పుట:Ammanudi-June-2019.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తల్లికన్నా ఏకుల బుట్టంత తల్లినయం ఈ అన్ని కథల్లోను ఆకలి, అంటరానితనం, పేదరికం సమస్యలు దళితుల్ని ఎంతగా కిందకు పడేశాయో తెలుపుతాయి. దళితుడు కులసమస్య మిగతా సమస్యల్ని ఎదుర్శొని నిలబడాలి, దళితేతరులు కూడా పై సమస్యలను ఎదుర్మోవాల్సి వుంది కాకపోతే డోసు కాస్త తక్కువ. అందువల్లే ఈ కింది కులాలన్నీ ఏకమైతే, చరిత్రను తిరగరాయొచ్చని మంది కలిశారు. ఆమందికే బహుజనులు అనే పేరు. పూర్వం మూలవాసులే ఇప్పుడు బహుజనులు అనుకోవచ్చు

“భారతదేశంలో బహుజనులు” అనే మాట 1984 ఏప్రిల్‌ 14వ తేది దాకా వినబడలేదు. బహుజన సమాజ్‌ పార్టీ స్థాపనతో ఆ భావన వచ్చింది. మనువాద వ్యవస్థవల్ల భంగపడ్డ 'షెడ్యూట్టు కులాలు షెడ్యూల్టు తెగల వెనకబడిన తరగతులతో పాటు మత పరంగా అసంఖ్యాకులైన ముస్లిం, క్రైస్తవ పార్శీ, బౌద్దులంతా బహుజనులవుతారని పార్టీ ప్రణాళికలో చేర్చింది. అగ్రవర్ణ హిందూ భావజాలం కులం, మతం పేరుతో నష్టపోయిన వాళ్ళందరూ బహుజనులే. కంటికి కాయ గడ్డలుగా ముడి పదార్థాలను ఆహారంగా మార్చిన ఆదివాసుల అన్వేషణ భారతదేశ సంస్కృతికి తొలిమెట్టు, చర్మాన్ని తోలుగమార్చి, ఆ పర్యిశ్రమలో చెప్పుడప్పును సృష్టించిన మాదిగ పరిశ్రమ ఈ దేశ చరిత్రకు రెండవమెట్టు. ప్లేటోకుసైతం కర్రా, కత్తిసాము తెలియని రోజుల్లోనే సభ్యసమాజంగా రూపొంది. గ్రామ రక్షణకు పూనుకాన్న మాలతత్వం మూడోమెట్టు, మురికిలో జీవించే సన్యాసికి బట్ట శుభ్రత నేర్చిన చాకళ్ళు తిన్నతిండి ఒంటబట్టకుండా చేసి తలబరువును వదిలించే మంగళ్ళు ఈ చరిత్రకు నాలుగోమెట్టు, గొడ్డు మాంసం, గొర్రెమాంసం, బర్రె పాలు, ఆవు పాలు, ఆహారంలో భాగంగా మార్చిన గొల్ల కురుమలు ఐదోమెట్టు, మట్టి ముద్దను నాగరికతకు గుర్తుగా మార్చిన కుమ్మరి, ఇనుమును కాల్చి కత్తిగా, సుత్తిగా మలచిన కమ్మరి, కర్రను నాగలిగా మలచిన వడ్రంగి ఈదేశపు మెట్టుబడిదారీ వ్యష్టకు ప్రాణం పోసిన వాళ్ళు వాళ్ళు ఆరోమెట్టు. అంటూ కంచెఐల య్య శ్రమజీవులు ఈ దేశ ఉత్పత్తికి అభివృద్దికి ఆరోమెట్టూ. అంటూ ఉత్పత్తి కులాల ప్రాధాన్యాన్ని సమాజానికి వీరు ఎంత ముఖ్యమో కూడా తెలియజేశారు.

1960 దాక కథా సాహిత్యంలో చదువుకొన్నవారందరూ బ్రాహ్మణవర్గం కావడంతో వాళ్ళ కథలే వచ్చాయి. శ్రామిక వర్గకథలు రాలేదు. 1920 - 25 మధ్య చింతా దీక్షితులు రచించిన “దాసరి పాట ' తొలి తెలుగు వృత్తికథ. 1928లో ఆదిరాజు వీరభధ్ర రావు ఆదిలక్ష్మికథ. 1932లో దామర్ల కాంతారావు రాసిన భగ్నప్రేమ, 1954లో జి. రాము రాసిన ఆత్మఘోష పద్మసాలీ జీవనపోరాటాన్ని చిత్రిస్తూ బహుజన జీవితాల వాస్తవికతకు నాంది పలికిన కథగా చెప్పుకోవచ్చు. తరువాత పెరటిచెట్టు 1954లోనే వచ్చింది. ఇది గీతకార్శికును చిత్రించిన కథగా మొదటిది అని చెప్పవచ్చు 1953లో విశ్వ కర్మల (వడ్రంగి, కమ్మరి, కంచరి, శిల్పి, స్వర్ణకారి పారిశ్రామికీకరణ వీరిలో చాలామంది బతుకులు పోగొట్టుకున్నారు. వీరిలో వడ్రంగి జీవితాన్ని చిత్రించే కథ. 1953లో బొమ్మరెడ్డి పల్లి సూర్యరావు రాసిన విశ్వకర్మ అకలిని తెలిపేకథ. 1956లో కెకె. వెంళటరావు రాసిన కొత్తగాలి రైతు, వడ్రంగి అనుబంధాన్ని తెలిపే కథ. పై వృత్తులను చేసే వారందరినీ ఊరమ్మడి వ్యక్తులుగా భావిస్తారు. దళితవాదంతో ఎంట్రీ ఇచ్చి బహుజన వాదాన్ని కూడా తన రచనలద్వారా తీసుకొచ్చిన కొలకలూరి ఇనాక్‌ తలలేనోడు కథ శిల్పంలోను వస్తువులోను కథా సాహిత్యంలో ఒక పెనుమార్చు. 1989లో డాక్టర్‌ లంకిపల్లె కన్నయ్యనాయుడు రాసిన వెన్నెల బొమ్మలు, మత్స్వకారుల జీవితాలను తెలిపే కథ, సురవం ప్రతాపరెడ్డి రాసిన నిరీక్షణ, 1958లో జి. రామకృష్ణ రాసిన గంగప్తుత్రుడు సముద్రంలో చేపలు పట్టే వ్యక్తి, అతని వృత్తిని గ్లోబలైజేషన్‌ ఎంత ప్రభావితం చేసిందో చెప్పేకథ.

