Jump to content

పుట:Ammanudi April-July 2020.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంప్రదాయం సాధికారత

డా॥ పి. శివరామకృష్ణ 'శక్తి ' 9441427977

ఎండమావి నీళ్ళు చూసి గుండెమంటలార్పుకోకు”

దేశి X శిష్ట సాహిత్యాలు.

'దేశి వాంగ్మయం, ఆటపాటలు బతుకు తెరువులకు పునాదులు. శిష్ట సాహిత్యం ఉపరితలం. దానికి పునాదిని కదిలించే శక్తి లేదు. తెల్లవాళ్ళు రాకముందు సాహిత్యచరిత్ర వర్ణించే దక్షిణాంధ్రయుగంలో 'మొత్తం మీద మౌఖిక సాహిత్య ప్రభావం బలంగానే ఉంది (త్రిమరా. త్రిపురనేని మధుసూదనరావు. సాహిత్యంలో వస్తుశిల్పాలు పుట 186)

తెల్లవారిచదువులు,కొలువులు మరిగిన శిష్ణులు, జానపదాన్ని గ్రామ్యం, పామరంగా ఈసడించి పక్కకు నెట్టారు. ఆ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా రాజాశ్రయంతో, అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ, ప్రచురణరంగం విస్తరించి బలపడిన శిష్టసాహిత్వం, పాశ్చాత్య సాహిత్యం ఒరవడిగా వేసిన వెర్రితలలు, “రచనల ఉత్పత్తిరంగంలో వచ్చిన మార్పులు సమాజాన్ని ఎలా నిర్వీర్యం చేసిందీ 'త్రిమరా ' వివరిస్తారు (పుట 93,111). లిఖిత సాహిత్యం దేశి సాహిత్యానికి సాటిరాదని తెగేసి చెపుతారు. అంతేకాదు దానికి విప్లవానికి పురికొల్బగల శక్తిగూడా ఉందని నొక్కి చెపుతారు. (అంతర్గత గతితర్మంలో పడి, వెల్చేరు నారాయణరావు ఆశుకవిత్వ చరిత్రని వర్గస్వభావాన్నీ విస్మరించారు. లేఖనప్రక్రియను మాత్రమే కవితా విప్లవాలకు చోదక శక్తిగా చెప్పటం అర్జరహితం. 'సాపొత్యంలో వస్తు శిల్పాలు” పుట 74, వర్గేతర ఆదిమ సమాజాల్లో కవిత్వం ఆశురూవంగా ఉండేదని మార్చిన్ట్‌ సాహిత్య కార్యకర్తలు చెపుతూనే ఉన్నారు(72). జానవద వాంగ్మయంలో.. తెలుగు స్త్రీల సాహనపరాక్రమాలేకాక ప్రణయజీవితంలో కూడా, స్వేచ్చ మానవతాస్పూర్తి కనిపిస్తాయి. (107) బ్రిటిష్‌ వాళ్ళు వ్యవస్థలో మార్పులు తెచ్చారు. వాళ్ళు బూర్డువా విధానాలను ప్రవేశపెట్టిన సాామాజ్య వాదులు(పుట 111).ఈ బూర్జువా వర్షం డాబు దర్పాలను, మోసకారి లక్షణాలను, లంచగొండితనాన్ని దుయ్యబట్టే చిలకమర్తి మాటలు “నువ్వేం తాలుక్కచేరి బంట్రోతువా పోలీసుజవానువా, ముంచిబువా కరణానివా నీకు దడిచేందుకు?” ప్రసిద్దమైనవి. ఈ కొలువుల అండతో సాహిత్యగాళ్ళు అరకొరజ్ఞానంతో సామాజిక స్పృహ పేరిట చలామణి కాసాగారు.

