ఒక ఆనందం, ఒక గర్వం
...వల్లీశ్వర్
ప్రధాన సంపాదకులు,
'ఆంధ్రప్రదేశ్' (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాసపత్రిక)
అప్పట్లో నేను ఈనాడు స్టాఫ్ రిపోర్టర్‌గా పశ్చిమగోదావరి జిల్లా బాధ్యతలు చూస్తున్న రోజుల్లో నా దగ్గరికి పాతికేళ్ళ యువకుడుగా సూరంపూడి వెంకటరమణ వచ్చాడు.
తనది అత్తిలి పట్టణమనీ, డిగ్రీ చదివి, భవిష్యత్‌లో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించే ఉద్దేశ్యంలో ఉన్నానని తనకి విలేకరిగా పనిచేయాలని వుందనీ కోరిక వ్యక్తం చేశాడు. ఈ వృత్తిలో వుండాల్సిన లక్షణాలు, కఠోరమైన నియమాలు గురించి చెప్పాను. అత్తిలి లాంటి పట్టణంలో పార్ట్ టైం విలేకరిగా వృత్తిలో సంతృప్తి వుంటుందేమోగాని, న్యాయబద్ధంగా సంపాదించగల ఆదాయం చాలా తక్కువగా వుంటుందని చెప్పాను. మరోరకంగా చెప్పాలంటే అతన్ని నిరుత్సాహపరిచే విషయాలు ఎక్కువగా చెప్పాను. (నిజానికి అప్పట్లో మాకు అత్తిలిలో విలేకరి అవసరం ఉంది). నేను చెప్పినదంతా విన్నాక కూడా అతను తన ఆసక్తిని చంపుకోలేదు. ప్రయోగాత్మకంగా కొన్ని వార్తలు రాసి పంపమన్నాను. విచిత్రం ఏమంటే, వెంకటరమణ వ్రాసిన ఏ వార్తనీ తిరిగి ఎడిటింగ్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు.
నేను ఈనాడులో రిపోర్టింగులో వివిధ స్థాయిలలో వేర్వేరు నగరాలలో 26 సంవత్సరాలు పనిచేసినా, సూరంపూడి వెంకటరమణలా ఎలాంటి శిక్షణ