పుట:Ammanudi-May-2019.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెడ్డితనం గుర్తున్నట్లు తెలుగుతనం ఎందుకు గుర్తులేదు” అని అదుగుతుంటాను నేను. బదులు మాట్లాడరు.

సు: బసవేశ్వరుని కాలం నాటికే వీరశైవులకు కన్నడ వీరాఖిమానం ఉందేదంటారా?

జో : ఆయన మహనీయుడు. సమాజంలోని అసమానతలను కూలదోయాలని బతుకంతా పాటుపడినవాడు. వీరశైవులకు ఈ కన్నడ వీరాఖిమానం తరువాతి కాలంలో ఎప్పుడో మొదలయి ఉండాలి. అసలు బసవేశ్వరుని పెద్దలు ఆంధ్ర ప్రాంతంలోని కమ్మనాటి నుండి వలస వచ్చిన వారుగా చెప్తారు. బసవేశ్వరుని బోధలను తలకెత్తుకొని ఆయన అనుయాయులు నాలుగు మూలలూ తిరిగినారు. ఇప్పటి తమిళనాడులోని (ఒక్కహోసూరు ప్రాంతం తప్ప) వీరశైవులు అందరూ తెలుగువారే. మహారాష్ట్రలో కూడా తెలుగు వీరశైవులు ఉన్నారు. బసవని కాలంలో అంటే 12వ శతాబ్దంలోనే వీర శైవాన్ని ప్రచారం చేసింది తెలుగువారే అనడానికి ఈ ఆనవాళ్లు చాలు అనుకొంటాను. అట్లాంటప్పుడు ఇప్పటి ఉత్తర కర్నాటకలో తెలుగు వీర శైవులు లేకుండడం ఏమిటి? బసవేశ్వరుడు తన వచనాలను కన్నడంలో నుడివినారు. దాంతో అది వీరశైవులకు మత భాష అయింది. తరువాతి కాలంలో కర్నాటకలోని వీర శైవులకు కన్నడమే ఇంటి నుడిగా మారి ఉంటుంది. వీరశైవులు తమ మత వీరత్వాన్ని ఇతర భాషల మీద చూపడం అనేది బసవని తరువాత కొన్ని వందల ఏండ్లకు మొదలయి ఉండవచ్చు.

సు: మనం బళ్ళారి చరిత్ర దగ్గరకు వద్దామండి. విజయనగర సామ్రాజ్య వతనం, వీరశైవుల వలసల తరువాత ఏం జరిగింది ?