అడవి బాపిరాజు రాసిన బొమ్మలరాణి 1935లో వచ్చింది. తోలుబొమ్మలాట లాడి జీవించేవారికథ. వడ్జెర్ల జీవితాను చిత్రించిన మొదటికథ 1984లో వచ్చింది పప్పల నరసింహం రాసిన కనుపాపను కబళిస్తే. దొమ్మర్ల జీవితాన్ని చిత్రించేకథ 1985లో వచ్చింది బందరు దుర్గాప్రసాద్‌ రాసిన తప్పెవరిది. యాదవులకథ

గ్లోరామప్ప, పాలముర్తి వెంకటనరసింహరావు, కిశోర్‌ శత్రు నేర్పిన పాఠం, బోయజంగయ్య దొంగలు తోడేళ్ళు, కె. రామ మోహన్‌ రాజు గొల్లకథ, వి.ఆర్‌. రాసాని నేరాలిన వసంతం, సొతం త్రదినం. కెకె. మీనన్‌ భయం, భూపాల్‌,

అంబల్లబండ, కాలువమల్లయ్య, అడవికాచినవెన్నెల కె.వరలక్ష్మి మట్టిబంగారం, పెద్దింటి అశోక్‌ కుమార్, ఇగురం, నందిని సిద్దారెడ్డి, పుల్లర నల్లభూమయ్య, గొల్లమల్లక్క మొదలైన కథలు యాదవుల జీవితాల్లోని అనేక పార్వాలను ఫొడచూపాయి. కథా సాహిత్యంలో బి.సి. కథా సాహిత్యం ఒక మైలురాయి. దేశానికి పాలు పెరగు మాంసాన్ని ఉత్పత్తి సరఫరా చేసే అంశంలో యాదవుల కురుబల పాత్ర కీలకమైనది. వీరి కథలు ఇంకా రావాల్సిన అవసరం వుంది.

వృత్తికథల్లో విరివిగా వచ్చిన కథలు చేనేత వృత్తిమీద, బహుశ వీరి ఆకలి కేకలు కూడ ఎక్కువని చెప్పవచ్చు. వరలక్ష్మమ్మ కుటీర లక్ష్మితో ప్రారంభమై దామెర్ల రమాకాంతరావు, భగ్నప్రేమ,టేకుమట్ల కామేశ్వరరావు అవకాశముంటే, అందె నారాయణస్వామి శిల్పి సన్మానం, కనకసుందరరావు హత్య, ఎన్నార్భూలా, నూలుపోగు, రావూరి వెంకట సత్యనారాయణరావు మధుపర్కాలు, కేశకరువు ఐతా చంద్రయ్య చిలకపట్టుచీర, అమ్మమ్మ ఆరాటం, జూకంటిజగన్నాధం. మునిపల్లెరాజు చేనేత చిత్రం, దాదాహయత్‌ ఏడుఒడ్డు చేపలు, ఇంకా అనేక కథల్లో చేనేత వృత్తిదార కష్టాలు తెలియచేశారు. రజక కులాల కథలు 1970లో పిండీకృతశాటి చాకలివాళ్ళ సమగ్ర జీవనాన్ని తెలిపేకథ, అట్టాడ అప్పలనాయుడగారి పువ్వుల కొరడా, ఏ.వి. రెడ్డి శాస్త్రి ఈమంటలుచల్లారవు. కాలువ మల్లయ్య దొరసాని చీర. గంటేడు గౌరవనాయుడి విముక్తి , పెద్దింటి అశోక్‌ చాకిరేవు, జి. వెంకటకృష్ణ కాలినగూడు ఇలా రజకుల వృత్తి జీవితాల్లోని సుడిగుండాలను తెలిపారు. (తరువాయి 46 వ పుటలొ ....)

జాతి సంస్కృతికి ప్రాణం మాతృభాషే

35

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి *జూన్‌ - 2019