Jump to content

పుట:Ammanudi-May-2019.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిలక జుట్టులు కత్తిరించుకుని క్రాపులు జేసుకున్నప్పుడు ముసలివాళ్ళు బాధతో కన్నీళ్లు పెట్టుకోసాగారు. పాత పద్దతిలో రాగం తీయకుండా వచనం లాగా పాఠాలు చదివే విద్యార్థులను జూసి పాతకాలం వాళ్ళు “వీళ్ళ చదువూ, చట్టు బండలూ!” అని విసుక్కో సాగారు. నోటి లెక్కలకు బదులు నోటు పుస్తకాలనంతా లెక్కలతో నింపేసి విల్లల్ని చూసినప్పుడు “అమ్మ విద్యకు సాటి వస్తుందా?” అని నిట్టూర్చ సాగారు. యింగ్లీషు కలెక్టర్లూ దేశీయ తాసిల్లార్హూ గ్రామీణ కరణాలూ, వూరి మునసబులూ దర్చారు చేయసాగారు. చాక్కాలూ, గడియారాలూ, అగ్గిపెట్టెలూ, రైల్లూ, పొంటెన్‌ పేనాలూ, దిక్సూచులూ, బేటరీ లైట్లూ, తుపాకులూ, కల్లూ సారా అంగళ్లూ-మొదలైన ఆధునిక సాధనాలు వచ్చినప్పుడంతా, గోపల్లెజనాలు ప్రపంచంలోకి వుపద్రవాలు ముంచు కొస్తున్నాయనీ, కలియుగం అంతమైపోతోందనీ వాపో సాగారు.

మొదటి ప్రపంచయుద్ధంకాలంలో తెల్లవాళ్ళు గ్రామీణుల్ని సైన్యంలోకి చేర్చుకుని, వాళ్లను యుద్ధంలో మొదటి వరసలో నిల్బోబెట్టి తాము వెనకుండి మోసం చేస్తున్నారని గ్రామీణులు బయపడసాగారు. చాపకింద నీళ్లలా యీ లోగా స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమై పోయింది. గాంధీ బొమ్మను వచ్చ పొడిపించుకునే వాళ్ళూ, జాతీయ పతాకాన్ని వూరేగించేవాళ్ళూ పుట్టుకొచ్చేశారు. రూపాయనోట్లను చూసి వాళ్ళు నోళ్లు తెరిచేశారు. క్రమంగా మానవుల్లోని నైతిక విలువలు గూడా మారిపోసాగాయి.

గోపల్లెలో వోనాటి వుదయాన రావి చెట్టుకు మూడు రంగుల జెండా కట్టబడి వుండడం చూసిన మునసబు తన వుద్యోగం పోతుందన్న భయంతో గొల్లుమంటాడు. ప్రభుత్వానికి భయపడే వాళ్ళు “వందేమాతరం” అనే నినాదానికే భయపడి పో సాగారు. తపాలాఫీసు రావడమొక గొప్ప విప్లవం. దిన పత్రిక అన్నది గొప్ప సంరంభం. పాత బడుల స్థానంలోకి బోర్డు బడులు వచ్చేశాయి. బడుల్లో అన్ని కులాల వాళ్ళూ పక్క పక్కనే కూచోడం చాలా మందికి గిట్టలేదు.

యీ విషయాలనంతా వీరా తనదైన విశిష్టమైన మౌఖిక ధోరణిలో పాత్రల మూలంగా కథలాగే చెవ్పుకుంటూ పోతారు. 1911 వ సంవత్సరం జూన్‌ 17వ తేదీ శనివారం నాడు కొడైకెనాల్‌ కెళ్ళే రైలెక్కిన జిల్లా కలెక్టరు ఆష్‌ దొరను మణియాచ్చి జంక్షనులో 'సెంగోట్టె రఘుపతి అయ్యర్‌ కొడుకు వాంచినాదన్‌ అయ్యర్‌ కాల్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు " అని 30వ అధ్యాయంలో తొలిసారిగా ఖచ్చితమైన తారీఖున్తూ, వాస్తవమైన వార్తనూ పేర్కొంటాడు రచయిత. తరువాత స్వాతంత్రోద్యమంలో జరిగిన అనేక చర్యలకూ, పాల్గొన్న అనేక మంది నాయకుల విధానాలకూ గోపల్లెలోని జనాలంతా యెలా స్పందించారో చెబుతూ పోతాడు. కొన్ని అధ్యాయాలు ఆనాటి స్వాతంత్య్రోద్యమ చరిత్రగా మాత్రమే తయారయ్యాయి. తెల్లవాళ్లు దేశాన్ని వదలిపెట్టి వెళ్ళడానికి సిద్ధమవడంతో, దేశానికి స్వాతంత్య్రం రావడంతో నవల ముగుస్తుంది. స్వాతంత్రోదయవేళ దేశమంతా సంబరాలు చేసుకుంటున్న సమయంలో గాంధీ మౌనంగా రాట్నం వడుక్కుంటూ, తనను చూడవచ్చిన పత్రికా విలేఖరులతో “యేమీలేదు” అని మాత్రమే అంటాడు.

