పుట:Anandam Manishainavadu.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చేవారు. అలా చిన్న చిన్న ఆలోచనలతోనే పాఠశాలలో ఉత్సాహభరితమైన పరిస్థితులు కల్పించేవారు. మా పాఠశాలలో ఈ పద్ధతిని గమనించి ఎం.ఇ.ఓ. గారు పై అధికారులకు సిఫార్సు చేయగా సందర్శనకు వచ్చిన డి.ఇ.ఓ. ఇందుకూరి ప్రసాదరాజుగారికి ఈ పద్ధతి బాగా నచ్చింది. తరువాత ఈ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ ప్రతీ ప్రాథమిక పాఠశాలలోనూ విద్యార్ధులకు స్కూలు నిధులనుంచి కుర్చీలు కొనమని ఆదేశాలు జారీచేసింది.

2000లో నేను శ్రీకాకుళం నుంచి ఈప్రాంతానికి వచ్చి ఏ పాఠశాల కావాలో ఎంచుకునేందుకు కౌన్సిలింగ్‌లో పాల్గొన్నాను. అప్పుడు మాస్టారు అక్కడికి వచ్చారు. నాకు అక్కడ ఉన్న ఎవరూ తెలియదు. గొల్లగూడెం ఐతే తేలికగా వస్తుందని అన్నారు. ఇంతకూ గొల్లగూడెం స్కూలు బావుంటుదా? అక్కడి హెడ్‌మాస్టారు ఎలాంటి వారు? అని ఆయననే అడిగాను. అంతా బావుంటుంది మీరు సంతకం పెట్టేయండి అని ఆయన చెప్పారు. కొంత సేపటికి మండల విద్యాధికారి (ఎం.ఇ.ఓ.) గారు ఈయనే మీ హెడ్‌మాస్టారు అని పరిచయం చేసాక తెలిసింది సలహా ఆయననే అడిగానని. నేను అడగకపోతే ఏం చేసేవారు మాస్టారు అంటే "మీరు కరెక్ట్ అని నేను కాసేపటిలోనే అంచనా వేశాను తిరుపతిరావుగారూ. అదృష్టవశాత్తూ మీరే అడిగారు. లేకుంటే నేను కచ్చితంగా గొల్లగూడెం పాఠశాలకే రమ్మని అడిగేవాణ్ణి. నేను వచ్చిందే ఎవరు సరైనవారో చూసుకోవడానికి" అని చెప్పారు. ఆపైన మా ఇద్దరి మధ్య సఖ్యత కారణంగా పాఠశాల అభివృద్ధి పెరిగింది. ఆయన స్నేహం, సాన్నిహిత్యంలో ఎంతో నేర్చుకున్నాను. చిన్ననాటి నుంచి కళల పట్ల ఆసక్తి ఉన్న నన్ను నేరుగా నాటకాల్లో నటునిగా చేసేశారు. ఆయనకు నాకూ కొద్దికాలం బదిలీల వల్ల విడిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ విడివిడిగా ఉండలేక మళ్ళీ ట్రాన్స్‌ఫర్ ఆయన స్కూలుకు పెట్టు కున్నాను. మాస్టారు ఇంత గట్టి అనుబంధాన్ని ఐదు నిమిషాల వ్యవధిలో గమనించి నేనే తగిన వ్యక్తినని నిర్ణయించుకోగలగడం చాలా గొప్ప విషయం.

పసివాళ్ళ హృదయాల్లో చెదరని స్థానం : - ఆయన పనిచేసిన పాఠశాలలో మాస్టారు రిటైర్ అయ్యాకా కూడా నేను పనిచేస్తున్నాను. కొందరు పిల్లలు వెనుకబడి ఉంటే వారిని ఆయన లాలనగా చదివించేవారు. అటువంటివారిలో

11