పుట:Ammanudi-June-2019.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహజసిద్దమైన పల్లెభాషను ఉపకరణం చేసుకున్నాడు. జానపదుల నోళ్ళలో నానుతున్న నానుడులను ప్రయోగించాడు. అత్యంత విలక్షణమైన వేమన కవితారీతినీ ఆదరించిన వేంకటకవి అతడి కవితారీతిని, కవితాలక్ష్యాన్ని ప్రశంసించారు.

“అలతియలతి పలుకులందు జీవమునూది
ఘనులు సెవ్సు నలవికాని వాని
వినిచితివి విశుద్ధ వేదాంత బోధల
నరటిపండు నొలిచినట్లు వేమ” - 10 ప

పదాలకు జీవం పోయటం వేంకటకవి వినూత్నమైన అఖివ్యక్తికి దర్పణం. సహజ రమణీయమైన ఉపమాలంకారం భావానికి మెరుగులుదిద్దింది.

సమాజంలో కవికి నిండైన గౌరవం కావాలని, ఇతరుల మెప్పు కోరి కవిత్వం చెప్పేవారి వెఱిపోకడలకు విసిగివేసారి వేమనకలం సత్యశోధనకు పూనుకున్నదని, కవి అంతరించిపోయినా సమాజంలో శాశ్వతస్థానాన్ని అర్జించేది కవిత్వమేనని వేంకటకవి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

“బిచ్చమెత్తి సిగ్గుబిడియమ్మువోనాడి
పరులనాశ్రయించి పల్లకీలు
పొందవచ్చు దానుబోయిన పిమ్మట
నిలువ వలయుకవిత విలువవేమ” - 14 ప

వేమన తన ఆటవెలదులలో సమాజంలో అమాయకులను, స్త్రీలను మోసగించే దుర్మార్గులను చీల్చి చెండాడాడు.. సర్వసంగ పరిత్యాగులయిన స్వాముల, సాధువేషాలతో సంచరించే కపట వర్తనుల గుట్టు బయటపెట్టాడు. వేంకటకవి తనశతకంలో కపట సన్యాసుల ప్రవర్తనలను, మోసాలను బయటపెట్టి జనులను హెచ్చరించారు. అరిషద్వర్ణాలను ఉపశమింప చేసికోలేని వారి నైజాన్ని ఖండించారు.

“కావిగుడ్డమొలకు గాళ్ళకు బాదుకల్‌
మెడకు లింగకాయ దొడుగుయోగి
వట్టు బట్టి వెండిపాదుకల్‌ బంగారు
లింగమందజూచు లెస్స వేమ - 3 ప

సర్వసంగపరిత్యాగికి పట్టు బట్టలు, వెండి పాదుకలపై వ్యామోహాన్ని నిరసించారు. ప్రస్తుత సమాజంలో స్వామి, బుషి, మహర్షి శబ్ధాల గౌరవప్రదమైన అర్జాలు వికటించాయని, చిత్తశుద్దిలేని జీవులకు కూడా అవి బిరుదులై స్థిరపడ్డాయని వ్యవస్టపై అధిక్షేపాన్ని వాక్తం చేశారు.

“స్వామి బుషి మవార్షి శబ్బమ్ములేనాడౌ
పొగిలిపోయి సారమును దొఱంగె
చిత్తశుద్దిలేని జీవుల నివిచేరి
బిడియపడక గట్టిపడియె వేమ” -9 ప

“వేమ” శతకం అంతటా వేంకటకవి లోకరీతిని వెల్లడించారు. మనుషుల వర్తనలోని లోపాలను ఎత్తిచూపారు. మనిషి మనీషిగా ఎదగటానికి అనుసరించవలసిన మార్గాలను బోధించారు. సమాజాభ్యుదయం కోసమే తీవ్రంగా తపన చెందారు.

“తల్లిదండ్రి గురువుడైవమ్మటందురు
మొదల తల్లిదంద్రులుదిల కొనగ
దేవతలకు గుళ్ళు దీర్తురేమిదివెఱి
యిరుగుపొారుగుమెప్పుకొఱకు వేమ "- 16 ప

తల్లిదండ్రులను గౌరవించవలసిన బాధ్యతను విస్మరించిన సంతానానికి చురక అంటిస్తూ ఎల్లప్పుడు సజ్జనసాంగత్యమే మనిషి బెన్నత్యానికి బాటలు వేస్తుందని సందేశం ఇచ్చారు.

“వేమ " శతకానికి ప్రాణశక్తిని అందించిన లక్షణం తెలుగు నుడికారపుసొంపు. మహాకావ్వాలను, అత్యద్భుత పాండితీ ప్రపూర్ణ విమర్శనా గ్రంథాలను భాషామతల్లికి నైవేద్యంగా సమర్పించిన వేంకటకవిగారు శతక రచనలో లలిత మధురమైన శైలిని అనుసరించారు. తాము జాగ్భతమొనర్చ బూనిన సమాజానికి హితవు కూర్చే రీతిలో తెలుగు భాషా మాధుర్యాన్ని ఈ శతకంలో నర్తింప చేశారు.

“మెఱుగుబెట్టువారు దొరకనమెఱయును
దొరకకున్న ముడుగుదుర్భలుండు
గోగునీట దుడువ రాగిల్లు నిత్తడి
తుడువకున్న గాంతి దొఱగు వేమ” - 23 ప

తళతళమెరిపించే తీరు అర్జాంతరన్యాస అలంకారమై ఈ పద్యంలో అభివ్యక్తి నవ్వతను సాధించింది.

“వేమ " శతకంలోని ప్రతిపద్యంలోను తెలుగువారి జీవనశైలి, సామెతలు, లోకోక్తుల విందుల చమత్మారాలు నహృదయులను ఆనందపరవశులను చేస్తాయి.

పనియు పాటులేని పలుగాకిమూకల
తలవులందు జెడ్డ మొలకలెత్తు
బడుగురెక్టనట్టి బాటలో గాదమ్ము
మోసులెత్తి దారిముంచు వేమ” 24 ప.

అని శ్రమజీవనంలోని సౌందర్యాన్ని చవిచూపించారు.

“ముసిడికాయ దెచ్చి మసిపూసిమారేడు కాయ చేసే” వారిని “అన్నమైనా సున్నమైనా ఒక్కటే ' అని వాగే కర్మయోగులను,” గడపగడప ముందు బుడుబుడుక్కని కొంకులేని కూతలుకూసి” మోసగించేవారిని “ఫలములేని పనికి బారలు చాపి తప్పుదారి పట్టించేవారిని, ఈ శతకంలోని సామెతల్లో దర్శింపచేశారు కవి.

వేంకటకవి గారి అపారమైన తెలుగుభాషాభిమానం ఈ శతకంలో వేళ్ళూనుకొన్నది. తెలుగుభాష పరభాష పరదేశస్థుల చేత గౌరవింపబడుతూ ఉండగా తెలుగు నేలపై తెలుగు పలుకలేని వారిని, తెలుగును ప్రేమించలేని వారిని తీవ్రంగా నిరసించారు.

“లాతిదేశములకు బ్రీతిచేకూర్చును
దెలుగుబాసలోని తియ్యదనము
నొగులు సెందు ముందు నోరార బల్కగా
దెలుగువాని కేమితెగులు వేమ " 62 ప

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్‌ - 2019

33