చేతులు కలుపుతారు. సమర్ధించుకుంటారు. శక్తి ప్రారంభించిన తొలి నాళ్లలో, గిరిజనులు ఒక సారాకొట్టు మూయించారు. రైతుకూలి సంఘాలు ్రశంసించాయి. మరుసటి సంవత్సరం, ఆ సారాకొట్టు తెరిస్తే గిరిజనులు ఆ కొట్టు మూయించారు. ఈసారి సంఘాలు ఆ కొట్టును సమర్ధిస్తూ గిరిజనులలో తాగుడు అరికట్టడం, బయటి వాళ్ళు పెట్టే సారాకొట్టు ద్వారానే సాధ్యం అంటూ కరపత్రం వేసి సమర్ధిం చుకున్నారు...తాగుడు అదుపు చేస్తాం, మాకో అవకాశం ఇవ్వండి అంటూ గిరిజన విద్యార్దులు, దళ నాయకుడిని బతిమాలినా వాళ్ళు అంగీకరించలేదు. పనులలోకి రాకుండా వెలివేస్తాం అంటూ బెదిరిం చారు. అప్పట్లో ప్రముఖంగా వచ్చిన ఈ వార్తలు చూసి, నేడు రచయిత గిరినసంక్షేమశాఖలో అధికారి శ్రీ చినవీరభద్రుడు నన్ను చూడడానికి వచ్చారు. ఆయన తత్వశాస్త్రం చదువుతున్నారని తెలిసి నావ్యాసం “వార్తయందు జగము...” ఇచ్చాను. వారి నాన్నగారు శరభవరం కరణం గారు చెప్పిన వివరాల నమూనాలో, కలెక్టరు కార్యాలయంలో తారీకులు దస్తావేజులు వెతికి (భూములు కోల్పోతున్న గిరిజనులు అనే పుస్తకం వేసాం. పాడేరులో ప్రాజెక్ట్ అధికారి కొన్న 'తెలుగు గిరిజనగీతాలు' సొమ్ము ఆయనే పంపించారు. ఈ మధ్యనే గిరిజన సంస్కృతి ప్రధానోపాధ్యాయుల కరదీపిక ఆయన సమన్వయం లోనే వచ్చింది.
11. 1976లో తూర్పుగోదావరిలో గిరిజన ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన రచయిత 'నెలనెలా వెన్నెల సి. వి.కృష్ణారావుగారు, మారేడు మిల్లిలో కొండమామిడివెట్ల నరికివేతకు తన మెడను అడ్డంపెట్టిన చిన్నం శాంతయ్యను తన కవితలలో ప్రస్తావించారు. ఆ శాంతయ్య గారి దగ్గరే, పరిశోధనకు కావలసిన సమాచారం సేకరించాను. ఆ మామిడి చెట్లను నరికే ప్లయ్ వుడ్ ఫాక్టరీని మనోహర్, మోహనరెడ్డిల ద్వారా ప్రజాహిత వ్యాజ్యం వేయించి మూయించటం మాతాలి విజయం. తరువాత గనులు మూయించాము. రైతుకూలి సంఘాల ఒప్పందపు కూలి బదులు ఐ.టి.డి.ఏ. చేత కనీస వేతనాలు ఇప్పిం చాము.
12. మళ్ళీ వరంగల్ గిరిజన ప్రాంతానికొస్తే, అక్కడ కమలా పురం రేయన్ ఫాక్టరీ ఉంది. ఆదిలాబాబాద్ గిరిజన ప్రాంతంలో దేవాపూర్ సిమెంట్ ఫాక్టరీ ఖనిజాలు తవ్వుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు 23 గ్రామాలు గిరిజన ప్రాంతం నుండి తొలగించటమే కాదు, 1/70 రెగ్యులేషన్ వర్తించదని స్టే తెచ్చుకోడం 1987లోనే వరంగల్ జిల్లాలో మొదలైంది ఇక్కదే. కన్నబిరాన్ తన ఆత్మకధ 24 గంటలలో ప్రస్తావించిన న్యాయవాది ప్రతాపరెడ్డి ఇలా 32 (గ్రామాలకు స్టేలు వరసగా తెస్తుంటే, 1992లొ నిలువరించటంతో మా పశ్చిమ గోదావరి కార్యక్రమం ప్రారంభమైంది. 'చాలా కాలంగా ఆదివాసులలో పునాది ఉన్న ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా 1/70 పోరాటాన్ని ఆ స్థాయిలో ఎందుకు చేపట్టలేక పోయింది అనేది (ప్రశ్న...1/70 పోరాటం ఆదివాసీలే చేపట్టిన ఉద్యమాల్లో ముందుకొచ్చినంత బలం గా ఏ కమ్యూనిస్ట్ గిరిజన ఉద్యమంలోనూ రాలేదు'(చూపు జనవరి 1999) అని గమనించిన బాలగోపాల్స్ జనార్దనరావుతో కలిసి ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఉద్యమిస్తున్న అశ్వారావు దమ్మపేట మండలాలలో పర్యటించి “వార్తలో రాసారు. కానీ స్వయంగా ఆ ఉద్యమంలో పాల్గొనలేకపోయారు.
