పుట:Ammanudi-May-2019.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పిట్టచూపు

చలసాని నరేంద్ర__98495 69050

రైతులు ఈ దేశ పౌరులు కారా?


1991 తరవాత సైద్ధాంతిక నిబద్దతతో సంబంధం లేకుండా కేవలం దివాలాస్థితిలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుండి బైట పడటానికి ఆర్థిక సంస్మరణలను ప్రవేశ పెట్టవలసి వచ్చింది. అప్పటి నుండి దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు, నేతలు మారుతున్నా విధానాలలో మాత్రం పెద్దగా తేడా ఉండటం లేదు. 'బరి తెగించి 'న రీతిలో ప్రభుత్వం కీలక రంగాల నుండి వైదొలిగి, ఫైవేట్‌ రంగానికి, దేశీయ -విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నాయి. చివరకు రక్షణ, రిటైల్‌ మీడియా రంగాలలో కూడా విదేశీ పెట్టుబడులకు బార్లా తలుపులు తెరుస్తున్నారు.

అయితే మనదేశంలో అతి పెద్ద ప్రైవేట్‌ రంగమైనా వ్యవసాయంను మాత్రం ప్రభ్తుత్వ కబంధ హస్తాల నుండి విముక్తి కావించడం లేదు.

దేశంలో ఇప్పటికి సగంకు పైగా ప్రజల జీవనాధారం వ్యవసాయరంగం. 1950లో తిండి గింజలను సహితం దిగుమతి చేసుకోవలసిన దుస్థితిలో మన రైతులు ఈదేశ గౌరవాన్ని అభిమానాన్ని కాపాడారు. ఎంతో కష్ట పడి దేశాన్ని ఈ రంగంలో స్వయంసమృద్ది కావించడమే కాకుండా, నేడు ప్రపంచంలో ఆతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తుల దేశాలలో ఒకటిగా భారత దేశాన్ని మార్చారు.

అటువంటి రైతులకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఏమి చేస్తున్నాయి ? వారిని బిచ్చగాళ్ల వలే చూస్తూ తీవ్రమైన అవమానాలకు గురి చేస్తున్నాయి. వ్యవసాయ రుణాలను రద్దు చేస్తున్నామని అంటూ అసమర్ధంగా పనిచేస్తున్న బ్యాంకుల మొండి బకాయిలను జమ చేసుకొనే సౌలభ్యం కల్పిస్తున్నారు. కానీ ఒక్క రైతును కూడా బుణం అవసరం లేకుండా చేయగలుగుతున్నారా? ఉచిత నగదు ఇస్తామంటారు. వడ్డీ లేని రుణాలు అంటారు. ఉచిత ఖీమా అంటారు. కానీ తాను ఎంతో కష్టపడి పండించుకున్న పంటలను తన ఇష్ట ప్రకారం అమ్ముకొనే స్వేచ్చ రైతులకు ఇస్తున్నారా? కనీసం తన ఇష్ట ప్రకారం పంటలు పండించుకునే సౌలభ్యం కలిగిస్తున్నారా?

అందుకనే నేడు వ్యవసాయం చేస్తున్న యువకుడిని వివాహం చేసుకోవడానికి ఏ యువతీ కూడా ఆసక్తి చూపడం లేదు. మరో లాభదాయకమైన ప్రవృత్తి లభిస్తే వ్యవసాయం వదలడానికి దేశంలో సగం మందికైనా రైతులు సిద్దంగా ఉన్నారు. వ్యవసాయాన్ని ఏ విధంగా లాభదాయకంగా చేయాలో ఎవ్వరు ఆలోచించడం లేదు. ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు దాదాపు శూన్యం. పైగా, అత్యంత నిరంకుశమైన భూసేకరణ చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం వంటివి రైతుల పాలిట యమశాపంగా మారుతున్నాయి.

1950 నుండి దేశ జనాభా నాలుగు రెట్లు పెరిగితే, వ్యవసాయ ఉత్పత్తులు ఆరు రెట్లు పెరిగాయి. 15 ఏళ్లుగా ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశంగా భారత్‌ ఉంది. గతేడాది 36 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసాం. అయినా దేశంలో ఆకలి తప్పడం లేదు. ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని భారీ ఆహార ధాన్యాల నిల్వలు భారత ప్రభుత్వం వద్ద ఉంటున్నా 15 శాతం ప్రజలకు పౌష్టికాహారం లభించడం లేదు. ఆరేళ్ళ లోపు బాలల్లో 40 శాతం మందిలో పౌష్టికాహార లోపం కనిపిస్తున్నది.

ప్రతిసంవత్సరం వంట నూనెల దిగుమతికి రూ 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కేవలం మన రైతుల ఉత్పాదికతను పెంచ గలిగితే ఈ మొత్తం మన రైతులకే ఇవ్వవచ్చు గదా. 2030 నాటికి భారత్‌ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా చేస్తామని బీజేవీ చెబుతున్నది. వ్యవసాయంలో వృద్ధి రేట్‌ కనిపించ కుండా జరిగే అభివృద్ధితో ఎవ్వరికీ ప్రయోజనం? ఇప్పటికి ప్రతిరోజు 40 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రధాన మంత్రి ఈ విషయమై ఏ నాడైనా ఎందుకు జరుగుతుందో సమాలోచన చేశారా? కనీసం రాహుల్‌గాంధీ మౌలిక సమస్యల గురించి చర్చించారా ?

42

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019