పుట:Ananthuni-chandamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యార్వంచల లఘుగణంబులు
నుర్వీధర త్రిలఘుయుగము నొకగీతితుదన్‌.

37

సర్వలఘుసీసము—

మృగమదము తిలకమును నగు మొగముచెలువమును
           నలఁతిపవడముఁ దెగడు నధరపుటము
వలుదజఘనములు బొలుపలరుకనకపువలువ
           కలితకరచరణమణికటకములును
విరులతురుమును నమిలిపురిసొబగుగుమకరికము
           రచన నెసఁగిన చెవుల రవణములును
కరకమలయుగళ ధృతి మురళియును ద్రివిధమగు
           నిలుకడయు నిటలతటి నెఱయు కురులు


గీ.

తెల్లదమ్మిరేకులభంగి నుల్లసిల్లు
వెడఁదకన్నులు గలగోపవేషశౌరి
నాశ్రయించెద ననుచు ని ట్లమరఁ జెప్ప
సర్వలఘుసీస మగు నండ్రు జలజనాభ!

38

తరువోజ—

ముగురు జిష్ణులు త్రయీమూర్తియు మఱియు
           ముగురు జిష్ణులు త్రయీమూర్తియుఁ గూడి
యొగి నుండ గరయతి నొక్కొక్క చరణ
           ముడుగక సేవింప నుజ్జ్వలం బగుచుఁ
దగ నుల్లసిల్లు పాదములు నాల్గింటఁ
           దనరు వరాహావతారోదయునకు