పుట:Ammanudi-May-2019.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6. జీవితం దశ దిశలను వెతుక్కుంటూ ఆందోళనతో రగిలి పోయే ఈ తరుణంలో, 1976 లో గిరిజనగీతాల సేకరణ, పరిశోధన కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాను. ఇక్కడ అన్నిరకాల రాజకీయ / వామపక్షాలకు విద్యార్ధి సంఘాలుండేవి. వారిమధ్య ఘర్షణలతో ప్రాంగణం మొత్తం ఉద్రిక్తంగా ఉందేది.

జానపద సాహిత్యం అధ్యయనానికి తెలుగు శాఖ కేంద్రం. జానపద కళాకారులు చుక్క సత్తెయ్య, చిందు ఎల్లమ్మలకు సభాగౌరవం తేవటానికి నటరాజ రామకృష్ణ రామరాజు, నాగభూషణ శర్మలు కృషి చేస్తుండేవారు. పరిశోధన విషయాన్నిబట్టి నా దృష్టి సాంఘిక శాస్త్రాలు, ముఖ్యంగా మానవ శాస్త్రం వైపు మళ్ళింది.” [1010109 ౧౮౧౧) 15 26౧ 10 గా౪ అన్న మార్చ్‌ సూక్తికి తగ్గట్లు, మానవశాస్త్రం సర్వశాస్త్రాల సమాహారం. తెగలకు సంబంధించిన భాష, సాహిత్యం, కర్మకాండ, పర్యావరణం, సంజ్ఞానం, భౌతిక ప్రాక్ళారిత్రక విశేషాలను ఎందటో శాస్త్రజ్ఞులు తరతరాలుగా అధ్యయనం చేసి, వాటిలో క్రమాన్ని స్పష్టపరచారు. సంస్కృతి గతిశీలం అని నిరూపించారు. సంస్కృతి అంటే నమ్మకాల దొంతర, పురాగాధలు అంటే పుక్కిటి వురాణాలు అని నిరసించే హేతువాద, “శాస్త్రీయ” వ్యాఖ్యానాలను పటాపంచలు చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మానవశాస్త్రం లేక పోవడంవల్ల, ఏదో వాళ్ళు చెప్పిన ఒరవడిలో కాకుంద్యా, స్వేచ్చగా చదువుకోడానికి, ఆలోచించుకోటానికి, తోచిన సమాచారం సేకరించు కోటానికి అవకాశం కలిగింది. భారతీయుల తాత్విక చింతన విశ్లేషణ విధానాన్ని మానవశాస్త్ర విచారధారతో సమన్వయిస్తూ నేను సేకరిం చిన సమాచారం వ్యాఖ్యానించిన తీరు, తెలుగుశాఖ పత్రిక “వివేచన పంచకన్యల వృత్తాంతాన్ని 'దేశకాలాలు- వివాహ పద్ధతులు", 'వార్త యందు జగము వర్దిలు చున్నది” (1982) అనే శీర్షికలతో ప్రచురిం చింది. మూల్యాంకనం చేసిన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మానవ శాస్త్రవేత్త మునిరత్సంరెడ్డి గారిప్రశంస, కొత్త పరిచయాలను సమ కూర్చింది.

7. ఇదే సమయంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలం గాణ సాయుధ పోరాటం, నక్సలైట్‌ ఉద్యమాల మీద వచ్చిన సాహిత్యం మీద మార్చిస్ట్‌ దృక్పధంతో పరిశోధనలు జరుగుతుండేవి. ఉద్యమ కళాకారులు గద్దర్‌ వగైరాలు ఎదగసాగారు. అయితే కధలు, ఉద్యమ సాహిత్యం ఒక మాధ్యమం మాత్రమే నని 'నూరేల్లకు పైగా తెలుగు కథ వస్తు నిర్దేశంగా పయనించింది...గత ముప్పైవండ్లుగా తెలుగు ప్రజాసంన్కృతిలో [ప్రాణం పోసుకున్న పాటకు జన్మనిచ్చింది ఉద్యమం...కథయే పరమార్థంగా, వాహికగా కాకుండా లక్ష్యంగా, సాహిత్య ప్రక్రియగా కాకుండా, ఉద్యమంగా ప్రచారం చేసి , ఆ ప్రచారం ఒక సత్యంగా నమ్మే ప్రమాద సూచిక దగ్గరికి ప్రచారకులు చేరిపోయారు అంటూ వామపక్ష సాహిత్యగాళ్ళను హెచ్చరించవలసి వచ్చింది...(భూమితో మాట్లాడు” వరవరరావు 2005లొ తెలంగాణా విమోచనోద్యమం తెలుగునవల1983).

