పుట:Anandam Manishainavadu.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"సం"గతులు

పిల్లలతో సైకిల్ ఫీట్లు

భార్యా పిల్లల్ని సుఖపెట్టాలంటే మేడలూ, మిద్దెలు, ఏసీకార్లు, జేబునిండా డబ్బు, తీరిక సమయం ఉండాలి అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీనికి వ్యతిరేకి మా బావగారు రమణ. ఆయన్ని బావా అనటానికి రెండు కారణాలున్నాయి. ఆయన ఆత్మీయంగా అందరిలో కలిసిపోవటం ఒకటైతే మేమిద్దరం "ఫ్రీడం పైటర్" నాటికలో నటించడం మరో కారణం. అందులో ఫ్రీడం పైటర్ (కూనిరెడ్డి శ్రీనివాస్, సినీ నిర్మాత) కుమారునిగా రమణ నటిస్తే, ఆయనకు బావగా నేను వేశాను. ఆ రకంగా అనేక వేదికలపై మేము బావా, బావమరుదులుగా ప్రేక్షకుల మనసుల్లో మిగిలాం. ఇక ఉపాధ్యాయినిగా, రచయితగా, కళాకారునిగా ఆయన ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబాన్ని మాత్రం విస్మరించలేదు. నేను భీమవరంలో ఈనాడు విలేఖరిగా పనిచేసినపుడు అక్కడికి 16 కి. మీ