పుట:Ammanudi-May-2019.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పుస్తక సమీక్ష

క్రాంతదర్శి;కందుకూరి

సంపాదకుడు : డా; తూమటి సంజీవరావు వెల: 450/-

ప్రతులకు : జి2, నీలాద్రి అపార్ట్‌మెంట్స్‌, న్యూ 186 (పాతది 111) లేక్‌ వ్యూ రోడ్‌ (పోస్టాఫీసు దగ్గర) వెస్ట్‌ మాబలం, చెన్నై - 600 033, సెల్‌ : 9884446208


కందుకూరి వీరేశలింగము శతవర్థంతి (1848-1919) సందర్భంగా తేదీ 31 -10-2018 నాడు చెన్నపురి తెలుగువాణి ప్రచురణ “క్రాంతదర్శి - కందుకూరి ' విశేష సంచిక చెన్నై నగరంలో ఆవిష్మరింపబడింది. కందుకూరి శతవర్థంతి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగక పోవటమేమిటి?! ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, సాహిత్య సంస్కృతీ సంస్థలు, గ్రంథాలయాలు మొ॥వి స్పందించకపోవడం, తెలిసిందే! అయితే, కందుకూరి తనువు చాలించింది 27-05-1919న మదరానులోని కొమజ్టాజు లక్ష్మణరావు పంతులుగారి వేదవిలాస్‌లో గనుక, అక్కడే అంటే చెన్నైలో జరపడం సబబు అని భావించారు సంపాదకులు మరియు కార్యదర్శితో పాటు చెన్నై తెలుగు వాణి అధ్యక్షులు. కాని అది అంత సమర్థనీయంగా అన్నించదు. కందుకూరి శతవర్థంతి చెన్నైలో జరగటం వారు అక్కడ మరణం పొందటం కాదు - అక్కడ చెన్నైలో డా॥ తూమాటి సంజీవరావు ఉండటమే! పొరుగు రాష్ట్రంలో ఉన్నా తెలుగుకై తపించి, జపించి, శ్రమించేవాడు, తెలుగుకు ప్రాచీన హోదా కోసం ఏక వ్యక్తి పోరాటం చేసి న్యాయస్థానంలో గెలుపొందిన భాషా ప్రేమికుడు, కందుకూరి శతవర్థంతిని నిర్వహించే ఖాగ్యం ఎందరికి లభిస్తుందని భావించే (విత్తశుద్ధి లేని) చిత్తశుద్ధి కల భాషా ప్రేమికుడు, సేవకుడు డా|| తూమాటి సంజీవరావు.

'క్రాంతదర్శి - కందుకూరి ' ఆ మహానుభావునికి అర్చించిన అద్భుతమైన నివాళి. కందుకూరి నవ్యాంధ్ర సాహిత్య నిర్మాత, శతాధిక గ్రంథకర్త, సంఘ సంస్కర్త, పత్రికాధిపతి, గద్యబ్రహ్మ, దక్షిణ భారత విద్యాసాగరుడుగా ప్రసిద్ధులు. అయితే, సంపాదకులు 'క్రాంతదర్శి అని శీర్శిక పెట్టడం, చాల వినూత్నమైన ఆలోచన. 'అతీతా నాగత ' అని శీర్శిక పెట్టడం, చాలా వినూత్నమైన ఆలోచన. "అతీతా నాగత సమస్త వస్తువేత్తరి - క్రాన్తదర్శీ” అని శబ్బార్థ కల్చ తరువు చెప్పుతుంది. అంటే, కడచినవియు, రాబోవునవియు నగు విషయములనన్నిటిని ఎఱిగిన వాడు అని అర్ధం. తెలుగు సాహిత్యానికి ప్రక్రియా వైవిధ్యాన్ని వైభవాన్ని అందించటమే కాకుండా సంస్కార ధోరణులు ప్రవేశపెట్టి మత దురాచారాలను మూఢ విశ్వాసాలను, ఛాందసాలను ఖండిం చారు.స్త్రీ అభ్యుదయానికి, స్త్రీ విద్యకు, మహోత్కృష్ట వితంతు పునర్వివాహ సంస్మరణలు చేపట్టి కేవలం రచనలతో సరిపెట్టకుండా కార్యరంగంలో చేసి చూపిన -కార్యశూరుడు వీరేశలింగం / కలం పట్టి పోరాడిన సింగం/ దురాచారాలను దురాగతాలను / తుద ముట్టించిన అగ్ని తరంగం/ అడుగో అతడే వీరేశలింగం “కందుకూరి ఒక ఏకవ్యక్తి విశ్వ విద్యాలయం” అని శ్రీశ్రీ ప్రశంసించారు.

