మెకాలే విద్యా విధానమంటే తమలాగే ఆలోచించి, ప్రవర్తించే, బ్రిటీష్ రాణి ప్రయోజనాలను కాపాడే సంకల్పం గల కులీన వలస ప్రజలను (విభజించి పాలించే క్రమంలో అగ్రవర్జాలు, వృత్తేతర బడుగు, బలహీన, అస్పృశ్య సమూహాల నుంచి) సృష్టించి, బ్రిటీష్ సామాజ్యాన్ని సుస్థిర పరచుకోవడమే. ఈ క్రమంలో కేవలం 5శతాబ్దంలో (ఇప్పటికీ 1400 ఏళ్ల క్రితం) పశ్చిమ జర్మనీకి చెందిన (ఆ దేశ ఉత్తర సముద్ర తీరంలో నివసించే 'ఇంగేవోన్స్' అనే తెగ (ప్రజలు) ఆంగ్లో శాక్సన్ వలస జనం మాట్లాడే ఆంగ్ల భాషను వలస ప్రాంతాల్లో పాలన భాషగా వినియోగించారు. అందుకోసం క్రీస్తుపూర్వం నాటి నుంచి కొనసాగుతున్న స్థానిక భాషాజాతీయుల సంస్కృతి, నుడి- నానుడి, సంప్రదాయాలను కాలరాచేందుకు విఫల ప్రయత్నం చేశారన్నది చరిత్ర. స్థానిక మత విశ్వాసాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలతో ఇబ్బందిపడుతున్న అణచివేతకు గురయిన బడుగు బలహీన ప్రజలను మత, భాష, వ్యవహార శైలితో ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ చర్య వెనుక కుట్ర కోణం ఏమైనప్పటికీ, తమకు లాభం జరిగింది / జరుగుతోందన్న ఒకే ఒక కారణంగా స్టానిక బహుజనులు ఆంగీకరణను, మతాంతీకరణను అంది పుచ్చుకోవడాన్ని అర్ధం చేసుకోగలం. స్థానికభాషలు, మూలవాసుల భాషలు, పాలకుల భాషలుగా పరిగణించేవి సైతం ప్రజలే సృష్టించారన్న సంగతి ఐలయ్యగారు గుర్తించకపోవడం దురదృష్టకరం. పెట్టుబడిదారీ పూర్వ సమాజాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ రాజ్యంలోనైనా పాలకుల భాష ప్రజల భాష వేర్వేరుగా ఉండడం సర్వసాధారణ విషయం. వలసల సంపద సమీకరణ నుంచి ఇంగ్లాండ్‌లో పెట్టుబడిదారీ విధానం ఆవిర్భవించేంత వరకు, అక్కడా రెండు భాషా విధానాలు కొనసాగేవి. 15వ శతాబ్దం దాకా దాదాపు 600 ఏళ్ల పాటు ఇంగ్లాండ్లొ అధికార భాషగా ఫ్రెంచ్ భాష కొనసాగడం విడ్డూరమేమీ కాదు. ఇంగ్లాండ్‌లో పెట్టుబడిదారీ విధానం ఆవిర్భ వించిన అనంతరమే మార్కెట్‌లోను, రాజ్య నిర్వహణలోనూ “ఇంగ్లీష్ (అక్కడి ప్రజల భాష అయిన ఇంగ్లీష్ అధికార భాషగా అవతరిం చింది. ఆ తర్వాత వలస పాలనా క్రమంలో విశ్వభాషగా అవతరించింది. పెట్టుబడిదారీ వర్గం ముడి సరుకులు, చౌక శ్రమ శక్తి, సరుకుల మార్కెట్లో నిర్వహణ అవసరాలు, అంతర్జాతీయ ముక్కోణ వాణిజ్యం, అందుకు ఉపకరించే పాలనా అవసరాల నేపథ్యంలో ఇంగ్లీష్ విశ్వభాషగా అవతరించింది. వలసలు, వలసవాద దేశాల సంపదల సమీకరణతో ప్రపంచ, పెట్టుబడిదారీ విధానం ఆవిర్భవించకుండా ఇంగ్లీష్ భాష విశ్వజనీనతను సాధించడం సాధ్యం కాదన్న విషయాన్ని ఐలయ్యగారు గుర్తించకుండా, “ఆంగ్ల ఆరాధనను” అహేతుకంగా ప్రోత్సహిస్తున్నారు. ముడి సరుకులు, చౌక శ్రమ శక్తి, సరుకుల మార్కెట్లుగా ఉంటూ, పెట్టుబడిదారీ పూర్వ సామాజిక స్వభావాన్ని కోల్పోని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని స్థానిక భాషలు, పెట్టుబడిదారీ విధానంలోకి అభివృద్ధి పాశ్చాత్య దేశాల భాషల వలె పరిపక్వతను, విశ్వజనీనతను సాధించలేక పోయాయి. ఆంగ్లేశాక్సన్ ప్రజలు మాట్లాడే ఆంగ్ల భాష పాలక భాషగా మారి, శతాబ్దాల కాలంనాటి స్థానిక భాషలను విధ్వంసం చేయడానికి కారణం ఆ ప్రజల సామాజిక ఆర్థిక స్వభావంలో ఉందిగానీ, వారి భాషాధిపత్య కాంక్షలో లేదనే విషయాన్ని ఐలయ్యగారు గుర్తించ లేదు. ఇంగ్లీషు (రాజబాటలో ప్రయాణించడం) వల్ల ఆంగ్లేయులు ఎదగలేదు, వారి సామాజిక ఆర్ధిక వికాసం వల్లనే ఇంగ్లీషు భాష విశ్వజనీనత సాధించిందనే సత్యాన్ని అయన గుర్తించలేదు. అలాంటిది బడుగు, బలహీనవర్గ ప్రజానీకం ఇంగ్లీషును అందిపుచ్చుకోవడం వల్లనే అభివృద్ధి చెందుతారు (ఎదుగుతారు) అనే తలకిందులు వాదన ఐలయ్య తీసుకువస్తుండడం వల్ల ఆ ప్రజలకు హాని కలుగుతుంది.
