Jump to content

పుట:Ammanudi April-July 2020.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాష్ట్రంలో చేరిపోవాలని మనమెంత పోరాడినా, కలపక మదరాసు రాష్ట్రంలోనే ఉండిపోయింది. 1965లో సేలం జిల్లా ఉత్తరభాగాన్ని చీల్చి ధర్మపురి జిల్లాగా చేసినపుడు, మన హోసూరు కూడా ఈ జిల్లా కిందకు వచ్చింది. మన ప్రాంతంలో ఇప్పటికీ 450 కి పైగా తెలుగు పాఠశాలలు నడుస్తున్నాయి. తమిళు స్మూళ్లు ఇరవైకూడా లేవు. 80శాతం పంచాయితీలలో తెలుగే రాతభాషగా ఉంది. న్యాయస్థానంలోగానీ సజ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కానీ తెలుగే రాత భాష తెల్ల దొరల కాలంలో కానీ కాంగ్రెస్‌ పాలన కాలంలో కానీ తెలుగు భాష జోలికి ఎవరూ రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలుగును ఇక్కట్లు పెట్టాలనుకొన్నా అయ్యేది లేదు. మనమందరం కలిసి కట్టుగా ఉండాల. మన ప్రజాప్రతినిధుల తోడు మనకు ఉంది. ఎవరూ దిగులు పడాల్సిన పనిలేదు.”

మేస్టరు మాటల్ని విని అందరికీ రవంత థైర్యం వచ్చె. అందరమూ గట్టిగా చేతులు తట్టి వెనక్కు తిరిగితిమి. ఆ ధైర్యం సడలిపోయే దినము దగ్గర్లోనే ఉందని అప్పుడు మాకు తెలియలేదు. వెంటవెంటనే తెలుగుమీద తెలుగువాళ్లమీద దెబ్బమీద దెబ్బ పడింది. స్కూల్లో తమిళ ప్రార్దనే జరగాలని నిర్బంధం పెరిగింది. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో, ఆంధ్ర సారస్వత సంఘంవారు, ఆరుద్ర, కొంగర జగ్గయ్యగార్లను పిలిపించి సాహిత్య సభను ఏర్పాటుచేస్తే, తమిళ పోలీసుల అండతో రౌడీ మూకలు, సభావేదిక తాళ్లను కత్తిరించేసిరి. వేదికమీది కొందరికి గట్టి దెబ్బలు తగిలినాయి. మరొకసారి గుమ్మడి, సినారె గార్లను పిలిపించుకొనే దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తెలుగు సినిమాల ప్రదర్శనకు కూడా ఆటంకాలు మొదలయినాయి. తమిళ చిత్రాల్నే వేయాలని తియేటర్ల యజమానులకు బెదిరింపులు పోసాగినాయి. డెంకణికోటలో ఏర్పాటుచేసిన నరాల రామారెడ్డి అవధానమును, తమిళ అల్లరిమూక జరగనీకుండా చేసేసింది. ప్రభుత్వ కార్యాలయాల మీద తెలుగు పేర్లు తొలగిపోయి అరవరాతలు ప్రత్యక్షమయినాయి. అంగళ్లమీద కూడా తమిళమే ఉండాలని వ్యాపారస్తులమీద ఒత్తిడి పెరిగింది. పంచాయితీ తీర్మానాలన్నీ తమిళంలోనే ఉండి తీరాలని పట్టుపడతా ఉండారు.

1969 డిసెంబరు నాలుగో తేదీన స్కూలుకుపోతా ఉండే తెలుగు ఆడబిడ్దలమీద, కాళ్లతో బురదనీళ్లను చిమ్మి గలాట చేసిరి తమిళ రౌడీ చిన్నోళ్సు. దానిని చూసిన ఒక తెలుగు మాస్టరు ఆచిన్నోళ్లను మందలించినాడు. ఆ రాత్రికిరాత్రే “హోసూరులో తెలుగు చచ్చింది, తెలుగు మేస్టరూ చస్తాడు " అని గోడల మీద రాతలు వెలసినాయి.

దీనికి నిరసనగా, డిసెంబరు తొమ్మిదో తేది పొద్దున్నే తెలుగు విద్యార్థులంతా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో సమావేశ మయ్యిరి. ఇదంతా ఒక పథకం ప్రకారం జరగతా ఉందని వాళ్లకు తెలియదు. అంతకు ముందునాడే రిజర్వు పోలీసు దళాలు హోసూరులో దిగిండాయి. ఉన్నెట్లుంది ఆ దళాలన్నీ కళాశాలను చుట్టుముట్టినాయి. ఆ కళాశాలకు చుట్టూ ఇనుపముళ్ల తీగ, లోపలకూ బయటకూ ఒకటే ద్వారం. ఆ దారిని కమ్ముకున్న పోలీసులు విద్యార్థుల మీద పడిరి. లోపల ఉండేది తీవ్రవాదులో ఉగ్రవాదులో కాదు. పైకి తెగబడి వస్తుండే రౌడీల నుండి అమ్మను కాపాడు కొనేది ఎట్లనో ఆలోచించే దానికి కూర్చునుండే విద్యార్థులు. లాఠీలతో కేనులతో కొట్టేదీ బూటుకాళ్లతో తన్నేదీ ఆరంభమయింది. ఎందరో సౌరణతప్పి పడిపోయిరి. 25 మంది దారుణంగా గాయపడిరి. కల్ల(కంచె)ను ఎగిరిదూకి పారిపోవాలనీ ప్రయత్నించిన వాళ్లకు, ఒళ్లంతా ఇనుప ముళ్లు చీరుకొనిపోయినాయి. కొందరికి గొంతులో గుచ్చుకొని శాశ్వతంగా మూగవాళ్లయిపోయిరి.

