పుట:Ananthuni-chandamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సుగ్రీవవిభుఁడు దశగ్రీవదమనుండు
           లలితకంబుగ్రీవవిలసితుండు
పూతనాజీవితనూతనస్తన్యపా
           నాభిలోలుఁడు నిత్యశోభనుండు


గీ.

భువనవంద్యుఁ డనుచు నవకలిప్రాససీ
సముల నిన్నుఁ బొగడు నమరసమితి
శరణభరణనిపుణ వరయోగివిమలహృ
త్పద్మసద్మదేవ పద్మనాభ!

33

మఱియు నుత్సాహము—

సాహచర్య మమర సప్త సవితృవర్గమును సము
త్సాహ మెక్క నొక్కగురుఁడు చరణములు భజింపఁగా
నీహితప్రదానలీల లెసగుకమఠమూర్తి ను
త్సాహరీతు లుల్లసిల్ల సంస్తుతింతు రచ్యుతున్‌.

34


గీ.

ప్రాసములును వడులు భాసురంబుగ నిట్లు
విలసితముగ నాటవెలఁదియందు
నుత్సుకత నొనర్చి యుత్సాహ మది నిల్ప
విషమసీస మమరు విషధిశయన!

35


క.

ద్వాదశపదముగ మఱి య
ష్టాదశపాదమగు గీతి సహితంబుగఁ దా
నేదియగు సీసమాలిక
శ్రీదయితా నిలుపవలయు సీసపునియతిన్‌.

36


క.

సర్వలఘుసీసమునకు న
ఖర్వాంఘ్రులనడుమ నింద్రగణములు మూఁడై