13. బాలగోపాల్ పేర్మొన్నట్లు నల్లమల నుండి చెంచులను తరలించాలని చూస్తున్న తరుణంలో, ప్రకాశం జిల్లాలో వారిని వోటర్లుగా నమోదు చేయించటంతో వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావటం మొదలైంది. లోపలి అడవిలో ఉన్న అప్పాపూర్ పంచాయతి అయింది. చేపలు పట్టుకునే హక్కు చెంచులు సాధించు కున్నారు. అన్నిటికి మించి చెంచులు సేకరించిన సంప్రదాయ సాహిత్యం వెలుగు చూడటంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పటిదాకా విదేశీయులు హైమెందోర్స్, మైకేల్ యార్క్ కృషి మాత్రమే ఆధారమైతే,ఇప్పుడు గోండుల సంప్రదాయ సాహిత్యాన్ని ఆదిలాబాద్ ఆకాశవాణి ద్వారా సుమనస్పతి రికార్డ్ చేస్తున్నారు.
14. అయితే ఎవరి పని వాళ్ళది అన్నట్లు పక్కపేజి పట్టించు కోని ధోరణి పెరుగుతోంది. జయధీర్ తిరుమలరావు సంపాదకత్వం లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జానవద విజ్ఞానంపై స్నాతకోత్తర విద్యార్థులకు వ్యాసావళి తయారు చేసి ప్రచురించింది. వాటిలో జానవద సాహిత్యం మీద రాసిన వ్యాసాలతో పాటు, “గిరిజనుల కళలు సాహిత్యం” వ్యాసం కూడా ఉంది. గిరిజన రచయిత మల్లిపురం జగదీశ్ శిలకోలికథల సంకలనానికి ముందుమాట రాసి, అతని వ్యాసాన్ని 'బఐహుళలో చేర్చిన సంపాదకులు, తన వ్యాసాల పక్మనే ఉన్న “గిరిజనుల కళలు, సాహిత్యం” వ్యాసం జగదీశ్ దృష్టికి, పాఠకుల దృష్టికి తేలేక పోయారు.
15. 1960లో తయారైన మాండలికవృత్తి పదకోశాలకు ముందుమాట రాస్తూ ఆ విజ్ఞానాన్ని మానవ శాస్త్రవేత్తలు ఉపయోగిం చుకోవాలి, విశ్లేషించాలి అని భద్రిరాజు కృష్ణ మూర్తి ఉద్బోధించారు. అయన హైదరబాదు విశ్వవిద్యాలయం కులపతిగా ఆ ప్రయత్నం చేస్తే బాగుండేది. 1995లో తెలుగు భాషాభిమానులు, తెలుగు (గ్రంథాలు పునర్ముద్రించాలని పిలుపునిచ్చారు. కానీ మాండలిక పద కోశాల ప్రచురణ త్వరగా పూర్తిేచేయమని కోరలేదు. ఇవేళ పాత పంటలు, రుచులు గూర్చి ప్రచారం చేస్తున్నవారు, జానపదుల వార సత్వాన్ని చాటే వ్యవసాయ వృత్తి పదకోశాలను తెలుగు సామెతల సంకలనాలను గుర్తుచేయటం లేదు. ఇటీవల వస్తున్న చట్టాలు సంప్ర దాయాన్ని గుర్తిస్తున్నాయి. అడవిలో గిరిజన ఆవాసాలకు సంప్రదాయ సరిహద్దు పటాలు తయారు చేస్తున్నట్లే , సముద్రంలో మత్స్య కారుల స్థల నామాలను ఉపగ్రహ చిత్రాలతో అనుసంధానం చేసే ప్రయత్నం మొదలైంది. అందుకు మత్స్య పరిశ్రమ మాండలిక వదకోశం ఉపయోగ వదుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణంలో పెను మార్పులను వ్యవసాయ పదకోశం ఆధారంగా అధ్యయనం చేయాలి. జ్ఞానాన్ని ప్రజలలోకి తీసుకు పోవాలంటే ఈ పలుకు బడులే దిక్కు
16. ఇలా సాహిత్యగాళ్ళు, సంఘాలు, మేధావులు, ఆచార్యులు శీతకన్ను వేసినా, సంప్రదాయ జునపద గిరిజన సాహిత్యం తన ఉనికిని చాటుకుంటుంది. సాధికారిత ఏటికి ఎదురీది ఊపిరి పీల్చు కొంటుంది. ఒక వక్క చట్టాలు తాము పోరాడితేనే వచ్చినాయి అని చెప్పుకుంటూ, అవి అమలు కావట్లేదని విమర్శించే ధోరణి పెరిగింది.
(తరువాయి భాగం 45 వ పుటలో) | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఆ మే 2019 |