పుట:Ananthuni-chandamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిగురొత్తు భావంబు లెసఁగఁ దర్వోజ
           నీయోజ నొనరింతు రెల్ల సత్కవులు.

39

మఱి యక్కరజాతులందు మహాక్కర—

ఆదివార మాదిగ ననుక్రమమున
           నన్నివాసరముల నొక్కినుండు
నాదితేయాధినాథు లేగురు నల
           రారంగ నొక్కసుధాకరుండు
నాది హరిఁ గొల్వ రెండును నాలుగు
           నగు వాసరంబున నర్కుఁడైన
నాదరంబున నెడసొచ్చునని మ
           హాక్కరం బలుకుదు రార్యు లెల్ల.

40

మధ్యాక్కరము—

ఓజతో నిద్దఱింద్రులును నొక్కయాదిత్యుండు మఱియు
రాజితంబుగ నిద్ద ఱమర రాజులు నొక్కసూర్యుండు
పూజింతు రత్యంతభక్తిఁ బుండరీకాక్షు ననంతు
భ్రాజిల్లు బుధులు మధ్యాక్కరంబు నొప్పారఁ బల్కుదురు.

41

మధురాక్కరము—

రవియు నింద్రులు మువ్వురు రాజొకండును గలిసి
రవిసుధాకరలోచను రాజితాననసరోజు
రవికులేశుఁ గొలుతు రని ప్రస్తుతింతురు ధరిత్రి
నవిరళం బగుమధురాక్కరాఖ్యచే సత్కవులు.

42

అంతరాక్కరము—

ఇనుఁ డొకండును నింద్రు లిద్దఱును నొక్క
వనజవైరియుఁ గూడి వైభవ మొనర్ప