పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు కొన్ని వందల సంవత్సరాల నుంచి రాజ్యం చేస్తున్నారు. వారు ధాన్యకటకం రాజధానిగా, కురవ, చోళవాడి, హిరణ్యరాష్ట్రం, కర్ణరాష్ట్ర, ముండరాష్ట్ర, వేంగిరాష్ట్ర పూంగీరాష్ట్ర కర్మరాష్ట్ర, ధనకరాష్ట్ర, దక్షిణకళింగాది ఆంధ్ర రాష్ట్రాలనూ, కుంతల, ఆశ్మక, ములక, అపరాంతక, మాళవ, మధ్యకళింగాది ఇతర చేశాలను పాలిస్తు ఉండిరి. మగధ చక్రవర్తి సింహాసనం ఎక్కిరి. నేపాలం జయించిరి. యువ, సువర్ణ, క్రౌంచ, ప్లక్షాది ద్వీపాలలో శాతవాహన వంశంవారు రాజ్యాలు స్థాపించారు. అలాంటిది నేడు, శాతవాహన సామ్రాజ్యము ముక్కలైపోతుంది అని భయంగా ఉంది. యజ్ఞశ్రీ శాతవాహన చక్రవర్తి దేశదేశాల సైన్యాలను ఆహ్వానించిరి. కప్పాలు అందుకొని వాజిపేయం చేసిన చక్రవర్తి నేడు వృద్ధులయ్యారు. వారికి ఇక్ష్వాకు ప్రభువులంటే ఉన్న నమ్మకం ఎవరిమీదా లేదు. అందుకని మహారాజును ససైన్యంగా రావలసిందని ఆహ్వానం పంపినారు. కుసుమలతాదేవి చక్రవర్తి కొమరిత అయినందున మహారాజుల వారిని త్వరలో ధాన్యకటకం వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. ఇదీ రహస్యం” అని బ్రహ్మదత్త ప్రభువు భోజన సమయంలో తన తల్లికి నివేదించారు.

“అవును తండ్రీ! అయితే చక్రవర్తి మహారాజులవారిని ఏమి కోరుతారు? రాజ్యం రక్షించవలసిందనీ, తమ కొమారులు యువరాజులవారైన శ్రీ విజయ శాతవాహన ప్రభువును తమ తదనంతరం సింహాసనం ఎక్కించి సహాయం చెయ్యవలసిందనీ కోరతారు. అంతేనా?”

“నిజం అమ్మగారూ”

“విజయశ్రీ ప్రభువు విషయంలో భయపడడానికి కారణం?”

“ఆ ప్రభువు చక్రవర్తివలె బుద్ధిబలం కలవారు కారు. అమిత స్త్రీ లోలుపులు.”

“కావచ్చు. అంతమాత్రాన భయమెందుకు?”

“విజయశ్రీ ప్రభువుకు ఏబది ఏళ్ళు పైన ఉన్నాయి. వారి పెద్దకుమారుడు చంద్రశ్రీ ప్రభువుకు ముగ్గురు భార్యలు, నలుబది మంది....”

“ఇంతకూ ”

“ఇంతకూ వీరి దాయది పులమావి ప్రభువు నక్కజిత్తులవాడు. చంద్రశ్రీకి కొమరులు పుట్టరని పులమావి ప్రభువుకు తెలుసును అమ్మగారూ!”

అడవిస్కంద విశాఖాయనక ప్రభువు తల్లిగారితో ఇష్టాగోష్టి మాట్లాడి ఆలోచనా మందిరానికి వెళ్ళినారు.

ఆ మధుమాసంలో ఆ రాత్రి మూడంతస్తుల మేడ పైన ఉప్పరిగమీద చల్లగాలి వీస్తున్నది. ఆ గాలిలో ఏవో మధురమనోహర మత్తతలు రంగరింపై ఉన్నాయి. తాను ఆ బాలికకు చదువు చెప్పాలని ఆ గాలులన్నవి. తన క్రీడావనంలో మల్లిక, మాలతి. మాధవి విరిసి మలయపవనాలకు మరీ మత్తతలు చేకూర్చినాయి.

తన రాష్ట్రము మళ్ళీ ఇంకొకసారి చూస్తాడు ప్రభువు. ధనక వంశ్యులు మొదటినుండి శాతవాహనులకు నమ్మకమైన సామంతులు. వారు గురుదత్తపురం (నేటి గురజాల) రాజధానిగా ధనకరాష్ట్రం రాజ్యంచేస్తూ ఉండిరి. ఇక్ష్వాకులు తమతోపాటు ఒకనాడు అడివి బాపిరాజు రచనలు - 6 • 16 • అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)