ఈ సంకలనం ఐదు అధ్యాయాలుగా విభాగింపబడింది. కందుకూరి సాహితీ తత్త్వం, కందుకూరి సామాజిక తత్త్వం పేరున ఉన్న 32 వ్యాసాలు (రెండు అధ్యాయాలు 16+16 కలిపి) దేనికది ఒక సాహితీ సుమమే! మధునాపంతుల, కట్టమంచి, ఎన్‌.జి.రంగా వంటి నాటి ప్రతిభావంతులు, నేడు తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న వారు వ్రాసిన వ్యాసాలు నిజంగా చిన్న తరవాో సిద్ధాంత వ్యాసాలు అనిపించేలా - పరిశీలనాత్మకంగాను, పరిశోధనాత్మకం గాను, వ్రాయటం ఈ సంకలనంలోని విశేషం. కాంగైస్‌ మహాసభ లలో రాజకీయాంశాలకీ, స్వాతంత్య్ర పోరాటానికి ప్రాధాన్యమిచ్చి, సాంఘిక సమస్యలు చర్చకు రాకపోవటం వలన ఆ సమస్యలు అలాగే ఉండి పోయినవని డా॥;ఎమ్‌.శ్రీనివాసరావు 'కందుకూరి స్మృతి - ఆవశ్యకత వ్యాసం లోను; నిబద్ధత, నిమగ్నత, నిబిడత అనే త్రిగుజాత్మకంగా సాగించే విమర్శనంలో కందుకూరి సాహిత్యం విశిష్టంగా నిలుస్తుంది, అని మరొక సందర్భంలో కందుకూరి దళితులను ఎలా ఆదరించారో కొలకలూరి ఇనాక్‌ పేర్కొంటూ కందుకూరిని సరిగ్గా చదవకుండా ఆరోపణలు చేసినవారికి సమాథానం యిచ్చారు. కందుకూరి స్వీయ చరిత్రను శ్రీమతి రాజ్యలక్ష్మమ్మకు అంకితమిస్తూ రాసిన పద్యాన్ని ఆయన దస్తూరిలోనే ఆచార్య మలయవాసిని అందించారు (పేజీ. 162). డా॥ మిరియాల గౌతమ్‌ 'బ్రాహ్మ వివాహం- పెద్దయ్యగారి పెళ్ళి' నాటకాన్ని ఆసక్తికరంగా విశ్లేషిస్తూ - ఈ నాటకం ఏ పూట కూళ్లమ్మతో ముగస్తుందో, అదే పూటకూళ్ళమ్మతో గురజాడ కన్యా శుల్మం ప్రారంభమైంది అంటారు. అదే విధంగా కందుకూరి వారు 'సత్యవతీ చరిత్రము” నవలికలో (1888 సం||) వాడినది వ్యావహారిక భాష అనీ, ఇది కన్యాశుల్మం (1892) కు ముందుగానే అని శ్రీమతి జగద్ధాత్రి అభిప్రాయ పడ్డారు. ఆ విధంగానే మలయాళ సమాజాన్ని ప్రభావితం చేసిన సంస్కర్తల్లో ముగ్గురిని (కందుకూరివంటివారిని) సమకాలికులుగా పేర్కొన్నారు శ్రీ ఎల్‌.ఆర్‌. స్వామి. సంస్కర్త త్రయం అనే వ్యాసంలో శ్రీనారాయణ గురు (1856-1928), అయ్యంకాళి (1863-1941), వి.టి. భట్టి తిరిపాడ్‌ (1896-1982) ల గురిం చిన విశ్లేషణ చేస్తూ ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మిగతా వ్యాసాలు కూడా స్థాయిలోను, విశ్లేషణలోను ఎంతో ప్రామా ణికంగా ఉన్నాయి. మూడవ విభాగంలో - కందుకూరి రచనలయిన అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము, అతి బాల్య వివాహము, మానుష ధర్మము, అధ్యక్షోపన్యాసము (ప్రెసిడనియల్ అడ్రస్‌ - 1889లో మదరాసులో జరిగిన ఇండియన్‌ సోషల్‌ రిఫార్మ్‌ జాతీయ సభలో కందుకూరి అధ్యక్షోపన్యాసము) దాని ఆంధ్రానువాదం ఉన్నాయి. వీటిలో మానుష ధర్మము, అథ్యక్షోపన్యాసము శతవర్థంతి సందర్భంగా మొదటి సారి ప్రచురితం అవటం సంతోషకరం. నాలుగవ అధ్యాయంలో - కందుకూరి నివాళి ' శీర్షికన విశ్వ నాథ, ఆరుద్ర, రాయప్రోలు, దాశరథి, సినారె, కొండవీటి వంటి మ్రుఖ కవుల కవితా నివాళులున్నాయి. ఇక ఐదవ, చివర అధ్యాయంలో శతవర్ధంతి సభ (31-10- 2018) విశేషాలు ఉన్నాయి. ఇలా విభిన్నంగాను, విశిష్టంగాను రూపొందిన 'క్రాంతదర్శి -కందుకూరి” సంచికలోని వ్యాసాలను ఈ తరం పాఠకులు తప్పకుండా చదవాలి. యుగ పురుషుడైన కందుకూరి జీవిత, ఉద్యమ, సాహిత్యాలను చదవాలనే ఆసక్తిని ఈ సంచిక కలుగజేస్తుంది. సందేహం లేదు. చివరగా చెప్పుకున్నా - ప్రధానమైనవి రెండు విషయాలు . ఒకటి - ఈ సంచిక వెలువడటానికి ఒక లక్షరూపాయల ఆర్థిక సహాయాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున అందచేసిన మంత్రి శ్రీ మల్లాడి కృష్ణారావు, రెండు. ఏదేశమేగినా, ఎందుకాలిడినా... అన్న ట్టుగా తెలుగుకు ఎల్లలు లేవని, ఆంధ్రభారతికి సేవ చేస్తున్న డా; తూమాటి సంజీవరావు, ఇద్దరూ అభినందనీయులే!

ఎమ్‌. వి.శాప్రి 9441 342999

48

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019