“అన్ని నవలలూ ముగింపులో బలహీనమైపోతాయి”. అంటాడు ప్రఖ్యాత ఆంగ్ల రచయితా, విమర్శకుడూ, యి.యం.ఫాస్టర్‌. “ప్లాట్‌” కూ పాత్రలకూ మధ్య జరిగే సంఘర్షణే యిందుకు కారణం.అయితే స్వాతంత్రోద్యమకాలం వచ్చే సరికి కీ రా గోపల్లె గ్రామ జీవన చిత్రణ కంటే యెక్కువగా ఆనాటి అహింసా పోరాటాన్నే ముఖ్యంగా భావించడంతో నవల చివర్లో కథగా కంటే చరిత్రగానే రూపొందింది. స్వాతంత్రోద్యమంలో స్వయంగా పాల్గొన్నవాడు గావడంతో కీ రా నవలకు కావలసిన తాటస్ట్రతను పొందలేక పోయివుండవచ్చు.

తమిళంలో రాసిన తెలుగువాళ్ళ నవలలు యీ రెండూ. గోపల్లె గ్రామ వాసులందరూ “పెరుమాళ్ళ” భక్తులు. తిరుపతి యేడు కొండల వాడు వాళ్ళ దైవం. యింట్లోంచీ బయటకెళ్ళబోతున్న శ్రీదేవితో తాను వచ్చే వరకూ అక్కడె కూర్చుని వుండమని చెప్పి, బయటకెళ్ళి బావిలోకి దూకేసే యింటి యజమాని వుదంతం తెలుగు వాళ్ళకు బాగా పరిచయమైన “ఉండమ్మా ! బొట్టు పెడతా!” కథను గుర్తు చేస్తుంది.

ఏ ఒళము పైకెక్కి చనిపోవడానికి సిద్ధంగా వుండే నేరస్థుడు తనను చూడవచ్చిన పిల్లలతో పాట పాడమంటాడు. అప్పుడు వాళ్ళు పెద్ద “గొబ్బియాలో” అంటూ తెలుగు పాట పాడతారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో గూడా గోపల్లె గ్రామస్థుల పాటలు తెలుగులోనే వుంటాయి.

స్వాతంత్య్రానికి ముందుకాలంలో తమిళులతో కలిసి జీవిస్తూనే తమ తల్లిభాషను అంటి పెట్టుకోడానికి ప్రయత్నించిన తెలుగువాళ్ళు, స్వాతంత్రం వచ్చాక, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాక క్రమంగా తమిళంలోకి మారిపోయారు. యీ మార్చుకంతా నిలువెత్తు నిదర్శనంగా యీ రెండు నవలలూ నిలబడతాయి. వొక కన్నడ మహా సభల సమయంలో ప్రసిద్ధ కన్నడ నవలా రచయిత వొకరు “యీ సభలకంటే దోసెలే నాకు ముఖ్యం” అన్నాదు. బతకడానికి తిండే ప్రధానం. ఆ తరువాతే భాషయినా, సంస్కృతి అయినా! కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూనే వుంటాయి. కానీ మనుషులు జననినీ, జన్మభూమినీ, మాతృభాషనూ వదులుకోడానికి సిద్ధంగా వుండరు. పరిస్థితులూ, ప్రభుత్వాలూ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతూనే వుంటాయి. అటువంటి సమయాల్లో మానవజాతి నిజంగా నాగరికంగా యెదుగుతోందా - అన్న ప్రశ్న యదురౌతుంది.

తమిళంలో లబ్ధప్రతిష్టుడై, అనేక గొప్ప పురస్కారాలు పొందిన కీరా రైల్లో వొక తెలుగువాళ్ళ స్టేషనుకు వచ్చినప్పుడు తెలుగు మాటలు చెవినబడగానే యేదో దేవలోకానికి వచ్చానని మురిసి పోయాడు. “మనమంతా తెలుగుతల్లి బిడ్డలం. ఏదో కాలవశాన ఎప్పుడో మేము ఈ పక్కలో వుండి పోతిమి. మీరు ఆ పక్కలో వుండి పోతిరి. మనం ఉండేది యెక్కదైనా మనం మాట్లాడే తెలుగుభాషనువీడ కూడదు” అంటాడు నిష్కర్షగా.

“గోపల్లె “గోపల్లె జనాలు” నవలలు చదివాక, కీరా గారి ఘోష విన్నాక. మనమంతా వోరకమైన నిర్వేదంలో మునిగిపోతాం. అనేక ప్రశ్నలు మనముందు సవాళ్ళుగా నిలబడతాయి. వాటికేమని సమాధానాలు చెప్పాలో మనకు తోచదు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

19