పుట:Ammanudi-June-2019.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతక సాహిత్యం

డా.వి, నాగరాజ్యలక్ష్మి 9394113848

మాత్సర్యభావోన్మత్తులలో సౌమనస్యం నింపగల

“వేమ” శతకం

“లోకులు బాకులు దూసిన
నాకేమని సత్యమనుచు నమ్మినదానిన్‌
వాకొను సుస్థిరధైర్యము
నాకొసగుము నిన్ను నమ్మినాడను వేమా!”

తాను దర్శించిన సామాజిక సత్యాన్ని నిర్ఫీతితో వెల్లడించిన సమాజాభ్యున్నతిని కవిత ద్వారా కాంక్షించిన వేమన వ్యక్తిత్వ వైభవాన్ని కవిత్వ రచనకు ఆదర్శంగా భావించి, అనుసరించి కొండవీటి వేంకటకవి రచించిన “తిశతి” లోని బుద్ధ, వేమ, గాంధి శతకాలలో ద్వితీయ శతకం “వేమ.

మహావక్తగా, 'ప్రాచీనకావ్య పరిష్మర్తగా, సరస విమర్శకుడిగా, ఆదర్శ అధ్యాపకుడిగా, సత్కావ్య నిర్మాతగా శతక కర్తగా తెలుగు సాహిత్యనందనోద్యానంలో పరిమళాలను ప్రసరింవ చేసిన కవిరాజు కొండవీటి వేంకటకవి.

“కావ్య నాటకాది బహురూప వాజ్మయశాఖలను నవరస సంభరితంగా నిర్మింప సమర్ధుడయినవాడు కవిరాజు” అని రాజశేఖరుని కావ్యమీమాంస పేర్కొంటుంది. ఇబ్బడిముబ్బడిగా కవితలు పండించిన విద్వత్కవులు తెలుగుగడ్డ పై పలువురుం డవచ్చు. కానీ అధీతి బోధాచరణ ప్రచారాలపట్ల సార్థకమైన సమన్వయం సాధించినవారు అరుదు. ఈ నాట్టింటికి సముచితమైన సమన్వయం కుదుర్చుకొని సాహిత్యసేవచేసి చరితార్జులైన విద్వత్కవులలో కొండవీటి వేంకటకవి అగ్రగణ్యులు. వీరి కవితా వ్యవసాయం నిత్య ప్రవర్ధమానం అయింది. కర్షకా! హితబోధ, చెన్నకేశవశతకం, భాగవతులవారి వంశావళి, ఉదయలక్ష్మీ నరసింహతారావళి, భావనారాయణ చరిత్ర, దివ్యస్మృతులు, త్రిశతి, నెహ్రూ చరిత్ర మొదలైనవి వీరి కవితామాగాణంలో పండిన బంగారు పంటలు. లోక ప్రచారకుల బూటకాలను మొగమాటం లేకుండా రచ్చకీడ్చిన వేమన రచనా ప్రభావంతో వేంకటకవి రచించిన శతకం 'వేమ” శతకం.

సంస్కృతంలో భర్తృహరి సుభాషితత్రిశతి నీతి, శృంగార, వైరాగ్య శతకాలతో కూడిన శతక త్రిశతి. మత మహామారి దంష్ట్రల, మాత్సర్య భావోన్మత్తులను నిరసించి సౌమనస్యాన్ని జనులకు అలవరచాలని, వర్ణాశ్రమాచారాలను ఎదిరించి హేతువాద దృక్పథాన్ని పెంపొందించాలని కలాన్ని ఆయుధంగా చేపట్టిన వేంకటకవి తమ లక్ష్య సాధనను 'త్రిశతి 'లో సమరంగా నిర్వర్తించారు. ఈ కృతిని ప్రముఖ సంఘ సంస్క్మరణాఖిలాషి అయిన శ్రీ పాములపాటి బుచ్చినాయుడుగారికి అంకిత కావించటం కవి రచనా లక్ష్యానికి దీటైన తార్మాణం.

సాంఘిక దౌస్ట్య వృత్తిని అజ్ఞాకమొనర్చ సమకట్టిన సాంఘిక విప్లవ యోధుడు యోగివేమన వేంకటకవికి సందేశకర్త. శతకం ఆంధ్ర భాషా వ్యక్తిత్వాన్ని నిలబెట్టగల విశిష్ట ప్రక్రియ. ఆత్మాశ్రయాను భవాలను ప్రత్వక్షంగా వినిపించటానికి వీలు కల్పించిన ప్రక్రియ తెలుగునాట, తెలుగువారి నోళ్ళలో పుట్టి, తెలుగుజాతి సంస్కృతిని ప్రతిఫలించే సుభాషితాల సౌందర్యాలను సామెతల సోయగాలను, నానుడుల, లోకోక్తుల విలాసాలను పదిలంగా భద్రపరచి భావితరాలకు అందించటానికి అనుగుణమైనది శతక ప్రక్రియ. సాంఘిక విప్లవానికి తేటతేట ఆటవెలది ఛందస్సును వాహకంగా స్వీకరించి వేలకొలది పద్యరత్నాలను తెలుగుజాతికి అందించిన వేమన ఆదర్భంగా వేంకటకవి ఆటవెలదులలో ముచ్చటగా రచించిన త్రిశతిలోని “వేమ” శతకం బహుథా ఆదరణీయం.

వేమన జీవితగాథను వేమన జోధనలోనీ ప్రధానాంశాలను ఈ శతకంలో వేంకటకవి వర్ణించారు. కవి ఆకాంక్షించిన వినూత్న సమాజా విష్కరణ మార్గదర్శక సూత్రాలకు అందమైన ఆకృతి “వేమ" శతకం.

“కులబలమ్ము పుంజికొనువేళ జనియించి
వైకులాల టెక్కు బాఱద్రొలి
బీదబిక్కి కింత విన్నాణముంగూర్చి
నేర్పితీవు పజ్జనిలువ వేమ” - 6 ప

సమాజంపై కులఖేదం తీవమైన 'ప్రభావాన్నీ చూపుతున్న కాలంలో జన్మించినా తన సాహసోపేతమైన బోధనలతో అగ్రవర్జాల దురహంకారానికి అద్దుకట్టవేసి బీదబిక్కి జనులకు విజ్ఞానాన్ని పంచిన మహనీయుడు వేమన అని తన అంతరంగంలో గూడుకట్టుకున్న గౌరవభావాన్ని ప్రకటించారు వేంకటకవి.

ప్రజాకవి వేమన జనులను అజ్ఞానాంధకారంనుండి జ్ఞాన చైతన్యందిశగా నడిపించటానికి కవితామార్దాన్ని ఎంచుకున్నాడు. నిరక్షరాస్యుల హృదయాలలో విజ్ఞానవీచికలను ప్రసరింపచేయటానికి

32

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్‌ - 2019