పుట:Ammanudi-June-2019.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మెంట్‌ స్కిల్స్‌ అంటా... పిచ్చెక్కుతుంది డాక్టర్‌

“నిజమే రాజూ నువ్వు చెప్పినవన్నీ చాలా నిజం. మనసు విప్పి హాయిగా మన భాషలో మాట్లడుకోలేకపోతే ఇక మనను మూగబోతుంటుంది. కానీ రాజూ...అమ్మా..."సెలవలకు తాతగారింటికి వెళ్తాను అని ఓ చిన్నమాట అడగవచ్చుగా ఒప్పించి వెళ్ళ వచ్చుగా... ఎందుకంత చిరాకుపడి అరిచీ తల కొట్టుకున్నావు?”

“అయ్యో డాక్టర్‌... ఇవ్వాళా చాలా మంది అమ్మానాన్నల దృష్టిలో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పిల్లలు చెడిపోతారనే. ..మేము పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళినా వాళ్ళ బుద్దులూ మాటతీరు నేర్చుకున్నామనే తిట్లు...తెలుగులోనే మాట్లడేస్తున్నామనే బాధ. తాతగారింటికి వెళ్తాను అంటే ఆ ముసలోల్లను కూడా తిట్టే పెద్దలు ఉన్నారు...”

“అసలు తెలుగు మీడియం చదువులు వద్దు సరే. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడాలి అదీ సరే డాక్టర్‌.. కానీ ఇంట్లో కూడా నా మాతృభాషను నా తల్లిదండ్రులే లేదా నా తల్లి దండ్రుల వంటి వారే అనుమతించడం లేదు. ఇది ఎంత ఘోరం ఆఫీసులు, బస్‌లూ, బాంకు లూ అన్నీ అంగ్లమయం చేసేసారు సరే... బంధుమిత్రులు నలుగురు కలిసినా అదే ఇంగ్లీష్‌లోనే క్షేమ సమాచారాలు పలకరింపులు నూ... అవసరం ఉన్నా లేకున్నా అందరూ ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలనే చూస్తారు. బడులన్నీ ఉద్యోగాల రాబడులే. వారి ప్రయోజనాలు వేరే.

కానీ తెలుగు లోగిళ్ళు కూడా ఆంగ్ల మయమే డాక్టర్‌.

ఇంత చిన్నవానిలో ఎంత సృష్టమయిన ఆలోచనలు ఉన్నాయి. అవి ఇన్నాళ్ళు అతనిలో అణిగిపోయి ఎంత మూగవాన్ని చేసాయి. తను తెలుగులో పలకరించేసరికి ఆ భావాలన్నీ ఎలా వెల్లువయి వెలికి వచ్చాయి... ఆశ్చర్య పడుతూనే చాలా సేపు రాజుతో డా.అరవింద్‌ హాయిగా మాట్లా డాడు...

కాస్సేవటికి భయం భయంగా మాయా, మారుతీరావ్‌ లు వచ్చారు. డాక్టర్‌ ఏమంటాడో అని అతని వంకే చూస్తూ నించున్నారు...

డా. అరవింద్‌ “మీ అబ్బాయికి ఓ నెలరోజులు స్థలమార్చిడి కావాలి...” అన్నాడు

“చెప్పండి డాక్టర్‌. ఎక్కడకు పంపమంటారు..? బెంగళూర్‌... ?

"బెంగళూర్‌కేం మీరు తలుచుకుంటే బాంకాక్‌కి కూడా మీరు పంపగలరు. నాకు తెలుసు. కానీ రాజును ఇదిగో ఇక్కడికి పంపండి చాలు రాజాలా ఉంటాడు...” అని ప్రిస్మిష్పన్‌ పై తెలుగులో అని రాసిచ్చాడు. వాళ్ళిద్దరూ దాన్ని ఆత్రంగా అందుకుని చూసారు...

“కపిలేశ్వరపురం...”

అది చదివి “అక్కడికి దేనికి డాక్టర్‌..? అసహనంగా అరిచింది మాయ

“తెలుగు లోగిలి కోసం.. మూగవానిగా మారిపోతున్న రాజు స్వరం తెలుగును ఠవలించడం కోసం...”

“డాక్టర్‌...” మాయ ఎదో అనబోతుంటే వినిపించుకోకుండా వెలుగులీనుతున్న రాజు మోమును తృప్తిగా చూస్తూ పోన్‌ అందుకుని “శారదా...పిల్లల బట్టలు సర్దు. ఓ పదిరోజులు వాళ్ళ తాతగారింటికి వెళ్లోద్దాం” అని చెప్పాడు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019

31