పుట:Ammanudi-June-2019.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్యం

డా. బి. నాగశేషు 9985509053


ఉత్పత్తి కులాల కథలు

“నీకు ఇతరులు ఏం చేయకూడదని అనుకొంటావో అది నువ్వు ఇతరులకు చెయ్యకపోవడమే మహాభారత నీతి "

“నీవలెనే నీ పొరుగు వారిని ప్రేమించు - బైబిలు”

“బహుజన హితాయ బహుజన సుఖాయ. - బౌద్దమతం”

“మసీదులో వరుసగా నిలబడి ప్రార్థించడం వెనుక మర్మం అందరూ సమానులే అనే సమానధర్నాన్ని బోధిస్తుంది ఖురాన్‌.”

ఈ దేశంలో పేదవాడు తిండికి ఎతుక్కొవాలి, బట్టకు పాకు లాడాలి, ఇవి రెండూ కొంచెం తక్కువైనా పరవాలేదు సంపాదించు కోవచ్చు కానీ కులం తక్కువ కాకూడదు ఎందుకంటే ఇక్కడ గుణం కంటే కులమే ప్రధానం, భారత దేశంలో పరిపాలన చేస్తున్నది కులాలే. మనిషి జీవనానికి కారకాలైనవేవి ఎక్కువ తక్కువలు చూపవు, కానీ మనిషి మనిషిగా ఎదగడానికి కులాన్ని మతాన్ని వాడుతూ హెచ్చు తగ్గులు సృష్టించేశాడు. కులం మురికి ఎన్ని సబ్బులతో ఉతికినా బండబారిన సమాజం అంత సులభంగా వదలదు.

కరుడుగట్టిన సామ్రాజ్యవాద భావాల్ని మనసునిండా నింపుకొన్న తెల్ల దొరలను కూడా వెల్లగొట్టగలిగాం. మనలోవుండే అనాగరిక ఆలోచనా విధానాల్ని వీడలేకున్నాం. పూలే, అంబేద్మర్‌, గాంధీ జాషువా, భీమన్నలాంటి సంస్కర్తలు కులజాడ్యాన్ని రూపుమాపాలని, వారి ఉపన్యాసాలతో, రచనలతో విరామం లేకుండా కృతనిశ్చయంతో పోరాడారు, ప్రారంభకాలంలో నిరక్షరాస్యత, పేదరికం, మతం, దైవం, మూఢాచారాలతో జనం గాఢనిద్రలో వున్నారు తేరుకొనేలోపు తీరని నష్టాన్ని మూట కట్టుకొని ఇప్పటికీ మోస్తున్నారు.

చదువును కులవృత్తిగా చేసుకొన్న కులాలు ఉత్పత్తి కులాలపై పెత్తనం చలాయించడం మొదలు పెట్టారు ఈ ఆదిపత్యం అనేది అక్కడనుండి ప్రారంభం అయ్యింది దీనికి తోడు సాహిత్యం అంతా అగ్ర కులాలవారిదే, ధిక్మారణకి అవకాశం లేకుండా పోయంది తిరగబడే తెగింపు బొత్తిగా రాలేకపోయింది దేశానికి తిండి పెట్టేవారు పనిలో నిమగ్నమైపోతే చదువుకొన్నకులాలు శ్రామికుడి కులాన్ని కుత్సిత కలాలతో కలుషితం చేశారు. ఉత్పత్తి కులాలు వారి గురించి తెలుసుకోనేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయె, సాహిత్యంలో మార్పుకోసమో సానుభూతికోసమో 1925 నుండి దళితుల్లో చైతన్యం నింపే కథలు దూసుకు వచ్చాయి. శ్రీపాద 'సాగరసంగమం 'పుల్లం రాజుకథ 'ఇలాంటి తవ్వాయివస్తే వేలూరి శివరామశాస్త్రి, మాలదాసరి కథ 1933,


