పుట:Ammanudi-June-2019.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఛారావాహిక

నంద్యాల నారాయణ రెడ్డి 9360514800


“అమ్మనుడి చదువరులకు నంద్యాల నారాయణరెడ్డిగారి గురించి, ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హోసూరు ప్రాంత తెలుగు భాషోద్యమంలో వారిది పెద్ద పాత్ర. కృ.ష్ణ.రసం (కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం”) లో వారిది ముందు నడక. కతలను, కవితలను, వ్యాసాలను, వ్యంగ్య బాణాలుగా భాషోద్యమంలో గురిపెట్టడంలో అందెవేసిన చేయి. ఎనిమిదేళ్ల క్రితం 'నడుస్తున్న చరిత్ర ' లో వీరు వ్రాసిన 'ఇరుల దొడ్డి బతుకులు ' ధారావాహికగా వెలువడి, చదువరుల మన్ననలను అందుకొన్నాయి. అటువంటి మరొక రచన 'సాతంత్రకాల సదువులు ' పొరుగు తెలుగు బతుకులలోని ఒక సాంఘిక చరిత్ర ఈ రచన. ఇది కూడ అమ్మనుడి చదువరులను అలరింపజేసి, ఆలోచింపజేస్తుందని మా నమ్మకం.- సంపాదకులు


  అందరికీ దండాలు. మాది హోసూరు తావు. నూటికి అరవైమంది తెలుగువాళ్లే బతకతుండే తెలుగురాజ్యం అది. కన్నడ, తమిళ, మరాటి, ఉరుదూ నుడులవాళ్లు కూడా ఇల్లు దాటి బయటి కొచ్చినంక తెలుగునే నుడివే నాటు తెలుగు నేల మాది. ఇక్కడ తెలుగు వాళ్లము ఎప్పటినింకా ఉంటా వుండామో తెలుసా? తెలుగు పుట్టిన ప్పటినింకా, మనిషి గొంతులో నుడి పుట్టినప్పటి నింకా. అంత వెనిక్కి మిమ్మల్ని తోడుకానిపోయే సత్తవ లేని వాడిని. దానికనే సొతంత్రకాలం కంటా పోయేసి వద్దాము.

అరవై డెబ్బై ఏండ్ల కిందటి అందమైన కాలం అది. అరవం అనే మాటే మా చెవుల్లో పడని కాలం అది. తమిళ దొరతనపు పెనురక్కసి తొక్కిడికింద తెలుగమ్మ నలిగిపోని కాలం అది. ఆకాలంలో ఓసూరు పేటకు ఐదుమైళ్ల దూరంలోని మా నల్లూరు అగ్రహారం ఎట్లుండేదో తెలుసా?

వీదికి రెండు పక్కలా సోలు (వరుస)గా పెంకులిండ్లు ఇంటింటికీ ముందు నిలువెత్తున నిలిసిన జగుళ్లు (అరుగులు); నాలుగీడులకూ నడుమన లక్ష్మీనారాయణుని గుడి; ఆ పక్కనే రచ్చ; రచ్చమీద పెనేసుకోని ఎదిగిండే వేప, రాగి మానులు; మాను నీడన నాగుల అశ్వత్తులు ఉండే చిన్నగుడి మానులపైన చిలిపిలి పలుకుల వేలాది చిలకలు, కోకిలలు, కాకులు, గువ్వలు; పదూర్ల జనం సంత తావున కూడినట్ట, పొద్దునా మాపునా ఆ గువ్వల కూతల సందడి; వాళ్లు లేసి కోళ్లను లేపే మా అమ్మట్లా తల్లులు అంత పొద్దుకే 'అమ్మమ్మా మాయమ్మా మము గన్నతల్లీ ' అంటా రాగుల్నో గింజల్నో విసురుకొంటా రాగరాయి (విసుర్రాయి) తావ పదం ఎత్తుకొనే వాళ్లు; 'సువ్వీ కస్తూరి రంగా సువ్వీ కావేటి రంగా” అంటా రోట్లోని వర్లను రోకలితో దంచతా సువ్విపాటను పాడేవాళ్లు; 'వన్నమ్మ చెన్నమ్మ వదినమరదాళ్ళూ...” అంటా చల్లగుత్తి (కవ్వం) కి వంత పలికేవాళ్లు ఊరుబావి తిరిగెన్ల (రాట్నాల) తాళాలకు 'నోమి నోమన్లాల నోమన్నల్రాల...” అంటా రాగాన్నందించేవాళ్లు ఆవులింట్లో పేడనూ చెత్తనూ బెవరి (జవిరి) మక్మర్లకు (గంపలకు) నింపతా “ఎందుండి వస్తేవి తుమ్మీదా ఏవూరు నీవూరు తుమ్మీదా” అని కైవారం తాతగారి తత్వాలను పాడుకొనేవాళ్లుు ఆవుల నోళ్లకు జొన్నకట్లను అందిస్తా 'ఇచ్చాకు కుల తిలక ఇకనైన పలకవే రామనెంద్రా” అని రామదాసులయిపోయి వగసేవాళ్లు; గంగెద్దులు, బుడిబుడికలు, చెన్నదాసర్లు, బుడిగ జంగాలు, దొమ్మరోళ్లు, రోకలాటలు, నయ్యాండి కుణుసులు (చిందులు), వీరబద్ర పూనకాలు,

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి *జూన్‌ - 2019

41