియాంకమగుచక్రము—

చ.

సగణలగ క్రియాంక మగు చక్రమునం దొకఁ డాదిగాఁగఁద
ద్ద్విగుణము లడ్డవీథి నొదవింపఁగ వామగృహాంక సంఖ్యతో
నొగిఁదరువాతియిండ్ల ప్రతులొందనధోఽంకములన్‌ సమాధికం
బగు ప్రతిమానుచుంగడకౌల ప్రతుల్‌ దొరలించినిల్పఁగాన్‌.

72


గీ.

ఇందు సమమగునది తొల్తయిండ్ల వ్రాయఁ
బడిన సంఖ్యతో సమమైనఁ బ్రతికిఁ జేరు
నధిక మగునది వృత్తసంఖ్యాధికంబు
వ్రాయ రివి రెండు ప్రతులచక్రములయందు.

73


వ.

సుప్రతిష్ఠకు లగక్రియాచక్రోద్ధారం బెట్టిదనిన.

74