కరణకుమార, 'ప్రోలయ్య 1937 అనిశెట్టి సుబ్బారావు, పాకిది 1943, చలం ఆరాత్రి 1945, మాగోఖలే “మత్తాలుకూతురు” 1956, కరుణకుమార 'కొత్తచెప్పులు” 'సేవాధర్మం” కా.రా. జీవధార, కాలువ మల్లయ్య, అగ్నిగుండం, కొత్తకులాలు, దొరగారిదొడ్డి, వెలి, భస్మాసుర హస్తం, బాకీబతుకు, టి. గోపి అమ్మగార్లేనా మనుషులు, కలువ కొలను సదానంద 'మాలమనిషి ' బమ్మిడి జగదీశ్వరరావు, జలగ కథలు, పులికంటి కృష్ణారెడ్డి 'కోటిగాడు స్వతంత్రుడు ' సబ్బు కీచక వధ, చెంబుకోగంగ మధురాంతకం రాజారాం, అజ్ఞాతవాసం బి.ఎస్‌. రాములు 'బంది” దక్షయజ్ఞంపాలు, సదువు. సింగమనేని నా ముఖసముఖం, ఉచ్చు ప్రజాపోరాటాలే జీవితంగా భావించే అల్లం రాజయ్య, ఎదురుతిరిగితే, రాసాని, హోమం, అక్షింతలు సుంకిరెడ్డి వెంకటరెడ్డి చనుబాలు, కేతు విశ్వనాథరెడ్డి 'ఓకజీవుడి వేదన” శిలువ వేసిన మనుషులు, చీకటినాడి, మరిగేనెత్తురు మార్పు, మంత్రసాని, శాంతినారాయణ, బొమ్మా - బొరుసు విద్వాన్‌ దస్తగిరి, రొట్టెముక్క రాజగోపాల్‌ ఒక్కపిడికిలిచాలు ఈ కథలన్నీ కులం నిర్మూలన జరిగి మనుషులంతా సమాలనులే అని చాటనానికి ఉద్భవించిన కథలే.

సమస్యను స్వతహాగా అనుభవించి రాసినవారు బొయభీమన్నతో ప్రారంభమై దళిత ఉద్యమ పతకాన్ని ఎగరవేసే స్థాయికి కథను తీసుకొన్పిన ప్రముఖ కథకులు కొలకలూరి ఇనాక్‌. ఊరబావి 1969. ఆకలి, క్షమాభిక్ష కొలుపులు, అస్పృశ్యగంగ, విఘ్న వినాయకుడు మొదలయిన కథలన్నీ కనీస అవసరాలకోసం పోరాడే కథలే. ఇనాక్‌ గారి తరువాత నాగప్పగారి సుందర్రాజు 'మాదిగోడు ' కథలు తీవ్రంగా తిరగబడేలా వుంటాయి. ఎండ్లూరి “దరువు” బతుకు -మెతుకు, కథల్లో ప్రశ్నించేతత్వం కనిపిస్తుంది ఈ దేశంలో పొలాలకు కులాలుంటాయి. కులాలకు పొలాలుంటాయి. ధైర్యముంటే గవర్నమెంట్ని ఈ రెంటిని రద్దు చేయమనండి అంటాడు.

రాయలసీమ కక్షల్లో మాల, మాదిగులు ఎలా సమిథులయ్యారో చిలుకూరి దేవపుత్ర కథల్లో కనిపిస్తుంది.

మనీషి కనీస అవసరమైన తాగునీటికి కూడా నోచుకోని దళిత ఉదంతాలు చెంబుకోగంగ, చెలిమి, ఆఖరుతడి, మృత్యుజలం, ఊరబావి, ఊటబాయి, హోమం, కయ్యకాలువ చెలమ, లాంటి కథలే కాకుండా దళితుల నీటి అవస్థలు అడుగడుక్కి కనిపిస్తాయి. దళిత కవయిత్రులు కూడా దళితుల స్టితిగతులపై తమ వాణిని వినిపించారు, మంగాయమ్మ 1935 అయ్యోపాపం కథానిక తాగడానికి గుక్కెడు నీళ్ళివ్వని కథ, చుండూరు రమాదేవి ధర్మతల్లి, అయ్య పెళ్ళి వారులక్ష్మి, ధన్యజీవు, దూకుర్తి లక్ష్మీనరసమ్మ ప్రణయత్యాగం లాంటి కథలు దళితుల సమస్యలను, అస్పుశ్యతా నివారణా అవసరాన్ని తెలుపుతాయి. జాజులగౌరి, మన్నుబువ్వ. డా.వినోదిని, బాగలేదు జరమొచ్చింది. జూపాక సుభద్రరాసిన, శుద్ది జెయ్యాలె. దాసరి శిరీషరాసిన “వ్యత్యాసం” కథ గోగుశ్వామల రాసిన ఏనుగంత

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్‌ - 2019

35