పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతీపాలపురంలో సామంతులు. ముండకాది, పార్వతీయుల టక్కు అణగించి తమ రాజ్యమును స్థిరం చేయుడని అవతారపురుషుడైన శ్రీముఖ శాతవాహన మహారాజు కోరడం చేత ఇక్ష్వాకు మహారాజు విజయపురం నిర్మించి ఈ పార్వతీయరాజ్యం ఏర్పరచారు. ధనక కుటుంబంలోని తమ పూర్వీకులందరినీ చక్రవర్తి అటవీరాష్ట్రమైన కురవ దేశాన్ని ఓడించి రాజ్యం సుస్థిరం చేయవలసిందన్నారు. అందుకనే తన వంశంవారికి అటవిధనక ప్రభువు అని పేరు వచ్చింది. తనకు ఈ పురాతన చరిత్రాలోచన లెందుకు? మహారాజు తన బిడ్డకు నన్ను చదువు చెప్పమన్న మాత్రాన ఈ ఆలోచనలు కలగడం ఏమిటి? చదువు చెప్పడానికి కుటుంబ చరిత్రలకూ సంబంధం ఏమిటి? బ్రహ్మదత్తుడు అధివలసించి యున్న మంచము పైనుండి లేచెను.

ఆ బాలిక సౌందర్యము మానవాతీతం. ఆమె భౌద్దధర్మాభిరత. ఆమె వదనమునందు శాంతతేజస్సు వికసించి ఉన్నది. ఆ మోము శారదపూర్ణిమనాడు ఆకాశంలా ఉన్నది. అంత అందము మనుష్యులలో ఉండుట విచిత్రమే. ఆ బాలిక వికసించి లోకాన్ని దివ్యసురభిళాలతో నింపడం అద్భుత సంఘటనే! మహారాణి పారసికాదేవి సౌందర్యం నిరుపమానం. మహారాజూ అందకాడే. కాని ఈ అతిలోక సౌందర్యం ఎక్కడనుండి వచ్చింది రాజకుమారికి?

బ్రహ్మదత్త ప్రభువు ఉప్పరిగనుండి తన తోటలోనికి దిగినాడు. తోటలో ఏమో పరిశీలించు వానివలె ప్రతి పూలవృక్షమును ఆయన చూస్తూన్నాడు. ఎందుకీ మల్లియలు, చంపకాలు? ఎందుకీ పూలు? ఇవి చక్కని పండునైనా ఈయలేవు. మామిడిపూవు సువాసన గలది. నీటిచుక్క కన్న చిన్నపూవు. అయినా చంద్రబింబమంతటి పండును కూడా మనుష్యునికి అర్పిస్తుంది. తామరపూవు చంద్రబింబమంత ఉండి కూడా ఫలాన్ని ఇవ్వలేదే! ఎందుకీ పుష్పాలు? జంబుపుష్పము చిన్నది. అయినా దాని నల్లని ఫలం మధురమైంది.

5

శాంతిశ్రీ రాజకుమారి లోకైకసుందరి. ఆమె అద్భుత సౌందర్యము దక్షిణాపథ మందేకాక ఉత్తరాపథమందును ప్రసిద్ధి పొందినది. ఆ బాలికను వైజయంతీ మహారాజు కొమరుడు యువరాజు చూటకులచంద్రుడు విష్ణుస్కంద శాతకర్ణి ప్రభువు వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరిపోతున్నాడు. యజ్ఞశ్రీ శాతవాహన సార్వభౌముని తమ్ముని మనుమడైన పులమావి ప్రభువు శాంతిశ్రీ అందము విని ఆమెకోసం మరులుకొని విరహతాపం పడుతున్నాడు. మగధలో ఉన్న గుప్తమహారాజులు కూడా ఈ బాలికను వాంఛించారు. అపరాంతకపతి అభ్రకులార్ణవ చంద్రుడున్ను, పిష్టపుర ప్రభుపు కౌశికీపుత్ర ఈశ్వర సేన మహారాజు శాంతిశ్రీ అందము విని ఆబాలిక తనకు మహారాణి కావాలని వాంఛిస్తున్నాడు.

ఆ బాలికకు తాను జగదద్భుత సుందరినని మాత్రం తెలియదు. ఆమెకు తన అందాన్ని గూర్చి విచారణ చేసుకొనేబుద్దే కలుగలేదు. చెలికత్తెలు చెప్పుతూ ఉంటారు మహారాజు బాలికకు. స్త్రీలకూ, పురుషులకూ ఒక విషయం వినగానే అది చెప్పడం వారి అడివి బాపిరాజు రచనలు - 6 • 17 • అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)