పుట:Ammanudi-May-2019.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చాలామంది దృష్టిలో అదొక తప్పు ఉద్యమం. తెలుగువాళ్లు చేయకూడని ఉద్యమం. దక్షిణ భారతమంతా పరచుకొని ఉన్న తెలుగువాళ్లకు ఒక మూలనున్న కొంత ప్రాంతమే మాతృభూమి ఎట్లా అవుతుంది? అప్పటి ఆంధ్రోద్యమాన్ని రాయలసీమ వాళ్లు, ముఖ్యంగా బళ్ళార్విప్రాంత తెలుగువాళ్లు వ్యతిరేకించినారు. ఆంధ్రనాయకుల చెవులకు ఇవి ఎక్కలేదు. ఉద్యమం చేసినారు. ఒక అమాయకపు మహనీయుడు పొట్టి శ్రీరాములుగారు చెన్నపట్నం కోసం నిరాహారదీక్ష చేసి చనిపోయినారు. ఆంధ్రరాష్ట్రం వచ్చేసింది. ఏ ఆంధ్ర వచ్చింది? వివాదాలున్నాయి అన్న సాకుతో బళ్ళారి, చెన్నపట్నం, హోసూరు తావులు లేని ఆంధ్ర వచ్చింది. ఆంధ్ర కాంగ్రెస్‌ వరిధిలో ఉండిన ఆలూరు, ఆదోని, రాయదుర్గం తాలూకాలు మాత్రమే ఆంధ్రకు చేరినాయి. తెలుగువాళ్లే అధిక సంఖ్యాకులుగా ఉన్న బళ్ళారి, సిరుగువ్చ, హొసపేట తాలూకాలు. మైసూరు రాష్ట్రంలోకి చేరి పోయినాయి.

సు : బళ్ళారి ఏ రాష్ట్ర పరిధిలో ఉండాలనే దాని మీద ఎన్నికలు కూడా జరిగినాయంట కదా?

జో : జరిగినాయి. ఎన్నికల్లో ఆంధ్ర తరపున పోటీ చేసింది ఒక కమ్మకులం ఆయన. కర్నాటక తరవున పోటీ చేసింది రెడ్డి కులం ఆయన. ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో దీనిని కమ్మా రెడ్డి తగవుగా చెప్పుకొంటారు. అది నిజం కాదు. హాలరివి సీతారామరెడ్డి నీలం సంజీవరెడ్డి కన్నా పలుకుబడిగల నాయకుడు. బళ్ళారి ఆంధ్రలో చేరితే సీతారామరెడ్డి పెద్ద నాయకుడు అవుతాడని సంజీవరెడ్డికి జంకు. అందుకే లోపాయికారిగా ఎన్నికల్లో కర్నాటక వాదనకి మద్దతు ఇచ్భాడని అంటారు. బళ్ళారి కావాలా కోలారు కావాలా అని నెహ్రూ అడిగితే సంజీవరెడ్డి కోలారును అడిగినాడు. మృత్యుంజయశాస్రి బళ్ళారిని అడిగినాడు. ఎన్నికలకు ముందు జరిగింది ఇది. తరిమెల నాగిరెడ్డి మదరాసు శాసనసభలో కోలారుతోపాటు బెంగుళూరు కూడా ఆంధ్రలో కలవాలని గొంతెత్తినాడు. బ్రిటిష్‌ ఇండియాలో కాకుండా మైసూరురాజ్య వరిధిలో ఉండేది కోలారు. మైసూరు రాజుకు కోలారును ఆంధ్రకు ఇవ్వడం ఇష్టం లేదు. కోలారులోని కాంగ్రెస్‌ నాయకుడు కేశంపల్లి చెంగలరాయరెడ్డిని దువ్వినాడు. మైసూరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. దాంతో చెంగలరాయరెడ్డి రంగంలోకి దిగి కోలారు మైసూరు రాష్ట్రంలోనే ఉండాలని వట్టుబట్టి సాధించుకొన్నారు. ఆ రాష్ట్రానికి మొట్టవెొుదటి ముఖ్యమంత్రి అయినాడు. కర్టుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్లు, తెలుగువాళ్లు ఎక్కువగా ఉండిన, బళ్ళారి, సిరుగు్ప, వొసపేట తాలూకాలలో కన్నడ అభ్యర్థికి కొన్ని వందల ఓట్లు మాత్రం ఆధిక్యత వచ్చింది. ముస్లింలు కూడా తెలుగువాళ్లే ఉండిన బళ్ళారిలో తెలుగు అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడానికి కారణాలు ఉన్నాయి. పల్లెల్లోని చదువురాని బడుగు తెలుగువారంతా, మా రెడ్డిగారు చెప్పినమాట వినాల కదా అనుకొని, వీరశైవులు చెప్పిన ప్రకారం ఓట్లు వేసినారు. బళ్ళారి నగరంలోని ఒడ్జెర ఐస్తిలోని ఓట్లు గల్లంతయినాయి. ఒడ్జెరలంతా. తెలుగువాళ్లే. ఆ బ్యాలెట్‌ పేపర్లు కొంతకాలం తరువాత చెత్తకుప్పలో బయటవడినాయి అని చూనినవారు చెవ్చుకౌంటారు. ఇన్ని ఎత్తుగడలూ ఇంత అరాచకమూ చేసినా ఆ అరాచకానికి కొందరు తెలుగునాయకులు సహకరించినా, కన్నడిగులకు వచ్చిన ఆధిక్యత మూడు నాలుగు వందల ఓట్లు అంతే.

