కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ఎలామోసగిస్తున్నది, చట్టాలను ఎలా తుంగలో తొక్కుతున్నది (అడవిలో వెన్నెల 1985), ప్రజలలో పనిచేసే కార్యకర్తలు తమురాసిన కధలలో వర్ణిస్తూంటే, ఆ వివరాలు, లెక్కలు తెలునుకోకుండా మేధావులు “విజ్ఞాన బోధ చేయసాగారు (అడవిలో వెన్నెల- గిరిజనులు, గిరిజన సంస్కృతి
బాలగోపాల్). విష్లవ కాల్పనికత, మాజిక్ రియలిజం అంటూ లాక్షణికులు ప్రశంసింస్తూ ఎండమావులలో నీళ్ళు చూపించ సాగారు “విష్లవోద్యమానికెలాగో, దాని అంతర్భాగమైన విప్లవ సాహిత్యోద్యమానికి సైతం మార్కిజం, మావో ఆలోచన విధానమే సరిపడు ప్రాపంచిక దృక్సథం. ఎవడో కవి అనుకున్నట్లు మక్షికి మక్కి దించే మూర్చులెవరూ లేరు. మన పరిస్థితులకు అనువుగా మలచే ప్రయత్నమే జరుగుతున్నది? అన్నారు గాని మావో చేనిన నిర్మాణ విధానాలు గమనించ లేక ఫోయారు. (అడవిలో వెన్నెల- వేడి వెన్నెల కె. వి రమణారెడ్డి)
ఆవేశంలో ఉద్యమాలలో చేరి కొందరు బలిఅయిసోతుంటే, ఏదో గుంపుకు చేరబడి మేధావులు సిద్ధాంతాలు వల్లిస్తూ ఎగదోయ సాగారు. ఈ సంఘాలలో రాజకీయాలను విస్తృతంగా చర్చించిన కన్నబిరాన్, ఆ “ఉద్యమానికి వచ్చిన మద్దతు అంతా దాని భవివ్యత్ స్వప్నాలనుండి వచ్చింది. (24 గంటలు. పుట 245) కాని “పిడుక్కి బియ్యానికి ఒకే మంత్ర మన్నట్లు ప్రవర్తించటం వల్లనే ట్రేడ్ యూనియన్ ఉద్యమంతో పాటు రైతాంగ ఉద్యమం కూడా అపజయానికి గురి అయిందని నేను అనుకుంటాను". (21) అని బాథపడతారు.
బానిస చదువులు ౫ ప్రశ్నించే చదువులు
డిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్య నందిని సుందర్ బస్తర్ చరిత్రలో, 1910 లో అటవీచట్టం ప్రవేశపెట్టినపుడు జరిగిన తిరుగుబాటుకు స్పందించిన ప్రభుత్వం పంపిన అధికారులు, ఆ చట్టంలో ప్రజల అవసరాలను అనుమతిస్తూ, విచ్చల విడిగా అడవి నరికివేతను నియంత్రిస్తూ చేసిన నిబంధనలను వివరించి, వారిని సమాధాన పరచినట్లు రాశారు, ప్రజలు ఎక్కువ బడులు పెట్టమని, ఇంటికొకడన్నా చదువుకుని, ఆ మినహాయింపులు, వెసులుబాట్లు అందరికి చెపుతాడని, అక్రమాలను పై అధికారులకు ఫిర్యాదు చేస్తాడని తమ దగ్గరకు వచ్చిన అదికారులను కోరుతారు అని ఆమె పేర్కొంటారు. కాని, ప్రభుత్వాలు బడులు పెట్టాయి. కాని, ఈ నిబంధనలను, వాటికి సంబంధించిన పటాలు, లెక్కలను బడిలో నేర్చలేదు. ఉద్యోగాలకు కావలసిన బానిసలను తయారు చేసుకోసాగారే కాని, అక్కడే తప్పులను ప్రశ్నించే ఫౌరులుగా ఎదగకుండా, విద్యారంగాన్ని పాలక వర్గాలు తమ గుప్పిట్లో పెట్టున్నారు. ఆ చదువులు చదివే వాళ్ళకు ఆ ఉద్యోగంలో చేరితే తప్ప ఆ మతలబులు తెలియవు. అవేమీ 'బ్రహ్మావిద్యలు కావు. కాని ఈ మేధావులకు నేర్చుకుందాం, నేర్పుదాం అని ఉండదు. 