పుట:Ammanudi-June-2019.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీసుకెళ్ళే అవకాశమే ఇచ్చేటట్టు లేడు కదా...” అనుకున్నాడు ఎందుకయినా మంచిదని... రాజు ముందు కూర్చుని “రాజూ...ఇదివరకెప్పుడూ నువ్విలా ఇలా ప్రవర్తించలేదు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావో అర్దంకావడం లేదు...ఒకసారి బయటకు వెళ్టామా...?” అను నయంగా అడిగాడు. మొదట రాజు ఏమీ జవాబు చెప్పలేదు.

“చూడు రాజు... సెలవలు ఇచ్చిన దగ్గరనుండీ నిన్ను ఎక్కడికీ తీసుకెళ్ళకుండా ఇంట్లోనే ఉంచేసాము. రియల్లీ సారీ నేను డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాలి నువ్వుకూడా మాతో రా. నేను డాక్టర్‌ దగ్గరకు చూపించుకున్నకా ఏదయినా పార్క్‌ కి వెళ్దాము సరేనా.”

అడిగాడు రాజుకు కూడా తానూ అట్లా ప్రవర్తించడం తనకే కూడా నచ్చడం లేదు. తానున్న మానసిక స్తితిలో తండ్రి ఎందుకు డాక్టర్‌ దగ్గరకు వెళ్ళాము అంటున్నాడో కూడా ఆలోచించలేదు. బయటకు వెళ్ళాము అన్నదే అర్ధం అయ్యి “సరే...” అన్నాడు రాజు.

రాజు ఏ స్కూల్‌ లో చదువుతున్నాడో తెలుసుకున్నాక... చక్కటి ఇంగ్లిష్లో సంభాషణ మొదలు పెట్టాడు డాక్టర్‌ అరవింద్‌. అనాసక్తంగా జవాబులు చెప్పాడు రాజు మాయా మారుతిరావ్‌ లను చూస్తే చాలా హుందాగా చక్కగా కనిపించారు. రాజును చూస్తే చాలా ఆరోగ్యంగా తేటగా ఉన్నాడు. సమస్యల్లా ఎనిమిదవ తరగతి చదువుతున్న రాజు...

అమ్మానాన్నలకు అనుగుణంగా ప్రవర్తించడంలేదు. ఇప్పటి పిల్లలా ఏ కోర్స్‌ లో చేర్చిస్తే ఆ కోర్స్‌ లో చేరడంలేదు. రాజు పరిస్తితి ఏమిటో ఎలా పరిష్కరించాలో మొదట అస్సలు అర్ధంకాలేదు డాక్టర్‌ అరవింద్‌కి.

“మీరు ఏమయినా పనులుంటే చూసుకుని ఓ రెండుగంటలాగి రండి...” అని చెప్పాడు మాయా వాళ్ళకు. అమ్మ నాన్నా అలా తనను వదిలి వెళ్ళడం ఎందుకో స్వేచ్చగా అనిపించింది రాజుకు కూడా. అటూ ఇటూ హుషారుగా పచార్లు చేయ సాగాడు. ఈలోగా మిగితా వారితో మాట్లాడు తూనే ఒక వంక రాజును గమనించసాగాడు డాక్టర్‌ అరవింద్‌. ఇద్దరు ముగ్గురితో మాట్లాడి పంపాక స్టూల్‌ దగ్గరకు లాక్కుని రాజుతో సంభాషణ ప్రారంభించాడు.

చిత్రంగా రాజునే మాటలు మొదలు పెట్టాడు. రాజుకు తెలియకుండా ఫోన్‌ లో రికార్డర్‌ ఆన్‌ చేసాడు డా అరవింద్‌...

“ఒక మాట అడగవచ్చా అంకుల్‌.” అన్నాడు. “అడుగు...” అన్నాడు. డాక్టర్‌.

“ఇది స్కూల్‌ కాదు. ఇల్లు కాదు. మీరెందుకు వచ్చిన వాళ్ళతో ఇంగ్లీష్‌ లో మాట్లాడుతున్నారు?” అని అడిగాడు

“అదేంటి గమ్మత్తుగా ఉందే ప్రశ్న... స్కూల్‌ కాదు కదా అన్నావు నిజమే. స్మూల్‌ లో ఇంగ్లీషే మాట్లాడుతారు. నువ్వేంటి అట్లా అంటున్నావు. ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఇల్లు కాదు కదా అంటున్నావు. ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడుతారా?”

“అవునంకుల్‌ ఇంట్లో కూడా ఇంగ్లీష్‌ మాట్లాడితేనే పిల్లలకు ఇంగ్లీష్‌ బాగ వస్తుందని పేరెంట్స్‌ మీటింగ్‌లో తల్లిదండ్రులకు చెప్తారు. దాంతో మా అమ్మానాన్నాలాంటి వారంతా మాలాంటి పిల్లలతో ఇంగ్లీష్‌ లోనే మాట్లాడుతారు.

