పనిచేసుకొంటూ ఉండిన మా నాయనకు తెలిసింది. పనిని అక్కడనే వదిలేసి పై గుడ్డను భుజం మీద వేసుకొని ఒక్క పరుగున బళ్ళారి రైలు నిలయానికి చేరుకొన్నాడు. ఆ స్టేషను మాస్టరు ఒక ముస్లిం. తెలుగు అభిమాని మాత్రమే కాదు, మా నాయనకు మిత్రుడు కూడా. ఆయన మా నాయనను చూసి 'రెడ్డీ ఎందుకొచ్చినావయ్యా, వాళ్లది పెద్ద గుంపు, నువ్వు ఒక్కడివి, వాళ్ళతో గొడవపడి ఏమి చేయగలవు, తిరిగిపో' అన్నాడు. మా నాయన ఒప్పుకోలేదు. ఆంధ్రనాయకులకు జై కొట్టి తీరుతాను అని పట్టు పట్టినాడు. ఆ స్టేషనుమాస్టరు తెలివిగా, సంజీవరెడ్డి ఎక్కిన పెట్టి చివరలో ఉందని కన్నడంవాళ్లకు చెప్పి, వాళ్లను చివరకు పోయేటట్లు చేసినాడు. నిజానికి సంజీవరెడ్డి ఎక్కున్న 'పెట్టి ముందువైపు ఉంటుంది. రైలు రావడం, ముందున్న మా నాయన సంజీవరెడ్డిని కలిసి, పెద్ద గొంతుతో తెలుగులో జై కొట్టడం, కన్నడిగులు కలమేలుకొనే సరికే బండి కదిలి పోవడం జరిగిపోయింది. బతికినంత కాలమూ తెలుగును కలవరించి ఆ తెలుగు ప్రేమను నాకు అందించి పోయినాడు మా నాయన.
సు : ములకా గోవిందరెడ్డిగారు కూడా బళ్ళారి ఆంధ్రలో కలవాలని పోరాడినారంట కదా?
జో : గోవిందరెడ్డిగారిది బళ్ళారి కాదు. చిత్రదుర్గం జిల్లా వారిది. వెలనాటి రెడ్ల శాఖకు చెందినవారు. తెలుగు అభిమాని. చిత్రదుర్గం జిల్లా కూడా కోలారు లాగా మైసూరు రాజ్యంలో భాగంగా ఉండేది. గోవిందరెడ్డిగారు మొదట చిత్రదుర్గం జిల్లాను ఆంధ్రలో కలపాలని ఉద్యమించినారు. అయితే మైనూరు రాజ్యంలో ఉండిపోయి, కన్నడాన్నే చదువుకొంటూ ఉండి పోవడం వలన, స్థానిక తెలుగువారి నుండి ఆయనకు మద్దతు కరువయింది. స్థానికంగా ఆ జిల్లాలో రైతులు మూడువంతుల మంది తెలుగువాళ్లే. కమ్మరెడ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం చిత్రదుర్గం జిల్లా. అంటే కమ్మవాళ్లు అక్కడ రెడ్ది అనే పట్టం పెట్టుకొంటారు. వాళ్లను కమ్మరెడ్లు అంటారు, మిగిలిన మోటాటి, వెలనాటి, పాకనాటి, కొణిదె రెడ్లను కాపురెడ్లు అంటారు. ఈ రైతులంతా పట్టనట్లు ఉండిపోయినారు. బళ్ళారి గురించో కోలారు గురించో అవ్చుడప్పుడూ అన్నా గొంతులను ఎత్తే ఆంధ్రనాయకులకు చిత్రదుర్గం ఊసే పట్టలేదు. దాంతో గోవిందరెడ్డిగారు తమ ఉద్యమాన్ని బళ్ళారికి మార్చినారు. వట్టి భాష ఆధారంగా పోరాడితే లాభం లేదని, “మైసూరు రాజ్యం తీవ్ర కరువు ప్రాంతం, అభివృద్ధి తక్కువ, ఆంధ్రలో చేరితే బళ్ళారి వాళ్లం విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో ముందడుగులు వేస్తాం” అని ప్రచారం చేసేవాడు. ఆయనదీ వివలయత్నమే అయింది. ఇటువంటివారు ఎందరో ఉన్నారు. ఆంధ్రోద్యమ చరిత్ర పుటలలో వీళ్ల త్యాగానికి రవంత కూడా చోటు దక్కలేదు. గోవిందరెడ్డిగారు పదేళ్ల క్రితం వరకూ బ్రతికే ఉండినారు. అప్పుడే మీవంటివారు ఎవరైనా ఆయనను కదిలించి ఉండే అవ్చటి ఉద్యమ వివరాలను మరిన్ని చెప్పుండేవారేమో! గోవిందరెడ్డిగారి మనుమరాలు సంధ్యారెడ్డి, ఇప్పుదు కన్నడంలో పేరు గడించిన రచయిత్రి. గోవిందరెడ్డిగారి మాట నిజమయింది. కర్నాటకలో చేరిన బళ్ళారి ఎంతో వెనకబడింది. ఇక్కడ కన్నడం వాళ్లే ఎదగలేదు, పైగా తెలివి తేటలతో నెట్టుకొస్తున్న తెలుగువారిపైన జులుం. “మేము పైకి రావడం లేదు, మీరెట్లా వస్తారు" అంటూ వివక్ష చూపించడం. ఎవడో ఒక దొంగ అన్నాడంట “దేశానికి స్వతంత్రం వచ్చింది. నా దేశంలో నేను దొంగిలించుకొంటే అడగడానికి నువ్వెవడివోయ్” అని. అట్ల కన్నడరాజ్యం అయిపోయిన బళ్ళారిలో తెలుగుగొంతులు మూగపోయినాయి.