ఈ తెలయుగంలో “కవి, కవిత్వం, శ్రోతలు సమాజం అనే నాలుగు ముఖ్యాంశాల్లో- శ్రొతలు, సమాజం పోయి, కవి, కవిత్వం మిగిలాయి”. (140)

“ఇక ఆధునిక యుగంలో మధ్యతరగతి శిష్ట బృందం ప్రేక్షకులుగా ఉన్నారు. ఆధునిక విద్యా విధాన ఉత్పత్తి అయిన మధ్యతరగతి మేధావి, బుద్దిజీవుల బృందానికే ఈ నాటికీ నాటక రంగం పరిమితంగా ఉంది. నిరక్షరాస్యులైన శ్రమజీవులలో ప్రచారంలో ఉన్న ప్రదర్శక కళారూపాలను పునరుద్దరించుకోవాలి, ఆ సంచితాన్ని మనం భద్రవరచు కోవాలి”. (to prepare a heritage in no means to be limited by it; Lenin 173 పుట కవిత్వం చైతన్యం.) అని పిలుపునిస్తారు.

ఉద్యమ సాహిత్యం- 'అమ్మమ్మ, నాయనమ్మ కథలూ

కాని, ప్రజలలో వర్గస్పృహ ఉందిగాని వర్ష చైతన్యం లేదు అని చిత్రమైన భాష్యాలు చెపుతూ, మార్పుకోసం తొందరపెట్టే వర్షాల అండదండలతో ఉద్యవు సాహిత్యం బలపడసాగింది. అది మరో శిష్ట సాహిత్యమై పరాన్నజీవి వలె పెరిగి, జానవదాన్ని తొక్కేయటాన్ని గర్వంగా చెప్పుకునే అహం పెరిగిపోయింది 'జానపద బాణిలో గెరిల్లాలు ప్రవేశపెట్టిన గాధలు వినిపించాయిగాని అమ్మమ్మ నాయనమ్మ కథలు విన్సించలేదు”. (జంగల్‌ నామా ముందుమాటలో వరవర రావు) ఇలా 'సాంస్కృతిక దండయాత్ర చాపకింద నీరులా ప్రసరించింది. దీనికి ఏ పరాయి దేశం వారినో నిందించటానికి వీలులేదు. దీనివల్ల సామాజిక జీవనంలో అంతులేని సామరస్యానికి దోహదం చేసిన సమిష్టి సంస్కృతి నశించిపోయే ప్రమాదం ప్రారంభమైంది. (నాయని కృష్ణకుమారి, వేముల పెరుమాళ్ళు-తెలంగాణా జాతీయాలు” లో When the super structure obstructs the development of the base political and cultural changes become principle and decisive (Mao) రాజకీయాలు కళలు మతం వీటినుంచి పుట్టిన అనేక విషయాలు, మూల ఆర్ధిక శక్తులలోని ఘర్షణను అణచి వేస్తున్నప్పుడు, ఆటంక పరుస్తున్నప్పుడు ప్రధాన పోరాటం ఉపరితలం మీదే చేయాలి. (కవిత్వం -ఛైతన్యం పుట ౩8) అని ప్రొత్సహిస్తారు. జానవద సాహిత్యం సేంద్రియ ఎరువైతే, ఉద్యమసాహిత్యం “దుక్కి మసాలా” అంటే రసాయనిక ఎరువు వంటిది. సేంద్రియ ఎరువుతో సత్తువ చేయకపోతే ఫొలం పనికి రాకుండా పోతుంది. అదే జరిగింది. తమంత తాము సాహిత్యం అల్లుకోగల సమాజం - రచనల మీద, కంపనీ ఎరువులు, విత్తనాల మీద, యంత్రాల మీద అధారపడ సాగారు. ఇపుడు సేంద్రియ వ్యవసాయం బాట పడుతున్నారు. విత్తనాల మీద అధికారం కోరుకుంటున్నారు. కళలలో కూడా ఈ ప్రయత్నాలు విస్తరించాలి.

విముక్తి- నిర్మాణం

చైనాకు విముక్తి /స్పతంత్రం తెచ్చాక మావో నవచైనాకు తగిన విద్యావిధానం, భూమి, కమ్యూన్‌ లెక్కలు, బేర్‌ వుట్‌ ఆరోగ్య కార్యకర్తల తయారీ ప్రాధమిక స్థాయిలోనే ప్రవేశపెట్టాడు. జనతా ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి రాజనారాయణ్‌ వీటినుండి స్పూర్తిపొంది సామాజిక ఆరోగ్య కార్యకర్తల పథకం రూపొందించినట్లు చెప్పుకున్నాడు.

“అడవిలో వెన్నెల

ఉద్యోగులు భూస్వాములతో,