పుట:Ammanudi-May-2019.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యవసాయానికి ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నామని ప్రతి ప్రభుత్వం గొప్పగా చెప్పుకోంటుంది. కానీ వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ప్రతికూల సబ్బిడీలు ఇస్తున్నారని గ్రహించాలి. ఒక అధ్యయనం ప్రకారం 2000 నుండి 2016 మద్య భారత రైతులు 14 శాతం ప్రతికూల సబ్సీడీలే దేశానికి ఇచ్చారు. అంటే వారు దేశానికి అందించిన వ్యవసాయ ఉత్పత్తుల విలువ కన్నా వారికి లభించిన ధరలు 14 శాతం తక్కువ అన్నమాట.

రైతులకు గిట్టుబాటు ధరలు దక్కక ఫోవడంతో దళారులే భారీ లాభాలు పొందుతున్నారు. వారితో రాజకీయ నేతలు కుమ్మక్కు అవుతున్నారు. విత్తనాలు, వ్యవసాయ ఉపకరణాలు, ఉత్పత్తులు, మార్కెట్‌ ... ప్రతి చోట పలు నిర్చంధాలు, నియంత్రణలు, ఆంక్షలకు లోనవుతున్నారు. ఈ ఆంక్షల సంకెళ్ళ నుండి స్వేచ్చ కలిగిస్తే గాని రైతులు ఊపిరి పీల్చుకోలేరు. వ్యవసాయాన్ని గిట్టుబాటుగా మార్చుకోలేరు.

రైతులకు ప్రధానమైన ఆస్తి భూమి. ఎవ్వరైనా తమ ఆస్తులను మెరుగు పరచుకొని, విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రైతులకు అటువంటి స్వేచ్చలేదు. తమ ఇష్టప్రకారం భూమిని ఉపయోగించుకోలేరు. అమ్ముకోలేరు. కొనుక్కోలేరు. అనేక ఆంక్షలు. వ్యవసాయం కాకుండా మరో వ్యాసంగం ఆ భూమిలో చేపట్టరాదు. అమ్మినా మరో రైతుకే అమ్మాలి. అసలు వ్యవసాయం సంక్షోభంలో ఉంటె రైతులు భూములు కొనగలరా? నేడు కోర్ట్‌లలో ఉన్న కేసులలో 70 శాతంకు పైగా వ్యవసాయ భూములకు సంబందించిన వివాదాలే కావడం గమనార్హం.

రైతుల అస్తి హక్కులకు గౌరవం లేదు. తమ ఉత్పత్తులను తమకు అనుకూలమైన చోట, తమకు గిట్టుబాటు అయిన ధరకు అమ్ముకొనే సౌలభ్యం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం అంటూ ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్‌ నియంత్రణ చట్టం, నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించడం కోసం ఆంటూ తీసుకువచ్చిన నిత్యావసర వస్తువుల చట్టం రైతుల అణచివేతకు కారణం అవుతున్నాయి. వారినీ తమ ఉత్పత్తులను స్వేచ్చగా అమ్ముకోనీయకుండా బందీలుగా మారుస్తున్నాయి.

ఉత్పాదికతను పెంచడంలో, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడంలో అత్యాధునిక సాంకేతికత కీలక పాత్ర వహిస్తుంది. నేడు అన్ని రంగాలలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ రైతులు మాత్రం దూరంగా ఉంటున్నారు. జీఎం పంటలవలన ప్రపంచంలో ఇప్పటికే 12 పంటలలో వ్యవసాయ రంగంలో రైతులకు అధిక ఆదాయం, అధికోత్పత్తి సాధిస్తూ ఉండగా, మన కైతులను మాత్రం ఆంక్షలతో దూరంగా ఎందుకు ఉంచుతున్నారు? ఎవ్వరి ప్రయోజనాలకోసం?

అందుకనే శరద్‌జోషి వంటి రైతునేతల ఆలోచనలకు అనువుగా ప్రస్తుత ఎన్నికల సమయంలో 'రైతులప్రణాళిక అంటూ కొన్ని నిర్ధిష్టమైన ప్రతిపాదనలు దేశ ప్రజల ముందు ఉంచారు. రాజకీయ పార్టీల పరిశీలనకు ఉంచారు. రైతుల నుండి ఇష్టారాజ్యంగా ప్రభుత్వం భూసేకరణ చేసే ప్రక్రియకు స్వస్తి వలకాలి. కేవలం విస్తృతమైన “ప్రజాప్రయోజనం* కోనం పరిమితంగా మాత్రమే భూసేకరణ జరపాలి. ప్రైవేట్‌ కంపెనీలకు ప్రభుత్వం భూసేకరణ జరిపి ఇవ్వడం నేరంగా పరిగణించాలి.