కొంత ఆశ్చర్యంగా అనిపించినా..

“సొ వాట్‌... నిజంగానే ఇంగ్లీష్‌ బాగా వస్తుంది కదా...” రాజు ఏమీ మాట్లాడలేదు.

మౌనంగా కూర్చున్నాడు. “కమాన్‌ మాటాడు రాజు...డమ్ లా అలా కూర్చున్నావేం...?

“ఎస్‌ ఐ యామె దమ్‌. అరిచాడు రాజు. *ఐ బికేమ్‌ ఏ గమ్‌... నో...నో దే మెడ్‌ మీ డమ్‌

“మళ్ళీ గట్టిగా అరిచాడు. డాక్టర్‌ మౌనం వహించాడు.

“అమ్మా వాళ్ళు అనుకుంటున్నారు... నాకు ఏమీ రాదనీ. మిగితా పిల్లలకంటే నేను చాలా వెనకబడి ఉన్నానని. కానీ కాదు. నాలో వేలవేల భావాలూ ఉన్నాయి...మా అమ్మా నాన్న చేర్పించిన అతి పెద్ద బడిలో మొదటి రోజున వాళ్ళు అడిగిన ఓ ప్రశ్చకు నేను చాలా సహజంగా హాయిగా తెలుగులో జవాబు చెప్పబోయాను. వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడి నన్ను వారించారు. ఇక నుండీ ఏది మాట్లాడినా ఇంగ్లీష్‌ లోనే మాట్లాడమని కఠినంగా చెప్పారు. నేను చిన్నబోయి మరి మాట్లాడలేకపోయాను. అంతే ఆ రోజు నుండీ అసలు ఏమీ మాట్లాడబుద్ది కాలేదంతే. పైగా అదే రోజున ఓ అమ్మాయి తెలుగులో మాట్లాడిందని..."ఐ స్పీక్‌ ఓన్లీ ఇంగ్లీష్‌ " అన్న బోర్డ్‌ ఆమె మెడలో వేలాదదీసి స్కూల్‌ అంతా తిప్పారు. నాకెందుకో చాలా విరక్తిగా అనిపించింది. ఇంగ్లీష్‌ నేర్చుకోవడం, ఇంగ్లీష్‌లో మాట్లాడడం చాలా సులువు. మా పై చదువులకు మా భవిష్యత్తుకు ఇంగ్లీష్‌ చాలా అవసరం కూడా అయి ఉండవచ్చు. కాదనను. కానీ కన్న తల్లితండ్రితో కూడా ఇంగ్లీష్‌ లోనే మాట్లాడుకోమ్మని వారు సూచించడం... దాన్ని శిలా శాసనంగా మా వాళ్ళు ఆచరించడం నన్ను లోలోన దహించివేనింది... అందుకే రాంక్‌ కోసం పడిపడి చదవను. నాకు చదవాలనిపించినప్పుడే చదువుతాను. నాకు జవాబు చెప్పాలనిపింనినప్పుడే చెబుతాను. చాలాసార్లు. అవును చాలాసార్లు నేను మౌనంగా మిగిలిపోయాను. ఆర్‌ యూ ఏ డమ్‌...? అంటారు. నేను దానికీ ఏమీ మాట్లాడను.*

“మరి ఎప్పుడు రాజు నువ్వ హాయిగా మాట్లాడేది..?” డాక్టర్‌ అనునయంగా అడిగాడు

“వేసవిలో డాక్టర్‌... కేవలం వేసవిలో... నేను హాయిగా మాట్లాడుకుంటాను. ప్రతి వేసవిలో మా నాయనమ్మా తాతయ్యల ఊరికి వెళ్తాను. వాళ్ళ దగ్గర నోరార హాయిగా మాట్లాడుకుంటాను. సంవత్సరంపాటు నాలో ఉన్నభావాలన్నీ అక్కడ మా వాళ్ళతో పంచు కుంటాను. మా నాయనమ్మ మాటల్లో ఎన్నెన్ని సామెతలో సంబరంగా వింటాను. మా తాత నోట పద్యాలు విని పరవశించి పోతుంటాను. మా అత్తలూ, మామలూ సరదాగా మాట్లాడే మాటల్లో హాయిని పొందుతాను. నాకు ఎంతో ఇష్టమయిన వేసవి. ఎప్పుడో రానున్న విద్వా సంవత్సరాల్లో నేను చదవబోయే టెన్త్‌ క్లాస్‌ కోసం..

ఇప్పటినుండే కోచింగ్‌ అంటా... అది చాలక ఐ ఐ టీ కోచింగ్‌ అంటా, మానేజ్‌

వినియోగించేకొద్దీ భాష వికసిస్తుంది. వాడనిభాష వాడిపోతుంది

3

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019