పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రములు, శతపత్రములు నగు కమలములును, రంగురంగుల కలువ పూవులును ఆ సరస్సునకు అలంకారములై పరీమళములు వెదజల్లుచుండును.

ఆ కొలని పడమటి తీరమున పద్మానది సంగమించిన తీరభూమిని రెండు యోజనముల పొడవును, నొక యోజనము వెడల్పును గల నగరమును కాన్హసాలం కాయనుడు నిర్మించినాడు.

సాలంకాయనుల కులదైవము చిత్రరథస్వామి. శాతవాహన సామ్రాజ్య మంతరించిన వెనుక యిక్ష్వాకులతోబాటు సాలంకాయనులు రాజచిహ్నమైన 'భట్టారక' శబ్దమును వహించిరి.

విష్ణుకుండిన మంచనభట్టారక మహారాజు, కొమరిత అంశుమతి శత్రువుల బారినుండి తప్పించుకొని క్షేమముగ వేంగీపురము చేరినందులకు చిత్రరథస్వామిని స్వయముగ నర్చింప సకల సామంత సేనాధిప రాజోద్యోగి సహితముగ పాదచారియై దేవాలయమునకు బయలుదేరెను. సింహ లాంఛిత విష్ణుకుండిన పతాక మెగురుచుండ, నా ధ్వజమును మోయుచు పట్టపుటేనుగు ముందు నడువ, వందిమాగధులు, నా వెనుక వేత్రహస్తులు 'జయజయ' ధ్వానములు సలుపుచు బారులుతీర్చి నడుచుచుండిరి.

వారివెనుక గంగా గోదావరీ కృష్ణా జలములు గల స్వర్ణకుంభముల వహించిన ధవళవృషభముల నడిపించుచు, వేదమంత్రములు పఠించుచు బ్రాహ్మణులు నడుచుచుండిరి. వారి ననుసరించి, ముఖపతులు, దళపతులు, సేనాపతులు నడచుచుండిరి. సకల రత్నాలంకారయుక్తమైన సామ్రాజ్య శ్వేతచ్చత్రము పట్టి ఛత్రధారులు నడచుచుండ నా ఛత్రము క్రింద మహారాజు, రాజగురువు కైదండగొని, మదగజమువలె గంభీర యానమున నడచుచుండెను. మహారాజు వెనుక సామంతులును, రాజబంధువులును ననుగమించుచుండిరి. పూజాద్రవ్యములు గ్రహించి బ్రాహ్మణ పుణ్యస్త్రీలా వెనుక వచ్చుచుండిరి. ఎద్దులబండ్లు శతపత్రములు మోసికొనుచు వచ్చుచున్నవి.

మహారాణియు రాజకుమారి అంశుమతియు శిబికలపై బరిచారికాజనములు గొలిచిరా జిత్రరథస్వామి కొలువునకు వెడలుచుండిరి. దేవాలయ ప్రాంగణము, ప్రదక్షిణపథము, కల్యాణమండపము, ముఖమండపము, గర్భాలయమును మనోహరా లంకారములతో ధగధగ వెలిగిపోవుచుండెను నాగస్వర కాహళ, ముఖవీణ భేరీ భాంకారాది మంగళవాద్యములు, దశదిశల నింపివేయుచున్నవి. ఒకవైపున నాట్యాంగనలు నాట్యకళావైదుష్యమును బ్రదర్శించుచుండిరి.

మూలవిరాట్టైన చిత్రరథస్వామి నవగ్రహ, అష్టదిక్పాలకాది పరివారదేవతలతో ఛాయాసంజ్ఞాసమేతుడై యా దేవాలయమున వేంచేసియుండెను. క్షేత్రపాలకుడైన కొలని భట్టారకేశ్వరుని యుపదేవాలయ మామహాక్షేత్రము నందున్నది. ఒకచో గొందరు బ్రాహ్మణు లాదీత్య మంత్రమును జపించుచుండిరి.

దేవాలయమంతయు నొక మహారథమువలె నిర్మింపబడినది. ముఖమండపము ముందు, నేనుగులంత పెద్దవియైన యేడు రాతిగుఱ్ఱములు గంభీర శిల్పాకృతిగలవి, ఆకాశమున నెగిరి పోవుచున్నట్లు విన్యసింపబడినవి. పోని దోలబోవుచున్నట్లు గరుడాకృతిని ననూరుడు మునిమండప పరోభాగస్థమగు నొక చిరువేదికపై అధివసించి యున్నాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

262

అంశుమతి (చారిత్రాత్మక నవల)