జో: తరువాత హండే వంశపు బోయ (వాల్మీకి) నాయకుల పాలన కిందకు వచ్చింది బళ్ళారి (ప్రాంతం. ఇప్పటి కర్నాటక ప్రాంతాన్ని ఏలిన బోయ నాయకులు అందరూ తెలుగువాళ్లే. కానీ ఒక్క సురపురం వాళ్లు తప్ప మిగిలిన వాళ్లంతా కన్నడిగులుగానే నడుచుకొన్నారు. వీరి కాలంలో వీరశైవులూ మాధ్యులూ వ్యాపార ఉద్యోగ రంగాలలో కుదురుకొంటూ వచ్చినారు. ఆ తరువాత బళ్ళారి నిజాం పాలన క్రిందకు పోయి, వారి నుంచి దత్త మండలం పేరిట ఆంగ్లేయుల చేతికి వచ్చింది. తెల్లవారి పాలనలో కూడా కన్నడిగులైన వీరశైవులూ మాధ్వులూ ఉద్యోగ వ్యాపారాల్లో బలపడినారు. కరణీకం మొత్తం కన్నడిగుల పరమైంది. దాంతో వాళ్లు ఏది రాస్తే అదే నమోదు అయింది. తెలుగు పల్లెల పేర్లన్నీ కన్నడంలోనికి మారినాయి. పెంచలపాడు హంచన హాళు అయింది, జొన్నలరాశి జోళదరాశి అయింది. ఇట్లా ఎన్నో తెలుగు పేర్లు కన్నడ పేర్లుగానే రికార్డులకు ఎక్కినాయి. 19వ శతాబ్దపు చివర అంటే 1870 లేదా 80వ దశకంలో బళ్ళారి జిల్లాలో 27 తాలూకాలు ఉండేవి. రాయలసీమలో అప్పుడు కడప, బళ్ళారి రెండే జిల్లాలు. 1900 ప్రాంతంలో జిల్లాలను పునర్విభజించినారు ఆంగ్లేయులు. అప్పుడు తూర్పు తాలూకాలన్నీ అనంతపురం జిల్లాగా మారి, బళ్ళారి 17 తాలూకాలతో మిగిలింది. 1980ల నాటికి 12 తాలూకాలూ, స్వతంత్రం వచ్చేటప్పటికి 9 తాలూకాల బళ్ళారి జిల్లా నిలిచింది. తూరువు వైపునున్న వూర్తి తెలుగుతో నిండిన తాలూశాల్ని అన్నిటినీ బళ్ళారి చేజార్చుకొనింది. మిగిలిన 9 తాలూకాలలో ఆదోని, ఆలూరు, రాయదుర్గంలలో 80 శాతం తెలుగువారుంటే, బళ్లారి, సిరుగుప్ప, హొసపేట తాలూకాలలో 60శాతం ఉండేవారు. మిగిలిన కూడ్లిగి, కొట్టూరు, హరపన హళ్ళి తాలూకాలలో కన్నడిగులు ఎక్కువ. బళ్ళారి నుంచి తూర్పు తాలూకాలు విడిపోవదం తెలుగుకు పెద్ద దెబ్బ, మరో పెద్ద దెబ్బ టేకూరు సుబ్రహ్మణ్యం వలన తగిలింది. ఈయన తెలుగు స్మార్త బ్రాహ్మణుడు. బాగా చదువుకొన్నవాడు. నెహ్రూకు దగ్గరి స్నేహితుడు. ఆ రోజుల్లో రాజకీయంగా బలమైన నాయకుడు. 1930ల నాటికి ఈయనను ఎదిరిస్తూ వోలరివి సీతారామరెడ్డివంటి నాయకులు ఎదిగినారు. వాళ్లంతా కన్నడిగులైన వీరశైవరెడ్లు. సీతారామరెడ్డి కూడా. వీర శ్రైవరెద్దే. నిజానికి ఆయన పాకనాటి రెడ్డి. అంటే ఏ కాలంలోనో నెల్లూరు ప్రాంతం నుంచి వలస వచ్చిన రెడ్డు. వీళ్ల తాకిడిని ఎదురుకోవడం కోసం సుబ్రహ్మణ్యంగారు కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడి ఒప్పించి, బళ్ళారి కాంగ్రెస్‌ను విభజింపజేసినారు. ఆలూరు, ఆదోని, రాయదుర్గం తాలూకాలను మాత్రం ఆంధ్ర కాంగ్రెస్‌ పరిధిలో ఉంచి, మిగిలిన ఆరు తాలూకాలనూ కర్మాటక కాంగ్రెస్‌ పరిధి కిందకు చేర్చేసినారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న బళ్ళారి, సిరుగువ్పు హొనపేట తాలూకాలు కూడా కర్నాటక కాంగ్రెస్‌ పరిధిలోకి వెళ్లిపోయినాయి. తెలుగువాళ్లు ఎవరూ ఇది అన్యాయమని గొంతులు ఎత్తలేదు. అందుకు కూడా కారణముంది. అవ్వడు బళ్ళారి ప్రాంతంలోని తెలుగువారికి చదువు తక్కువ. తెలుగు బ్రాహ్మణులు తప్ప మిగిలినవారు చదువుకు దూరం. కన్నడం వాళ్లలో అట్ల కాదు, మాధ్వ బ్రావ్మణులూ వీరశైవ రెడ్డ్లూ కూడా చదువుకొన్నవారే. పైగా వారంతా హండేరాజుల కాలంనుండీ కరణాలుగా మంత్రులుగా ఉంటూ రాజకీయాలను బాగా ఎరిగినవారు.

సు : కరణీకాలు కూడా కన్నడిగులు చేతుల్లో ఉండినాయి అంటే, పరిపాలనా భాషగా కూడా కన్నడం చోటు దక్కించుకొన్నట్లే కదా!

జో : అవును. విజయనగర పతనం తరువాత, వీరశైవుల ప్రావుతో బళ్ళారిలో కన్నదానికి పాలనాభాష, మతభాష హోదా దక్కింది. కన్నడ భాషాఖిమానము వీరశైవుల నరనరాల్లోనూ నిండి ఉంటుంది. మా చిన్నప్పుడు మా పల్లెలో తెలుగువాళ్లమంతా కూడా భజనపాటలను కన్నడంలోనే పాదేవాళ్లం. బళ్ళారి ప్రాంతంలో కన్నదం పల్లెపల్లెకూ దూరింది. అయినా తెలుగు (ప్రాభవం తగ్గలేదు. బళ్ళారి పల్లెలలో కూడా సర్మారు బడులు మొదలయినాక, ఈ (ప్రాంతంలో నూటికి తొంబై తెలుగుబడులూ పది కన్నడం బడులూ ఉందేవి. అంటే తెలుగువాళ్ల సంఖ్య అంత పెద్దది.

సు : మళ్లా చరిత్రలోకి వెళదామా ?

జో : మొదటి రెండు దెబ్బలకు మించిన మరొక దెబ్బ బళ్ళారికి తగిలింది. అదే ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం. నా దృష్టిలో, నాలాంటి

పరభాషా ద్వేషం, పరభాషా దాస్యం - రెండూ తప్పులే