'శేషం కోపేన పూరయేత్' అన్నట్లు తీవ్రంగా ఖండిన్తుంటారు. ఆ మూసలోనే శిష్యులను తయారు చేస్తారు. నందిని సుందర్ సల్వాజుడుం మీద కేసు వేసి రద్దు చేయించారు. శంకరన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పరచిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం, రూల్స్ రూపొందించిన కమిటిలో ఆమె సభ్యురాలు. ఇ. ఏ.యస్. శర్మ, రామచంద్ర గుహా ఆమె పిలుపు మేరకు బస్తర్ పర్యటించి. ఆదివానులమీద మీద జరుగుతున్న దమన కాండను ఎండగట్టారు. విశ్రాంత ఉన్నతాధికారి యన్. సి.సక్సేనా బస్తర్‌లో అటవీ హక్కుల అమలులో అవక తవకల మీద నివేదిక ఇచ్చారు. దాని అమలు కోసం ఆమె కోర్టుకెక్కి ఉంటే బాగుండేది. ఇంతలో ఆమె మీద హత్యానేరం మోపారు. ఆమె ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పిల్లల విద్య, హక్కులకోసం శాంతా సిన్హా పర్యటించారు. నేటిపిల్లలే రేపటి పౌరులు. ఉన్నత విద్వారంగంలో పనిచేసే వీళ్ళు, ఉత్పత్తి
సాధనాలు, కనీస వేతనాలు, ఉపాధి హామీ, పొదువు లెక్కలు, దరఖాస్తులు నింపగల చదువులకోసం ప్రయత్నం చేయలేదు. ప్రజలకు పనికొచ్చే చదువులను వదిలేయకూడదు. ఎవరో అన్నట్లు లెక్కల మాస్టారుగా బాలగోపాల్ కొనసాగిఉంటే నోబెల్ వచ్చేదేమో గానీ, పౌరహక్కుల రంగంలోకి వచ్చిన ఆయన, ప్రజలకు కావలసిన లెక్కల మీద దృష్టిపెట్టలేదు.
ఉద్యమాలకు అనుగుణంగా చట్టాలు. అమలులో వక్రమార్గాలు
1940లలో కొమరం ఖీం బలిదానం తరువాత వచ్చి గిరిజనులను అధ్యయనం చేసిన మానవ శాస్త్ర వేత్త హైమెందర్భ్ స్థానిక ఉద్యోగులు పట్వారిలు, ఫారెస్ట్ గార్జులను లోబరచుకాని, భూస్వాములు, కాంట్రాక్టర్లు చేస్తున్న మోసాలను ఏకరువు పెట్టారు. నాటి ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. ఆయన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు పెట్టాడు. వాటిలో భూమి, అడవి కూలి వీటి కొలతలు, లెక్కలు పాఠాలుగా పెట్టలేదు. మళ్ళి 1980లో వచ్చిన అయన, చదువుకున్న గిరిజనులు ఒకవర్గంగా తయారైనారని, వారు ఏవిథంగానూ తమవారికి ఉపయోగ పడలేక పోతున్నారని వాపోతారు(Tribes of India: Struggle for survival 1982) పారహక్కుల ఉద్యమం బలంగా ఉన్న వరంగల్‌లో పాలనాశాస్త్రం చదివిన హారగోపాల్ పైరవీకారులే/దళారులే ఆఫీసులలో కథ నడిపిస్తున్నారని, వాళ్ళు లేకపోతే ప్రభుత్వమే నడవదని సిద్ధాంత గ్రంధం రాసారు.
మేధావుల ఉదాసీన వైఖరులు
ఒక పక్క ఉద్యమాలను అణచివేన్తూనే,ప్రభుత్వాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు చేయసాగాయి. ప్రకాశం పంతులు రివిన్వూ మంత్రిగా(1937) అర్ధరూపాయికి మించిన వడ్డీ తీనుకోరాదని చట్టం చేసారు. తెలంగాణా సాయుధ పోరాటం ఫలితంగా రక్షిత కౌలుదారి చట్టం వచ్చింది. శ్రీకాకుళ పోరాటం వల్ల 1/70 వచ్చింది. భూ సంన్మరణలు చేపట్టింది. ఇంద్రవెల్లి మారణకాండ తరువాత ఉన్నతాధికారుల కార్యాలయాలు గిరిజనప్రాంతాలకు తరలి వెళ్ళాయి. గిరిజన ప్రాంతాల భూముల సర్వే
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జులై-2020
18