దారుణమైన ఈ హింసాకాండ ఒకపక్క జరగతా ఉంది. మరొకపక్క తెలుగువాళ్లను కొట్టిన దానికి కారణం చూపించేకని, కొందరు నీచమైన యోచనచేసిరి. అన్నాదొర మట్టిశిలను కొట్టి వికారం చేసి తెలుగు విద్యార్థులు, నెత్తురోడే బట్టలతో హోసూరు వీధుల్లో 'జై తెలుగు” అని నినదిస్తా ఊరేగింపుగా నడిచిరి.

జిల్లా కలెక్టరు వచ్చి, మన్నింపవు అడిగి, నష్టపరిహారం కట్టమన్నాడు. తెలుగు విద్యార్దులు ఒప్పుకోలేదు. చేయని తప్పుకు తలవంచమని తెగేసి చెప్పేసిరి. రాత్రికి రాత్రే 144 సెక్షన్ను అమలులోకి తెచ్చిరి. ఎక్కడివాళ్లనక్కడ నిర్చంధించేదీ అరెస్టుచేసేది ఆరంభమయింది. రంగారెడ్డి, కిష్టమూర్తి, రాజన్న మునిసీతప్ప, ప్రభాకరరెడ్డి, గురప్ప చౌదరి, సిద్దప్ప, గోపాల్, ఖీమప్ప, కిష్టప్ప, నాగప్ప, లక్ష్మణరెడ్డి, చిక్కన్న, క్రిష్టాచారి, సంపంగి, పొన్నప్పు, శంతరాచారి, పాండు, గోపాలక్రిష్ణ, మోహన్‌, పట్టన్న ఆంజప్ప, శివన్న సంపత్‌ వంటి 36మంది తెలుగు మేస్టర్లను హోసూరు చెరసాలలో వేసి, అనెంక సేలం చెరకు తరలించిరి. మునిస్వామి, రామచంద్ర, జయరామరెడ్డి, రామచంద్రప్ప, రామన్న శ్రీనివాసరెడ్డి, రామస్వామి, నారాయణమూర్తి, ఆదినారాయణరెడ్డి, రామానుజప్ప, మునియప్ప, గోపీనాథ్‌, వెంకటేశ్‌, క్రిష్ణమూర్తి వంటి ముక్కుపచ్చ లారని 15 మంది 15 ఏండ్ల లోపు చిన్నోళ్లని సేలంకు తరలించి చెరలో పెట్టిరి. 'తెలుగువాళ్లను చెరలో పెట్టేస్తిమి, తెలుగు ఆడోళ్లను చెరపట్టచ్చు” అని పోలికేకలు పెట్టిరి.

మరునాడు పొద్దున్నే హోసూరులో సంత. 144 సెక్షన్‌ అంటేనే తెలియని పల్లెల జనం హోసూరుకు చేరుకొనిరి. సంతకు పోతుండే వాళ్లని లాఠీలతో బాదసాగినారు పోలీసులు. ఏం జరగతా ఉందనేది అమాయక పల్లెజనంకు తెలియలేదు. దుమ్ములో కూరుకుపోయేనట్లు కొట్టి, తన ఏకైక ఆస్తి అయిన 120 రూపాయలను పోలీసులు కాజేస్తుంటే “ఇంక తెలుగులో మాట్లాడితే చంపేస్తారంట, నిజమేనా అప్పా” అంటా గొల్లుమనింది ఒక తెలుగు ముసలామె. శివారు ప్రాంతమైన కుముదేపల్లి వంటి గ్రామాలపై దాడిచేని, గొర్రెల్ని మేపుకొంటా ఉండే తెలుగు ఆడవాళ్లను పట్టుకాని పదిమ్టైళ్ళకు అవతలున్న సూలగిరి పోలీస్‌ స్టేషనుకు ఈడ్బుకొనిపోయి దారుణంగా చెరిచిరి. సంగం క్షవరం చేయించు కొన్న మగవాళ్లను మంగలి అంగళ్లనింకా బయటకు ఈడ్చి కొట్టిరి. హోటళ్లలో దూరి సగం బోజనం తినినవాళ్లని ఈడ్చుకొని వచ్చి బాదిరి.

కోమటివారి అంగళ్లలోని సరుకులనంతా లూటీచేసి, మిగిలిన వాటిని వీధుల్లోకి చిమ్మేసిరి. పన్నెండు వేల జనాభాగల హోసూరు పేట వల్లకాదుగా మారిపోయింది.

ఇంక చెరసాలల్లో పెట్టినవాళ్ల వెతలు అన్నీయిన్నీ కాదు. వాళ్ల బట్టలూ డబ్బులూ చెప్పులూ అన్నిటినీ కాజేసిరి. వారి బట్టలలోనే వారిచేతనే ఉచ్చలు పోయించిరి. మరుగుదొడ్డలో దొర్లిస్తూ బూటుకాళ్లతో తన్నిరి. అన్నిటికంటే ఘోరం, వాళ్ల మర్మాంగాలను