పుట:Ananthuni-chandamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గనకవస్త్రుని గృత్తకైటభుని గొల్తు
రనుచుఁ జెప్పుదు రంతరాక్కర బుధులు.

43

అల్పాక్కర—

ఒగి నిద్దఱింద్రులు నొకవిధుండు
జగతీధరుని పదాబ్జములు గొల్తు
రగణితభక్తి నం చభినుతింప
నెగడు నల్పాక్కర నియతితోడ.

44

అక్కరలయతినిర్ణయము—

విరతిచతుర్గణము మహా
క్కర కేకోనాక్షరత్రిగణ మంతరకున్‌
వరగణయుగయతి నల్పా
క్కర మధ్యయు మధురయుం ద్రిగణయతుల హరీ!

45

మఱి షట్పద—

మెఱయంగ నిద్దఱి
ద్దఱు సురేంద్రులుమూఁడు
తెఱెఁగులన్‌ శశిఁగూడ నర్థంబులన్‌
నెఱిఁ గ్రాలఁగా వళ్ళు
దొఱుఁగ షట్పదరీతి
వఱలుఁ జక్రిపదాబ్జవర్ణనంబు.

46

త్రిపద—

సరవిఁ బ్రాసమునొంది సురపతుల్‌ నలువురు
హరియు గైకార్కులు గలియ
జరగు నిప్పగిది నొప్పుఁ ద్రిపద.

47