భూసేకరణ చట్టాలకు స్వస్తి పలకాలి. భూమి ఉపయోగం, అద్దెకు ఇవ్వడం, అమ్మడంలపై గల ఆంక్షలను తొలగించాలి. కాంట్రాక్టు ఫార్మింగ్‌ పేరుతో కార్పొరేట్‌ శక్తులు ఈ రంగంలోకి రాకుండా చూడాలి. వ్యవసాయ వాణిజ్యంలో రైతులకు స్వేచ్చ కల్సించడం కోసం వ్యవసాయ మార్కెట్‌ నియంత్రణ చట్టం, నిత్యావసర వస్తువుల చట్టంలను రద్దు చేయాలి. అన్ని వ్యవసాయ ఉత్పత్తులలో ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ కు అవకాశం కల్పించి, వ్యవసాయ వాణిజ్యంలో, అసమంజస ఆంక్షలను తొలగించాలి. నీరు, ఇతర సహజవనరులలో ఆస్తి హక్కు కల్పించాలి.

పర్యావరణ పరిరక్షణ చట్టం, బయో సేప్టీ నియంత్రణలను కుదించి రైతులకు సమాచారం, సాంకేతికత, వ్యూహాలను అందుబాటులోకి తీసుకు రావాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో విస్త్రృతంగా వ్యవసాయ పరిశోధనలకు ఆస్మారం కల్పించాలి. రైతులకు సమాచారంతో సాధికారికత కల్పించే విస్తరణ కార్యక్రమాలను పునరుద్దరించాలి. రైతులకు తమ వ్యవసాయం గురించి తామే నిర్ణయాలు తీసుకోగల అవకాశం కల్పించాలి.

మెరుగైన గ్రామీణ మౌలిక సదుపాయాలతో స్థానిక ఉపాధి, ఆర్ధిక అవకాశాలు కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. వికేంద్రీకృత నిల్వ సదుపాయాలు, ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు కావించాలి. గిరిజనులు, ఇతర సాంప్రదాయ అటవీ సమూహాలకు భూమి, సహజవనరులపై గల హక్కులను గుర్తించాలి. గ్రామస్థాయిలో, స్థానిక సమూహాలు భూమి స్థాయి, ఉప యోగం, సొంతదారులు, తమదే అని వాదిస్తున్నవారి వివరాలను పౌరసమాజంలో పారదర్శకంగా నమోదు చేయడాన్ని ప్రోత్సహించాలి. రాష్ట్రస్థాయిలో భూమి రికార్డులకు ఇది భూమికగా ఉండాలి.

భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌ను రద్దు చేసి రైతుల ప్రాధమిక హక్కులకు రక్షణ కల్పించాలి. న్యాయపర సమీక్షకు అవకాశం ఇవ్వాలి. చట్టాలు, నియంత్రణల నుండి రైతులకు విముక్తి కలిగించి, నిజమైన స్వాతంత్య్రం కల్పించాలి. 50 ఏళ్ళల్లో దేశాన్ని ఆహార కొరత నుండి ఆహార ధాన్యాలలో మిగులుస్తాయికి తీసుకు వచ్చిన రైతులు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నారు. రైతులను పేదరికంలోకి నెట్టివేస్తున్న అనేక చట్టాలు, నియంత్రణల నుండి వారికి విముక్తి కల్పించి వారికి సహజన్యాయం అందించడం జాతీయ 'ప్రాధాన్యతలలో కీలక అంశంగా ఉండాలి.

ప్రభుత్వం అధికారాల పట్ల సంయమనంతో వ్యవహరించి, కీలక అంశాలైన శాంతిభద్రతలు, న్యాయం అందించడంకు పరిమితం అయ్యే ప్రయత్నం చేసినప్పుడే ప్రజల స్వాతంత్యంలకు హామీ ఇవ్వగలరు. భూమి, సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో దశాబ్దాలుగా ప్రభుత్వం ప్రజల నుండి సేకరించిన ఆస్తులను తిరిగి వారికే ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఇటువంటి ఆస్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా ప్రభుత్వాలు ప్రజల ఆస్తి హక్కులను, స్వాతంత్య్రంలను హరించి అన్యాయం చేయడానికే దారి తీస్తున్నది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

43