బోధనా మాధ్యమం
వెన్నెలకంటి రామారావు 95503 67536
ఆంగ్లారాధన అనర్ధదాయకం!
పరభాషలను ఎలా నేర్చుకోవోరిన్నదే కీలక సమస్య
ప్రపంచ పర్యావరణ సంక్షుఖిత సందర్భంలో భాష-పర్యావరణాల పరస్పరపూరక స్వభావాన్ని గుర్తించకుండా, “ఎదగడానికి ఇంగ్లీషే రాచబాట (సాక్షి ఏప్రిల్ 24) అనే వ్యాసంలో - ఇంగ్రీషు భాష సామాన్య ప్రజలందరి భాషగా మారి, దాని ద్వారా జాతీయ స్థాయి సంబంధాల్లోకి వెనకబడిన వర్గాలు రాగలిగితేనే ఎదుగగలరని కంచ ఐలయ్యగారు రాశారు. అందుకు ఇంగ్లీషు భాష ఎన్నికల అంశంగా తప్పక మారి తీరాలని ఆయన రాజకీయ పక్షాలను డిమాండ్ చేశారు... ఇంగ్లీషు భాష, నుడికారం, కార్పొరేట్ మార్కెటింగ్, ఉత్పత్తి 5 కార్యకలాపాలు, సాఫ్ట్‌వేర్ సాంకేతికతల వినియోగంలో ధ్వంసమవుతోందని ఆంగ్లభాషా శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో దళిత బహుజన వర్గాలు ఏ ఆంగ్ల భాషను నేర్చుకోవాలని ఐలయ్య డిమాండ్ చేస్తున్నట్లు!... భారతీయ మాతృభాషలు ప్రధానంగా అణగారిన కులాలు, వృత్తుల ప్రజానీకానివే. అలాంటిది వారి సామాజికార్థిక స్థితితో, అభివృద్ధి క్రమంతో సంబంధం లేకుండా ఆంగ్లాన్ని నేర్చుకోవాలని ప్రోత్సహిస్తూ ఐలయ్యగారు పిలుపు ఇవ్వడం ఆ ప్రజలకు చెడుపు చేస్తుంది... భాష (ఇంగ్లీషు) నేర్చుకోవడం వల్ల బహుజన ప్రజానీకం వారంతట వారే అభివృద్ది చెందుతారనే ఐలయ్య వాదన - ఆ ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ఈనాడు ప్రపంచమంతా స్థానిక భాషలు, స్థానిక సంస్కృతుల పునరుద్ధరణలోనే అభివృద్ధి ఉందనే ఎరుకతో ఆ వైపుగా అడుగులు వేస్తున్న విషయాన్ని ఆయన గుర్తించినట్లు లేదు.
“యుగ సంక్షోభం” (సామాజిక - ఆర్థిక, పర్యావరణ సంక్షో భాలు) లో కూరుకుపోయిన తరుణంలో అంతర్జాతీయ సమాజం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న జరుపుకునే మాతృభాషా దినోత్స వాన్ని ఈసారి అంతర్జాతీయ దేశీయ భాషల దినంగా జరుపుకోవడం విశేషం. పర్యావరణ పరిరక్షణలో దేశీయ భాషల అవనరాన్ని బలంగా గుర్తించింది. ప్రకృతి-సమాజాల మధ్య ఆదాన ప్రదాన కమానికి గండి పడి, అకస్మిక, వునరుద్ధరణకు వీలుకాని స్థితికి వాతావరణ మార్పులు చేరుకుంటున్న రూపంలో ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు నుంచి బయటపడాలంటే దేశీయ భాషలు “మాధ్యమం” (మీడియం)గా, సాధనంగా ఉపకరిస్తాయన్న విషయం అంతర్జాతీయ సమాజానికి క్రమంగా అనుభూతమవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి మాతృభాషా దినోత్సవాన్ని "దేశీయ భాషలతోనే అభివృద్ధి శాంతిస్థాపన, సయోధ్య వంటివి సుసాధ్యం” అనే ఇతి