Jump to content

పుట:Ammanudi April-July 2020.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెలుగువాళ్ల తలలపై పెట్టి 'మీ తెలుగుమీద మా తమిళ....రా అని వికటాట్టహాసం చేసిరి.

తమిళుల భాషాదురఖిమానం కింద తెలుగుమాటా తెలుగురాతా తెలుగు బతుకు చితికిపోయినాయి.

ఈ ఉదంతానికి ఒక కొసమెరుపు కూడా ఉంది. ఈ ఘోరం జరిగిన కొన్నాళ్లకే, దక్షిణ భారతదేశపు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం బెంగళూరులో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన కాసు బ్రవ్మానందరెడ్డిగారు ఆ సమావేశానికి వచ్చిండానరి తెలుసుకొని, మాకు జరిగిన దారుణాన్ని విన్నవించు కొనేకి, ఇద్దరు ప్రజాప్రతినిధులతో పాటు మరికొందరు పెద్దలుకూడా కలిని ఆదరబాదరగా బెంగళూరుకు సోయి వారిని కలిసిరి.

“తమిళనాడులో ఉన్నారు. తమిళం నేర్చుకొని వారితో కలసిపోండి” అనే ఉచిత సలహాను పారేసిరి బ్రహ్మానంద ప్రభువులవారు. 1969 డిసెంబరులో మాకు తగిలింది పెద్దదెబ్బ.

దాన్నింకా కోలుకోనేకి చానా ఏండ్లే పట్టింది. 1969లోనే మదరాసు రాష్ట్రం పేరు తమిళ నాడు అయింది. 1971 ఎన్నికలలో, కష్టకాలంలో మాకు అండదండలు నిలిచిన కోదండరామయ్యగారు, వెంకటస్వామి గారు శాసనసభ్యులుగా గెలిచిరి హోసూరు పేటనంతా తమిళమయం చేసేసినా పల్లెల్లోకి, బడుల్లోకి తమిళాన్ని రానియ్యలేదు మేము. అయితే పేటకుఫోతే, ఏ కార్యాలయంలో చూసినా అరవమే.

తెలుగులో మాట్లాడితే పనులు కావు, చిన్నచూపు, చీదరింపు, పేటనింకా పల్లెలకు వచ్చే బస్సులమీదంతా అరవమే. ఇంతగా అరవపెత్తనం జరిగినా నూరారు తెలుగు బదులు కొనసాగతానే ఉండాయి. పల్లెపాటలూ పల్లెకళలూ పేటలో సినిమాలూ పత్రికలూ వంటివన్నీ తెలుగే. కోదండరామయ్యగారు “ఆంధ్ర సాంస్కృతిక సంఘం ' పేరుతో హోసూరులో ఒక కట్టడాన్ని ఏర్పాటు చేసిరి. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక శాశ్వతవేదిక దొరికి నట్లయింది.

తమిళ దురభిమాన రాజకీయనాయకులు హూసూరు తెలుగువాళ్లను బెదిరించి తరిమివేయాలనుకొన్నారేమో. మేము మింగుడుపడకపోయేసరికి వాళ్ల ఎత్తుగడను మార్చుకొనిరి. హోసూరు తెలుగువాళ్లనంతా బెదిరించో బేలాడో తమిళులుగా మార్చడమే ఆ ఎత్తుగడ. 1970 వ దశకం మొదట్లో, బెంగళూరుకు కూతవేటు దూరంలోని హోసూరు ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ప్రకటించిరి. అప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రమే తమిళులు ఉండే. మెల్లమెల్లగా దిగువసీమనింకా ఫ్యాక్టరీలూ వాటిలో పనిచేసే వాళ్లూ వచ్చేది ఆరంభమాయె. హోసూరు, డెంకణికోట వంటి పేటల్లో తమిళ జనాభా దినదినానికి నెలనెలకూ ఏడాదేడాదికి పెరగసాగింది. పేట పెట్టంగళ్లలో ఒకటీ అరా కనిపిస్తా ఉండిన తమిళ పత్రికలు పదలు పదులుగా వేలాడుతుండాయి. తమిళ అభివృద్ది సంఘాలు ఏర్పడి నాయి. 1969లో వచ్చింది పెనుతుఫాను. అది ఒక్కసారిగా పైనబడి గందరగోళం చేసేసి పొయ్యేసింది. తుఫాను తర్వాత ఎగిరిపోయిన ఇండ్ల పెంకుల్నీ చెదిరిపోయిన తట్టాబుట్టల్ని సరిచేసుకున్నట్లు, కాలూచెయ్యి కూడదీనుకొని తెలుగు బతుకుల్ని కుదుటపరుచు కొంటిమి. ఇప్పుడు వచ్చింది అట్లాది కాదు. పట్టపగలే పొద్దప్పను గ్రహణం పట్టుకాన్నట్లు, అరవ పెత్తనం కారుచీకటై వచ్చి తెలుగు బతుకును కమ్ముకొనేసింది.

1980 వ దశకం మొదలయి రెండేండ్లు గడచినాంబ. దారీ దరీ కాననీకుండా కమ్ముకున్న కాళరాత్రి ఒక్కసారిగా బళ్లున తెల్లవారి నట్లయింది. మా కోనమే పుట్టినట్లుగా మా కోసమే పెరిగినట్లుగా మా ముందుకు దూసుకొని వచ్చినాడు ఆ ఒక్కమగాడు. ఆయనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌. హోనూరు ప్రాంతానికి ఎక్కడి నింకా వచ్చిందోకానీ వెయ్యేనుగుల బలం వచ్చేసింది.

అప్పటివరకూ సభాప్రాంగణాలలో అరవపాటల్ని వినిపిస్తా ఉండిన మైకుసెట్లు “హితుడా ఆగాగు, ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి” అనే కంచుకంఠాన్ని వినివించసాగినాయి. గుడుల్లో టి.ఎం. సౌందరాజన్‌ పాడిన అరవపాటలు ఏమాయెనో, “జయ క్రిష్ణా ముకుందా మురారీ” అనే ఘంటసాల గొంతు కంగుమంటా ఉంది. పల్లెనింకా పేటకు వచ్చి దోవల్లో నడిచిపోతుండే జనం “చెల్లియో చెల్లకో” అని గొంతెత్తి పాడుకొంటా పోతుండారు.

రామన్న రాజ్యం వచ్చేసిందని పల్లెలంతా ఒకటే కోలాహలం. అవ్ఫటివరకూ ఎన్టీ ఆర్‌ అభిమాన సంఘాలలో ఉండిన యువకులంతా తెలుగువీరులయి ముందుకు వచ్చేసిరి. హోసూరు నింకా బస్సులు వేసుకొని, అన్నగారిని చూసేకి హైదరాబాద్‌కు నూరారుమంది కదలిరి. పోయిన వాళ్లనంతా నోరారా తెలుగులో పలకరించి, పార్టీ జెండాలనూ గోడంట్ల (వాల్‌ పోస్టర్స్‌) ను ఇచ్చి పంపిరి అన్నగారు. 'తెలుగింటి ఆడపడుచులకు రెండు రూపాయలకే కిలో బియ్యం” అనే నినాదంతో, చెయ్యెత్తి నిలబడున్న అన్నగారి ఫొటోతో నిండిన గోడంట్లు పల్లెపల్లెనా