పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రరథస్వామికి వైభవముగ బూజలు జరిగిపోయినవి. ఆ దినమున మహారాజు రాజబంధుల కందరకును విందు చేసినాడు. బ్రాహ్మణులకు షోడశోపచారములును షోడశ మహా దానములును సలిపినాడు. ఆ మహానగరమునం దుండుజనాలయ సంఘారామాదులలో బౌద్ద సంఘారామ చైత్య జినాలయ సంఘారామాదులలో బౌద్ధ సంఘారామ చైత్యాలలో బుద్ధదేవ జినదేవార్చనలు, భిక్షుక భక్తజన సమారాధనలు, సంఘారామములకు దానములు విష్ణుకుండిన మహారా జర్పించినాడు.

15

ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్ధనుడు తన సైన్యములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసియున్నాడనియు కోనరాష్ట్రమునుండి హైహయు లా యువరాజును సందర్శించి, సామంతప్రాభృతములను సమర్పించినారనియు, మంచన భట్టారక మహారాజునకు వార్త వచ్చినది. ఆ విష్ణుకుండినమహారాజు చాళుక్య యువరాజు రాకకు దమ యానందము వెలిబుచ్చుచు, నగరమంతయు బ్రజ అలంకరింప వలెనని యాజ్ఞ దయచేసినాడు. చిత్రరథస్వామి మహోత్సవముల కొఱకు బట్టణ మిదివరకే సుందరతరముగా నలంకరించుకొన్నారు నగరప్రజలు.

ఆ మరునాటి యుదయముననే వేంగీమహాపురమున కుత్తర గోపురముకడకు విష్ణువర్ధనుడు తన సైన్యముల నడిపించుకొని వచ్చెను. నగర బాహిరోద్యానముల సైన్యములకన్నింటికి శిబిరము లేర్పరుపబడినవి. యువమహారాజు నంగరక్షక బలముమాత్రము విష్ణువర్ధనునితో నగరము బ్రవేశించినది.

గోపురద్వారము కడనే విష్ణుకుండిన రాజ్యమహామంత్రి ఆదిత్యకీర్తియు, రాజగురువగు నారసింహభట్టులవారును, సర్వసేనాధిపతియగు విజయేంద్రగోపుడును రాజోద్యనులతో, సామంతులతో నెదుర్కొని జయములు బలికినారు. బ్రాహ్మణులు విష్ణువర్ధనునకు బూర్ణ కుంభ మిచ్చినారు. లాసికలు చాళుక్యునకు నారతు లెత్తినారు. చాళుక్య యువమహారాజునకు మహాక్రీడామందిరమును విడిదిగ నేర్పాటుచేసినారు. ఆ సాయంకాలము కోటలో, రాజసభామందిరములో విష్ణువర్ధన యువమహారాజునకు మంచన భట్టారక మహారాజు స్వాగతమిచ్చి తన యర్దసింహాసనమున గూర్చుండబెట్టు కొనినాడు.

“చాళుక్య యువమహారాజా! తమ యన్నగారు చాళుక్య చక్రవర్తి పధ్వీవల్లభ పులకేశి మహారాజాధి రాజులును, తమ చిన్నన్నగారు ఘూర్జర మహారాజు జయసింహ మహాప్రభువును క్షేమముగ నున్నారని తలంతును.”

“అన్నగార లిరువురును క్షేమము మహాప్రభూ! కళింగగాంగులు నాతో యుద్ద మొనరింపకయే సామంత ప్రాభృత మర్పించుట నాకు వింతగనే కన్పించినది. అయినను జాగ్రత్త కొఱకు బిష్టపురమున నొక మహాసైన్యముతో నాకు బితృసమానుడగు కాలకంపన ప్రభువును నిల్పియే వచ్చినాను.”

అడివి బాపిరాజు రచనలు - 6

263

అంశుమతి (చారిత్రాత్మక నవల)