వృత్తంతో, భాష-పర్యావరణం మధ్యగల పరస్పర ఆధారితను, పరస్పర వూరకత్వాన్ని సాధించే లక్ష్యంతో జరుపుకున్నారు. వాతా వరణ మార్చును వేగవంతం చేసి, మానవజాతి మనుగడను ప్రశ్చార్థ కంగా మార్చే పర్యావరణ విధ్వంసాన్ని యుద్ధ ప్రాతిపదికపై అరి కట్టడంకోసం మాతృ్చభాషలనే కాకుండా, అంతకు మించి స్థానిక, మూలవాసీల భాషలను అనివార్యంగా పరిరక్షించుకోవలసిన తరుణ మిదని ప్రపంచ మేధావులు, భాషా - పర్యావరణ నివుణులు వివిధ అధ్యయనాలు, పరిశోధనల ద్వారా గత కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. జాతి, మత - కుల, ప్రాంత, జెండర్ తదితర అస్తిత్వాల అణచివేతలు, ఆధిపత్యాలు, అసమానతలు, వివక్షలతో సంబంధం లేకుండా మాతృభాషలు - స్థానిక భాషల పరిరక్షణ చేపట్టాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సమాజానికి పిలుపు నిచ్చింది. ఇలాంటి చారిత్రక సంక్షుభితకాలంలో పాలకులైనా, పాలిత ప్రజలు, పాలిత అస్తిత్వాలైనా (మత(కుల), జాతి, ప్రాంత, భాష తదితర) మాతృభాషలు, స్థానిక-మూల భాషల పరిరక్షణను ఉమ్మడిగా చేపట్టవలసి ఉంది. తద్వారా అందులో ఆ భాషల్లో నిక్షిప్తమైన స్థానిక విజ్ఞానాన్ని వినియోగించుకొని స్థానిక ప్రజలు, మూల వాసుల చొరవతో పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టే అవకాశ ముంటుందని పర్యా వరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ పర్యావరణ సంక్షుభిత సందర్భంలో భాష-పర్యావరణాల పరస్పర పూరక న్వభావాన్ని గుర్తించకుండా “ఎదగడానికి ఇంగ్లీషే రాచబాట” అనే వ్యాసంలో ఇంగ్లీషు భాష ఎన్నికల అంశంగా మారితే తప్ప, సామాన్య ప్రజ లందరి భాషగా ఇంగ్లీషు మారితేనే... వెనకబడిన వర్ణాలు జాతీయ స్థాయి సంబంధాల్లోకి రాగలరని, అలా వారి ఎదుగుదల ఇంగ్లీషు ద్వారానే సాధ్యమవుతుందని కంచ ఐలయ్యగారు రాయడం దురదృష్టకరం.
ముడిసరుకులు, చౌక (శ్రమశక్తి, సరుకుల మార్కెట్లు గల ప్రాంతాలను, రాజ్యాలను ఆంగ్లేయులు వలసలుగా మార్చుకున్నారు. వాటి నియంత్రణ కోసం వలసేకరణ ద్వారా తమను పోలిన ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడి స్థానిక నాగరికతల విధ్వంసానికి పాల్పడ్డారు. తమలాగే ఆలోచించే, ప్రవర్తించే, సంభాషించే, అనుభూతి పొందగలిగే కులీన సమూహాన్ని సృష్టించి వారి ద్వారా వలస పాలనను సమర్థంగా సాగించారు. ఆ క్రమంలో ఆంగ్లేయుల ఇంగ్లీషు భాషను, క్రైస్తవ మతాన్ని శక్తిమంతంగా వినియోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సామాజ్యాన్ని విస్తరింపచేయడం తెలిసిందే. | తెలుగుజాతి పత్రిక జువ్మునుడి ఆ మే 2019 |