సు: అవునండీ, తెలంగాణాంధ్రలకు బయటి తెలుగువారిని పట్టించుకోకపోవడం దారుణమే.
జో: అప్పుదే కాదు. ఇప్పటికీ అంతే. రాజకీయనాయకులను పక్కన పెడదాం. మేధావులూ మీడియావాళ్లు కూడా అంతే. తెలుగు, తెలుగుదనం, తెలుగువాళ్లు అంటే తెలంగాణా ఆంధ్ర అనే రెండు రాష్ట్రాలే. ఇటీవల కోలాచలం శ్రీనివాస్ అనే వకీలు ఒకరు బళ్ళారి విషయాన్నంతా సేకరించి 89 పుటల పుస్తకంగా వేసినారు. విపరీతమైన తెలుగు అభిమానం ఆయనకు. ఇంతకీ ఈయన ఎవరో కాదు. కోలాచలం వెంకటరామన్నగారి మునిమనుమడు. వెంకటరామన్న పేరు ఇప్పుడు దాదాపు ఎవరికీ తెలియక పోవచ్చు. 19వ శతాబ్దపు చివర లండన్ మహానగరంలో హ్యూమ్ అధ్యక్షతన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను స్థాపించినప్పుడు, తెలుగు ప్రాంతాన్ని ప్రతినిధిస్తూ ఇద్దరు లండన్‌కు పోయినారు. ఒకరు గుత్తి కేశవ పిళ్ళె, ఇంకొకరు కోలాచలం వెంకట్రామన్న ఇద్దరూ రాయలసీమ వాసులే. ఇద్దరూ అప్పటి బళ్ళారి జిల్లా వారే. కోలాచలం వారిది బళ్ళారి జిల్లాలోని పందిపాడు అనే ఊరు. అదే సంస్కృతంలో కోలాచలం అయింది. తరువాత దానిని హందిఃహోళుగా మార్చినారు. మొన్నటివరకూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా ఉండేవారు చూడండి, లక్ష్మీనారాయణ దత్తుగారు, ఆయనది కూడా పందిపాడే. మేము ఈడిగవాళ్లము, తెలుగువాళ్లము అని వారే చాలా సభలలో చెప్పుకొన్నారు ఆయన. అట్లాంటివారిని కూడా తెలుగువాళ్లగా గుర్తించలేదు తెలుగు మేధావులు.
సు : బళ్ళారి కర్నాటకలో చేరడం వలన తెలుగుజాతి కోల్పోయింది ఏమిటి?
జో : రెండు వైపులా పెద్ద నష్టం జరిగింది. మా వైపు అంటే బళ్ళారిలో ఒకప్పుడు వందల తెలుగుబడులు ఉండేవి. ఇప్పుడు పదికిమించి లేవు. తెలుగుసభలు నడుపుకోవాలన్నా, తెలుగులో ఉపన్యసించాలన్నాా తెలుగు బోర్డులు బేనర్లు పెట్టుకోవాలన్నా తెలుగువాళ్లు భయంతో పంచెలు తడువుకౌనే పరిస్థితి. అందరూ అనుకొనేది ఏమిటంటే కన్నడిగులూ మరాఠీలూ కౌట్టుకొంటారు, కానీ కన్నడ - తెలుగు ప్రజలు సఖ్యంగా ఉంటారు అని. మాది దొర - తొత్తు సంబంధం. ఊరకుండక ఊరేగుతామా! బళ్ళారి కర్శాటకకు పోవడం వలన, అటువైపు అంటే రాయలసీమకు తీరని అన్యాయం జరిగింది. వాళ్లకు బతుకే పోయింది. రాయలసీమకు తల బళ్ళారి అయితే ; అనంతపురం, కడప, కర్నూలులు మొండెం. తలలేని మొండెం అయింది రాయలసీమ. బళ్ళారి రాయలసీమలో భాగంగా ఉండి ఉంటే, రాయలనీమలో - ముఖ్యంగా అనంతపురంలో కరువు ఇంతగా విలయతాండవం చేసి ఉండేది కాదు. తుంగభద్ర జలాలు పారి ఆరుతడి పంటలన్నా పండి ఉండేవి. బళ్ళారి పోవడంతో రాయలసీమకు ఒక సాంన్కృతిక రాజధాని
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019
25