సు : మీ తండ్రిగారైన గుత్తి నారాయణరెడ్డిగారు కూడా, అప్పుడు ఉద్యమాలలో పాల్గొన్నారట కదా, ఆ వివరాలను చెప్పండి.

జో : మా నాయన పుట్టి పెరిగింది జోళదరాశిలోనే. ఆయనకు తెలుగంటే వల్లమాలిన అభిమానం. అట్లని ఆయన కన్నడం ద్వేషికాడు. ఆయనకు నాటకాలంటే కూదా ప్రీతి ఎక్కువ. మావూరు నాటకరంగానికి పేరు పొందినది కదా. కన్నడ నాటకరంగ ప్రముఖులలో ఒకరైన దొడ్డనగౌడది మా వూరే. వాళ్లు కన్నడం మాట్లాడే మోటాటి రెడ్డు. మేము తెలుగు మాట్లాదే మోటాటి రెడ్లము. వాళ్లు మా నాయనను ఒకసారి అవమానించినారు. వాళ్ల జట్టుకు దూరంగా పెట్టినారు. కన్నడ రెడ్ల దగ్గర నుంచి ఇటువంటి ఒకటి రెండు అవమానాలను ఎదుర్కొన్న మా నాయనకు తెలుగుమీద మరింత అభిమానం పెరిగింది. అదే సమయంలో ఆంధ్రోద్యమం సాగుతూ ఉంది. ఆంధ్రనాయకులు ఎవరైనా బళ్ళారివైవుకు వస్తే చాలు, కన్నడిగులు పెద్ద ఎత్తున వాళ్లను అడ్డగించి గోల చేస్తుండేవారు. మా నాయన జోళదరాశిలోనూ చుట్టువక్కల గ్రామాలలోనూ ఆంధ్రోద్యమాన్ని చాటుతుందేవారు. ఒకసారి సంజీవరెడ్డిగారు రైలులో బళ్ళారికి వస్తున్నారన్న విషయం బళ్ళారివాళ్లకు తెలినింది. కన్నదడిగులంతా రైలు నిలయానికి వెళ్లి పెద్ద ఎత్తున సంజీవరెడ్డికి నిరసన తెలియచేయాలనుకౌన్నారు. ఈ సంగతి, పొలంల