పుట:Anandam Manishainavadu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దూరంలో ఉన్న కంచుమర్రు గ్రామం నుంచీ సైకిల్‌పై వచ్చేవారు. అలా ఒంటరిగా వస్తే అది మామూలు విషయమే. ఆయనకున్న ముగ్గురు సంతానంలో సంతోష్‌ను క్యారేజీపైన, వల్లీని ముందు కడ్డీపైన, గాయత్రిని భుజాలపైన కూర్చోపెట్టుకుని అంతదూరం నుంచీ సైకిల్ తొక్కుతూ, కబుర్లు, కథలు చెప్తూ, పాటలూ, పద్యాలు పాడుతూ వచ్చేవారు. ఈ దృశ్యం చూసిన నేను, నా సహచర మిత్రులూ ఈ ఆనంద కోటీశ్వరుడికి మనసులోనే దణ్ణాలు పెట్టేవాళ్ళం. ఆ విధంగా ఎన్నోసార్లు భీమవరం తీసుకొచ్చి పిల్లలకు నాటకాలు, సాహితీసభలు, సినిమాలు చూపించేవారు. ఈనాడు ముగ్గురు పిల్లలు సంస్కారవంతులుగా, సాహిత్యం అభిలషించేవారిగా తయారయ్యారంటే ఆ నాటి విత్తనాలే కారణంగా అనుకుంటాను.

...పైలు శ్రీనివాస్

జయహో పత్రికా సంపాదకులు

పిళ్ళై పాత్రలో రమణ