పుట:Ammanudi-June-2019.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జానపదుల నిత్యజీవన వ్యవహారంలో సజీవంగా నిలిచి ఉన్న తెలుగు పదబంధాలను, తెలుగు జాతీయాలను ప్రయోగించటంపై కవిగారికి అపారమైన అభిమానం. మొదట తాను పుట్టినగడ్డను, తన తల్లిభాషను గౌరవింపలేని వాడు దారితప్పి తిరిగేవారని నిష్కర్షగా అధిక్షేపించిన అపరభాషా ప్రేమికులు కొండవీటి వేంకటకవి. మొదట తల్లి బాస నేర్చి ఆపై పరులబాసను నేర్చినట్లయితే మేలు కలుగుతుందని అలాకాక “నేలవిడిచి సామునే జేయుదు నటన్న పుట్టు వెఱి నవ్విపోడె వేమ”, అంటారు. కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వంటి మహాకవులు తల్లిబాసను నేర్చుకోవటం వలన కలిగే ప్రయోజనాలను పలురీతుల వెల్లడించారు. వేంకటకవి భావవ్యక్తీకరణలో చూపిన విలక్షణత ఈ సందర్భంలో భాషాభిమానుల మనస్సులకు హత్తుకుంటుంది.

“తేనెసోన వంటి తెనుగును దెగనాడి
యౌత్తరాహుల కును నంజలించి
తిరుగుచున్నవారు తెనుగమ్మ బిడ్డలై
మొప్పెలగుచు దారి తప్పి వేమ” 87 ప

తేనె వంటి తెనుగును ఆదరించలేనివారు 'మొప్పెలు 'గా వేంకటకవిగారికి కన్సట్టారు.

వ్యవహారంలో జారిపోతున్న కనుమరుగవుతున్న విశేషమైన, అర్జవంతమైన పదప్రయోగాలు, సామెతలు '*త్రిశతి” రచనకు వన్నె చేకూర్చిన అంశాలు. “బుద్ధ, వేమ, గాంధి” - మూడు శతకాలు తెలుగు నుడికారపు సొంపును కమనీయంగా అడ్డుకున్నాయి.

“గంజిగట్రద్రావగాలని నిఱు పేద
యందలములనెట్లు పొందగలడు
కూటిరాయి దీసికొనలేని బలహీను
డేటిరాయి తీయుటెట్లు వేమ.” 70 ప

'గంజి - గట్ర ' ద్వంద్వ ప్రయోగం, బడుగువర్ణాల జనజీవన స్రవంతిలోని వ్యవహారాన్ని పట్టి ఇస్తుంది. *కూటిరాయి - ఏటిరాయి” వంటి సామెతలు తెలుగు వారికి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తి.

పద్యంచెప్పినా, గద్యం చెప్పినా, ప్రసంగం చేసినా సర్వాత్మనా తమ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకతను వెల్లడించు కున్న స్వేచ్భాపరులు వేంకట కవిగారు సాధారణంగా కవులకు రచన ఒకదారి, నిత్యజీవనగమనం ఒకదారి కావచ్చు. కాని కళాప్రపూర్ణ వేంఠటకవిగారిలో రెందు మార్దాలు గంగా యమునల సంగమమై ప్రవహించాయి. ఆ సంగమ ప్రవాహానికి అంతఃస్రోతన్వినిగా వీరి ప్రజ్ఞా సరస్వతి భాసిస్తూ ఉంటుంది.

అలనాడు కొండవీటి రెడ్డిరాజుల అండదండలతో తెలుగు కవితా తరుణి గణుతికెక్కింది. ఈనాడు కొండవీటి సుకవి కుంజరుని తెలుగునుడికారంలో ఆటవెలది నాట్యమాడింది. తెలుగు యువత హృదయాలలో చేవను, స్వయంకృషిని ఉద్భోదించారు. మాత్సర్యాలను విడనాడి సౌమనస్యంతో సంచరించాలని సూచించారు.

తలపులకునెపుడు తఱిమెన వట్టిన
బాదరసమురీతి పరువులెత్తు
జూచి చూడకున్న సోమరితనమెచ్చి
భావములను మొండి పొఱు వేమ. 54 ప

అంటారు.

1960లో వేంకటకవి రచించిన “త్రిశతి” లో వర్ణింపబడిన సామాజిక స్థితిగతులు నేటికీ సమాజంలో ఎదురవుతూనే ఉన్నాయి. క్రాంత దర్భనులు సంస్కర్తలు అయిన కవులు సమాజాభ్యుదయాన్ని కాంక్షించి చెప్పిన కవిత్వం అచ్చమైన అభ్యుదయాన్ని సాధించి జనులు వారి ఆలోచనలకు కార్యరూపాన్ని సంతరించటమే 'కవిభూషణుల 'కు జాతి అందించే ఘనమైన నివాళి.

34

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్‌ - 2019