మెకాలే విద్యావిధానం (1885) ఫలితంగా ఇంగ్లీషులో పట్టు సాధించిన మహాత్మా ఫూలే అంబేద్కర్ వంటివారు ఇంగ్లీషు వల్లనే గొప్ప వారయ్యారనే ఐలయ్య సులభ సూత్రీకరణలు ఆ మహాత్ముల జీవితం, కృషి, తాత్వికతను కించ పరున్తున్నాయి. వారు స్థానిక భాషల్లోను, స్థానిక సామాజికాంశాల్లోను పట్టు సాధించడంతొనే, పరభాష అయిన ఇంగ్లీషుతో వారు సమర్థంగా వ్యవహరించ గలిగారన్నది ఒక వాస్తవం. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు భాషను నేర్చుకోవడం వల్ల సామాజికార్థిక వెసలుబాటు ఉన్న ఫూలే, అంబేడ్కర్ వంటి కొద్ది మంది బహుజనులు మాత్రమే ఉన్నత స్థాయికి పోగలిగారు. కానీ మెజారిటీ ప్రజలు ఇంగ్లీషును సవ్యంగా నేర్చుకోలేక రెండింటికీ చెడ్డ రేవడులుగా మారి, ఆత్మ విధ్వంసానికి గురవుతారు. అందువల్ల సరైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, తగిన వసతులు లేని విద్యా సంస్థలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఆత్మహత్యాసద్భశం. పాలకులు చేపడుతున్న ఆంగ్ల విద్యాబోధన విధాన నిర్ణయం అభివృద్ధి కరమైనదిగా కనపడుతుంది గానీ, అందుకు తగిన సామాజిక పరిస్థితులు, విద్యారంగ అవకాశాలు, విధానాలు లేకుండా అలాంటి చర్యలు చేపడితే అరకొరగా ఉన్న విద్యా రంగం కొడిగడుతుంది. మాతృభాషలను ఇంగ్లీషులాగా ఆదానప్రదానాలను చేపడుతూ విశ్వజనీన స్థాయికి వెళితే యావత్తు సాధారణ ప్రజానీకానికి పూర్తిస్థాయిలో ఈ లబ్ది చేకూరుతుంది. ఫూలే, అంబేడ్కర్ వంటి మహనీయులు మాతృభాషలను విశ్వజనీన స్థాయికి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసి ఉండాల్సింది. కార్పొరేట్ ప్రపంచం ఇంగ్లీషు భాష నుడికారం కార్పారేట్ మార్కెటింగ్, ఉత్పత్తి కార్యకలాపాలు, సాఫ్ట్‌వేర్ సాంకేతికతల వినియోగానికి సరిపడే ఆంగ్ల విద్య కారణంగా ధ్వంసమవుతోందని ఆంగ్లభాషా శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో దళిత, బహుజన వర్గాలు ఏ ఆంగ్ల భాషను నేర్చుకోవాలని ఐలయ్య డిమాండ్ చేస్తున్నట్లు!
భాషా నిత్యత్వ నియమం:
ప్రతి భాష ఏకశిలాసదృశం కాదు. ప్రజలు దైనందిన ఉత్పత్తి,సామాజిక కార్యకలాపాల అనుసంధాన క్రమంలో రూపొందే “సహజ” భాష నిర్దిష్ట భౌగోళిక నమాజం-ప్రకృతి సమతుల్యతకు అనుగుణంగా జరిగే ఆత్మిక అభివృద్ధి (వైజ్ఞానిక, సామాజిక శాస్త్రాలు, కళలు సాహిత్యం, తత్వశాస్త్రం, రాజకీయాలు, రాజ్యాంగం తదితర) లో భాగంగా ఆయా రంగాలకు చెందిన కృత్రిమ భాషలు (నిర్దిష్ట సాంకేతిక పరిభాషలు) కలసి ఒక సామాజిక వ్యవస్థలోని భాషగా
ఓట్లు అడిగేది తెలుగులో... పరిపాలించేది ఉత్వర్వులిచ్చేది ఇంగ్లీషులోనా?
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి *మే 2019
12