మాటామంతీ
జోళదరాశి (గుత్తి) చంద్రశేఖరరెడ్డి గారితో ....
- అడపాల సుబ్బారెడ్డి 93468 14601
సుబ్బారెడ్డి : మీ వుట్టుక్క చిన్నతనం, చదువు, కుటుంబం ఈ వివరాలను చెప్పండి.
జోళద : ఇప్పటి కర్షాటక, ఒకప్పటి మదరాసు మాగాణంలోని బళ్ళారి జిల్లాలో ఉండే జోళదరాశి అనే పల్లెటూరు మాది. నా పుట్టుక, చిన్నతనం అంతా ఆ ఊరిలోనే. అమ్మపేరు పార్వతమ్మ. నాయనపేరు గుత్తి నారాయణరెడ్డి. నా నాలుగవ ఏటనే మా అమ్మ చనిపోయింది. మా నాయనకు రెండవ ఇల్లాలిగా వచ్చిన లక్ష్మమ్మ నన్ను కన్నతల్లికంటే ఎక్కువగా సాకింది. జోళదరాశి, చాగనారు, బళ్ళారిలలో నా చదువు పి.యు.సి. వరకూ సాగింది. వై చదువులకోసం మాత్రమే బళ్ళారిని దాటినాను నేను.
సు : తెలుగువారికి నిజమైన ఎల్లలు ఏమిటి?
జో : ఒక్క తెలుగువారికే కాదు, నాగరిక సమాజంగా ఎదిగిన ఏ భాష వారికైనా వారి నిజమైన ఎల్లలను వెతుక్కోవడం సమస్యే కానీ మనదేశంలో తెలుగువారిది ప్రత్యేకమైన సమస్య. ఈ సమస్యను సృష్టించుకొనింది తెలుగువాళ్లమే. భాషపేరుతో మాకు ఈ ఎల్లలు కావాలి అని మొదలు పెట్టింది మనమే కదా, మొదలు పెట్టడమే కాదు పోరాటాలు చేసినాము, బలిదానాలు చేసినాము. చివరకు సగంమంది తెలుగువాళ్లు మాత్రమే ఉంటున్న ప్రాంతాన్ని తెలుగు రాష్ట్రం చేనుకొన్నాం. నిజానికి వింధ్య వర్వతాలకు దిగువ కన్యాకుమారి వరకూ తెలుగువాళ్లు లేని ప్రాంతం ఎక్కడుంది?
ను : ఇవ్పటి కర్నాటకలో ఎంతమంది తెలుగువాళ్లు ఉండవచ్చు?
జో : ఈ శాతాలూ లెక్కలూ నేను సరిగ్గా చెప్పలేను. ఇప్పటి కర్నాటకలో ప్రతి ముగ్గురిలోనూ ఒకడు తెలుగువాడే అని ఒక అంచనా. ఇది నిజమేనా దీనికి ఆధారాలేమిటి అంటే నేను చెప్పలేను. అయితే ఇక్కడ తెలుగుదనం ఎంతుంది అని చూస్తే, చాలా
మేరలకు ఆవల, అంటే తెలుగు రాష్ట్రాలుగా ఇప్పుడు మనం చెప్పుకొనే తెలంగాణాంధ్రలకు బయట సగంమంది తెలుగువారున్నారు, వారిని గురించి పట్టించుకొన్నవారే లేరు, అని స వెం.రమేళ్ అంటుంటారు. ఆ మాటలు నన్ను వెంటాడుతూనే ఉండేవి. రమేశ్‌తో కలిసి అటువంటి బయటి తెలుగుతావులలో కొన్నింటిలో తిరిగినాను. కొందరు బయటి తెలుగువారితో మాట్లాడినాను. వాళ్లతో మాట్లాడుతుంటే ఆవేశంతో మన పిడికిళ్లు బిగుసుకొంటాయి. ఆవేదనతో గుండెలు బరువెక్కుతాయి. అటువంటి మాటామంతులను కొన్నిటిని అమ్మనుడి చదువరులతో పంచుకొన్నాను. ఇది కూడా అట్లాంటిదే మరొకటి. జోళదరాళి (గుత్తి) చంద్రశేఖరరెడ్డిగారితో మాటామంతి ఇది. వీరిని రెండు సందర్భాలలో కదిలించినప్పుడు, వెలికి వచ్చిన మాటలు ఇవి. ఒకసారి రచయిత్రి సింధుమాధురిగారు; మరొకసారి స.వెం. రమేశ్, కొండా లక్ష్మీ కాంతరెడ్డిగార్లు కూడా నాతోపాటు ఈ మాటల్ని పంచుకొన్నారు. - అడపాల సుబ్బారెడ్డి
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అచ్చకన్నడ ప్రాంతాలుగా కన్నడిగులు పిలుచుకొనే మైసూరు, మండ్య ప్రాంతాలలోనే తెలుగు జానపదాలు కోకొల్లలు. తెలుగు చలనచిత్ర ప్రదర్శన జరగని పట్టణాలూ నగరాలూ పదిశాతం కూడా ఉండవు. కోలారు నుంచి బీదరు వరకూ ఉన్న నరిహద్భు జిల్లాలయితే తెలుగువాళ్లతో నిండిపోయి ఉంటాయి.
సు : ఇప్పటి కర్నాటకలో ఉంటున్న తెలుగువాళ్లకు తెలుగుపైన అభిమానం ఉందంటారా?
జో : అభిమానం ఉందనే నా అభిప్రాయం. ఎవరికైనా అమ్మమీద అమ్మభాషమీద అమ్మ నేలమీద అభిమానం లేకుండా ఎందుకుంటుంది? వీధుల్లోకి వచ్చి జేజేజే అని తెలుగులో అరవకపోవచ్చు. మనసు అట్టడుగు పొరల్లో ఆ అభిమానం గూడు కట్టుకొనే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆమధ్య అంటే కొన్ని నెలల క్రిందట బెంగుళూరులో ఒక తెలుగు కార్యక్రమం జరిగింది. నేను పోతన భాగవతాన్ని కన్నడం చేసిన సందర్భమది. చాగంటి కోటేశ్వరరావుగారు వచ్చి భాగవత ప్రవచనం చేసినారు. మూడు నాలుగు వేలమంది ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటారు. అందులో యువతీయువకులు కూదా చాలామంది ఉన్నారు. తెలుగులో భాగవత ప్రవచనాన్ని వింటున్న వారందరి మొకాలు వెలిగిపోతున్నాయి. ఒక్క మాటను కూడా వదిలిపెట్టకుండా జుర్రుకొని వింటున్నారు. చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం. నేను ఒకరిద్దరు కుగ్రవాళ్లని “ఏమిటి మీరు చాలా ఆనందంగా ఉన్నట్లున్నారే” అని పలుకరించినాను. 'తెలుగు మాటలు వినడం ఆనందం కాదా” అని బదులిచ్చినారు వాళ్లు. ఇదంతా అభిమానం కాదంటారా!
సు : బెంగుళూరు నగరం సరే. ఇతర ప్రాంతాలలో కూడా తెలుగుపట్ల ఇంతే స్పందన ఉందా? ముఖ్యంగా బళ్ళారిలో?
జో : అభిమానం ఉంది కానీ, స్పందన లేదు. ముఖ్యంగా