పుట:Ammanudi-June-2019.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారసత్వ విజ్ఞానం.

లయ 9494393764

ఆదివాసీ ప్రాంతాల్లోని వివిధ రకాల ఆహార పదార్దాలు

ముందుమాట : గత సంవత్సరం లయ సంస్థ 'కమ్యూనిటీ కాలేజి మొదటిగా 'కమ్యూనిటీ ఆయుర్వేద ప్రాక్టిషనర్స్‌ (కాప్‌) “ప్రజా ఆయుర్వేద వైద్యులు” - అనే సర్టిఫికెట్‌ కోర్సు (వృత్తి విద్యతో) ప్రారంభించింది. మొదటి బ్యాచ్‌ ఆగష్టు 2018 నుండి ఫిబ్రవరి 2019 మధ్య పూర్తి అయ్యింది. 20 మంది ఆదివాసీ యువతీ యువకులు ఈ కోర్సులో శిక్షణను పూర్తి చేసుకొన్నారు.

శిక్షణలో భాగంగా ఆదివాసీ అభ్యర్థులు తమ ఆదివాసీ ప్రాంతాలలో దొరికే ఆహారం. అడవిలో సహజ సెద్ధంగా లభించే మరియు ఆదివాసీ రైతులు సాగుచేసే వివిధ రకాల పండ్లు, ఆకు కూరలు, దుంపలు, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, అవి దొరికే కాలాలు, వినియోగం, వాటి ఉపయోగాలపై వారి వారి గ్రామాల్లో పెద్దలతో చర్చించి, ఆ సమాచారాన్ని తిరిగి తరగతులలో పంచుకొన్నారు. ఇది ప్రధానంగా తూర్పు గోదావరి మరియు విశాఖ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన సమాచారం. ఆ సమాచార సారాన్ని లయ సంస్థ ఆరోగ్య విభాగం (హెల్త్‌ యూనిట్‌) ఒక పట్టిక రూపంలో అమర్చింది. దీనిని 'మన్నెంలో” పాఠకుల కొరకు అందిస్తున్నాము.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి *జూన్‌ - 2019

37