8. అదే సమయంలో గిరిజన ప్రాంతాలలో సమస్యలమీద అధ్యయనాలు జనార్దనరావు అద్వర్యంలో జరుగుతుండేవి. 1/70 రెగ్యులేషన్‌ నుండి చిన్న రైతులను మినహాయిస్తూ నాటి ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయటం, అంతకు ముందే కోర్టు ద్వారా జిల్లాలో కొన్ని గ్రామాలు గిరిజన ప్రాంతంనుండి తీసివేయించటం ఆయన పేర్కొన్నారు. కొందరు అధికారుల సలహా మేరకు కావచ్చు, ఆ జి.వా.ను ఖమ్మం జిల్లాలో ఒక గిరిజనసంథం పిటిషనర్‌ గా పౌరహక్కుల ఉద్యమ నాయకుడు కన్నబిరాన్‌ కొట్టేయించారు. చిన్న రైతులను ఆదుకునేందుకు వామపక్షాలు ఉద్యమించి బలం పెంచుకో సాగాయి. శ్రీకాకుళం ఉద్యమాన్ని అణచి వేసినట్టే, ఇక్కడకూడ పౌరహక్కుల ఉద్య మాన్ని అణచి వేతకు ప్రభుత్వం దమనకాండకు పూనుకొంది. ఈ హింస, నక్సలైట్ల ప్రతిహింస మీద జోరుగా చర్చలు జరుగుతుండేవి. “కూలి సరిగ్గా ఇవ్వని భూస్వాములను కూలి అడగటానికి, భూములు పంచని పాలకులను భూములు అడగటానికి, అడవులను ఆక్రమించు కున్న ప్రభుత్వానికి అవి గిరిజనుల అడవులు అని చెప్పటానికి...జనం ఐక్యమై ఆందోళన చేస్తే దానిని తీవ్రవాదం అనడానికి వీల్లేదు'అని పౌరహక్కుల నాయకుడు రామనాధం గారికి జోహార్లర్చించిన బాల గోపాల్‌

9. "పేదలకు పంచడానికి భూములెక్కడున్నాయి అని కమ్యూ నిస్టులు సహితం అనుకుంటున్నదశలో తన స్వంతజిల్లా అయిన చిత్తూరులో పేదలకు పంచని, పంచినా అన్యాక్రాంతమైన... భూముల్ని ఒక్కటొక్కటిగా బయటకు తీసి భూసంస్కరణల కార్యాచరణోద్యమం పేరిట దళిత సంఘాలను ఇతర ఉద్యమకారులను కలుపుకుని కలక్టర్ల వెంట పడ్డాడు నరేంద్రనాద్‌ అంటూ ఆయన గాంధేయ దృక్పధాన్ని 'ప్రశంసిస్తాడు. (హక్కుల ఉద్యమం - తాత్విక దృక్సధం 2010).

10. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకాలో ఈ ఉద్య మానికి 'సలహా' ద్వారా పునాది వేసిన వారు గీతారామస్వామి, సిరిల్‌ రెడ్డి మనోహర్‌, శైలజ, సి.వి.మోహానరెడ్డి వగైరాలు-జాతీయ గ్రామీ ణాఖివృద్ధి సంస్థ పరిశోధన పేరిట, భూమి రికార్డులు సేకరించు కోటానికి, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ఆచార్యుడు షినరసింహారెడ్డిగారి నుండి ఉత్తరం పెట్టించి, జిల్లాలలో రికార్డులు సంపాదిస్తూ, ఈ కార్యక్రమాన్నివారు కొంతకాలం నడిపించారు. అయితే విశ్వవిద్యాలయాలలో ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాలు, జనార్దనరావ్‌ వంటి ఆచార్యులు ఈ విధానంలో గిరిజన భూముల మీద పరిశోధనలు చేయటానికి పూనుకోలేదు.కానీ 'సలహాతో పని చేసిన దళిత మేధావి బొజ్జాతారకం ఆ విద్య యొక్క అవసరం గుర్తించారు. “సర్వే నెంబర్లు, సరిహద్భు రాళ్ళూ అన్నీ కరణానికే తెలుస్తాయి...భూమికి సంబంధించిన విషయాలన్నీ అతని మాట మీదనే ఆధారపడి ఉంటాయి. మూడో ఎద్దుగా మనిషి మారాలంటే ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. ఒకటి భూమి సమస్య, రెండు చదువు.భూమి ఇస్తే చదువు తనే చదువుకుంటాదు...భూమి, చదువు ఎంత అవసరమో తెలుసుకున్న ఆసాములు పాలేరు జీతగాల్లకు ఆ రెండు లేకుండా చేసారు. (నేల నాగలి మూడు ఎద్దులు 2008) తరువాత నవల పంచతంత్రంలో(2012) కూడా అయన ఇదే చెప్పారు. 1964లో వచ్చి, ఒరవడిగా మారిన కారా 'యజ్ఞం కథకు రావలసిన మలుపు, ఇప్పటికి వచ్చింది.

11.మైదాన ప్రాంతాలలోకన్నా గిరిజన ప్రాంతాలలో రైతు కూలి సంఘాలకు పట్టు ఎక్కువ. అధికారంలోకి వచ్చే బలంలేదు గాని తమ ప్రయోజనాలు కాపాడుకోడంలోవారు వివిధ వర్గాలతో తెలుగుజాతి పత్రిక అమ్మనుడి 6 మ్రే209 |